వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పయ్యావులకు మంత్రి పదవి ఇవ్వాలన్న జేసీ: బాబు వద్ద ధూళిపాళ్ల భావోద్వేగం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. తనకు మంత్రి ఇవ్వాలంటూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర భావోద్వేగానికి గురయ్యారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. తనకు మంత్రి ఇవ్వాలంటూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర భావోద్వేగానికి గురయ్యారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాను పార్టీ కోసం ఎంతో చేశానని ధూళిపాళ్ల చెప్పినట్లు తెలిసింది.

బాబుకి విస్తరణ తలనొప్పి: రామసుబ్బారెడ్డి Vsఆది, బుజ్జగింపులూ..హెచ్చరికలూబాబుకి విస్తరణ తలనొప్పి: రామసుబ్బారెడ్డి Vsఆది, బుజ్జగింపులూ..హెచ్చరికలూ

అంతేగాక, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టినట్లు సమాచారం. కన్నాను ఎదురించి తాను పార్టీ కోసం పోరాడానని ఆయన చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తనకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబును ధూళిపాళ్ల కోరినట్లు తెలిసింది. ఆయనతోపాటు పయ్యావుల కేశవ్ కూడా కలిసి మంత్రి పదవిపై చర్చించారు.

payyavula keshav should get minister post, says JC Diwakar Reddy

పయ్యావులకు జేసీ మద్దతు

ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని తాను ఎప్పట్నుంచో కోరుతున్నట్లు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం అందరి ప్రతిపాదనలను సీఎం వింటున్నారని, ఆయన మనసులో ఏముందో? అని అన్నారు. ఇమేజ్ ఉన్న నాయకులకే మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పారు.

ఇది ఇలా ఉండగా, మంత్రి పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి తెలిపారు. తనకు మంత్రి ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు చెప్పారు. పార్టీ టికెట్ పై గెలిచిన వారికే మంత్రి ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డవారికే ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు.

English summary
TDP MP JC Diwakar Reddy on Saturday said that MLC Payyavula Keshav should get minister post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X