వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాట్‌టాపిక్‌గా మారిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు...! బీజేపీలో విలీనం చేస్తారంటూ వైసీపీ కామెంట్స్...

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం దేశానికి అమిత్ షా లాంటీ నేతలు అవసరమని, నెమ్మదిగా చెబితే వినే రోజులు పోయాయని ఇలాంటీ సంధర్భంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా లాంటీ వ్యక్తులు అవసరమని ఆయన పోగడడం ఏపీ రాజకీయా వర్గాల్లో సంచలనంగా మారాయి. మరోవైపు పవన్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు సైతం మరింత అజ్యం పోశారు. పవన్ చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏంటని ప్రశ్నించారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు.

బీజేపీలో విలీనానికి పవన్ కల్యాణ్ భారీ ఏర్పాట్లు...?బీజేపీలో విలీనానికి పవన్ కల్యాణ్ భారీ ఏర్పాట్లు...?

గతంలో ఇలాంటీ ప్రచారమే...

గతంలో ఇలాంటీ ప్రచారమే...

పవన్ కళ్యాణ్ రాజకీయా ప్రస్తానంలో బీజేపీకి పూర్తి మద్దతు ఇచ్చారు. దీంతో గత ఎన్నికలకు ముందే బీజేపీలో పార్టీని విలీనం చేస్తారని ప్రచారం కూడ కొనసాగింది. అయితే అందరి అంచనాలను తలిక్రిందులు చేస్తూ... పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేశారు. దీంతో ఎవ్వరు ఊహించనట్టుగా ఎన్నికల్లో పవన్ చతికిలపడ్డారు. పార్టీ అధ్యక్షుడిగా పోటి చేసిన పవన్ కళ్యాణ్ ఓటమి కాగా ఆ పార్టీ నుండి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలుపోందాడు. అయినా వెనక్కి వెళ్లకుండా... రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో పాటు ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

కేంద్ర అధికార పార్టీని విమర్శించని పవన్‌కళ్యాణ్

కేంద్ర అధికార పార్టీని విమర్శించని పవన్‌కళ్యాణ్

ఇక ఎన్నికల తర్వాత కూడ పవన్ కళ్యాణ్ బీజేపీపై మాత్రం ఎలాంటీ వ్యతిరేకతను ప్రదర్శించ లేదు. రాష్ట్ర అభివృద్దికి బీజేపీని పెద్దగా విమర్శించిన పరిస్థితి కూడ ఎక్కడా...కనిపించలేదు. దీంతో ఆయన మరోసారి బీజేపీతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది. ఇందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కూడ వ్యవహరిస్తు వస్తున్నారు... రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీకి దృష్టికి తీసుకువెళతానని పలుసార్లు ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇటివల తెలుగు బాషపై పెద్ద ఎత్తున ఆందోళన తెలిపిన పవన్, ఈ అంశాన్ని ఢిల్లీ నేతలను వివరిస్తానని ప్రకటించారు. అనంతరం ఆయన చేసిన డిల్లీ పర్యటన పెద్ద దుమారమే రేగింది.

ఢిల్లీ పర్యటన తర్వాత దూకుడు పెంచిన పవన్

ఢిల్లీ పర్యటన తర్వాత దూకుడు పెంచిన పవన్

ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మరిన్ని రాజకీయ వ్యుహాలకు పదును పెట్టారు. ఈ నేపపథ్యంలోనే ఆరు రోజుల పాటు రాయలసీమలో పర్యటన చేస్తున్నారు. వైసీపీకి అంత్యంత పట్టుగా మారిన ప్రాంతంలో ఆయన పర్యటన కొనసాగిస్తూ... ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ మరోసారి బీజేపీ ప్రస్తావన తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌పై విరుచుకుపడుతూనే... కేంద్రంలో అమిత్ షా తీరును మెచ్చుకున్నారు. ప్రస్తుత రోజుల్లో ఎవరు నెమ్మదిగా చెబితే వినరని... అమిత్ షా లాంటీ వ్యక్తులు దేశ రాజకీయాలకు అవసరమని ప్రస్తావించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఆ వ్యాఖ్యలు తనకు బీజేపీతో ఉన్న సంబంధం చెప్పకనే చెబుతున్నాయనే సంకేతాలను ఇస్తున్నాయనే చర్చ తెరలేచింది.

 పవన్ వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకున్న వైసీపీ

పవన్ వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకున్న వైసీపీ


ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు సైతం వెంటనే అందిపుచ్చుకున్నారు. ఆయన ఆమిత్ షాను అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను రాజకీయ విమర్శలుగా మలిచారు. అమిత్ షా గతంలో కూడ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయమని అడిగారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం అంటూ ప్రశ్నలు సంధించారు. జనసేనను బీజేపీలో విలీనం చేసేందుకే పవన్ కళ్యాణ్ భారీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారని మంత్రి కొడాలి నానీతో పాటు పేర్నీ నానీలు అన్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య మరోసారి మాటల యుద్దం కొనసాగుతోంది. అయితే వైసీపీ నేతలు సంధించిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలా ఎదుర్కొంటారో అనేది వేచి చూడాలి.

English summary
Janasena chief PawanKalyan's comments on Amit Shah have become a hot topic in AP.now a days like Amit Shah leadership need to the country pawankalyan said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X