వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో రోడ్డెక్కిన వేరు శనగ రైతన్న .. విత్తనాల కోసం రహదారి దిగ్బంధం

|
Google Oneindia TeluguNews

ఖరీఫ్ సీజన్ మొదలు కావటంతో రైతులు దుక్కులు దుక్కేందుకు రెడీ అయ్యారు. కానీ..ఎప్పటిలాగానే విత్తనాల కొరత ఏర్పడడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు రోడ్డెక్కారు. విత్తనాల కేంద్రాల వద్ద ఆందోళనలు, రాస్తారోకోలు చేపట్టారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించినా వ్యవసాయ శాఖామంత్రి కన్నబాబు విత్తన సేకరణ గత ప్రభుత్వం చెయ్యలేదని అందుకే రైతన్నలకు ఈ సమస్య వచ్చిందని చెప్తున్నారు. కానీ రైతన్నలు మాత్రం విత్తనాల కోసం కన్నెర్ర చేస్తున్నారు.

ఏపీలో ఆగని టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఫ్లెక్సీల రచ్చ .. నిన్న చిత్తూరు , నేడు గుంటూరులో రగడఏపీలో ఆగని టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఫ్లెక్సీల రచ్చ .. నిన్న చిత్తూరు , నేడు గుంటూరులో రగడ

Recommended Video

ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీ చక్కని వేదిక-స్పీకర్
ఆంధ్ర ప్రదేశ్ లో వేరు శనగ విత్తనాల కొరత .. ఆందోళనలో రైతన్నలు

ఆంధ్ర ప్రదేశ్ లో వేరు శనగ విత్తనాల కొరత .. ఆందోళనలో రైతన్నలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్తనాల సంక్షోభం రైతులను ఆందోళన బాట పట్టించింది . ఏపీలో రైతులు విత్తనాల కోసం గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం గత ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ విత్తనాల సరఫరాపై దృష్టి సారించకపోవటంతో రైతన్నలు రోడ్డెక్కారు . వ్యవసాయ విత్తనాలు అందకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఖరీఫ్ సీజన్ మొదలైనా విత్తనాలు అందించక పోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. సబ్సిడీ విత్తనాల కోసం వ్యవసాయ మార్కెట్ యార్డుల ముందు బారులు తీరారు .

చిత్తూరు జిల్లాలో రోడ్డెక్కిన రైతన్నలు .. విత్తనాల కోసం రహదారి దిగ్బంధం

చిత్తూరు జిల్లాలో రోడ్డెక్కిన రైతన్నలు .. విత్తనాల కోసం రహదారి దిగ్బంధం

తాజాగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో వేరుశనగ రైతులు విత్తనాల కోసం రోడ్డుపై బైఠాయించారు. తమకు వేరుశనగ విత్తనాలను ఇంతవరకూ వ్యవసాయ అధికారులు సరఫరా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్సిడీ విత్తనాల కోసం ఎంతగా అర్ధిస్తున్నా పట్టించుకున్న నాధుడు లేరని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని 2 గంటల పాటు రోడ్డును దిగ్బంధించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి విత్తనాలు సరఫరా చేయిస్తామనీ, ఆందోళనను విరమించాలని రైతులను కోరారు. దీంతో శాంతించిన రైతన్నలు తమ ఆందోళనను విరమించారు.

అనంతపురంలో వేరుశనగ విత్తనాల కోసం రోజురోజుకీ ఉధృతం అవుతున్న ఆందోళనలు .

అనంతపురంలో వేరుశనగ విత్తనాల కోసం రోజురోజుకీ ఉధృతం అవుతున్న ఆందోళనలు .

ఇక ఇటుపక్క అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతన్నలు ఆందోళనను ఉధృతం చేశారు. మొన్నటికి మొన్న గుత్తిలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తే, రాయదుర్గంలో మార్కెట్ యార్డు ఎదుట ధర్నా చేశారు. వేరు శనగ విత్తనాల పంపిణీలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతుల ఆందోళన తీవ్రతరం అవుతోంది. పామిడిలో 44వ జాతీయ రహదారిన్ని నిర్భందిస్తే, గుత్తిలో రోడ్డుపై ముళ్ల కంపలు వేసి రాస్తారోకో చేశారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం మార్కెట్ యార్డుల దగ్గర పడిగాపులు పడుతున్నారు రైతులు.

గతం కంటే సాగు పెరగటంతోనే విత్తన కొరత అన్న వ్యవసాయాధికారులు .. బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని రైతుల ఆరోపణ

గతం కంటే సాగు పెరగటంతోనే విత్తన కొరత అన్న వ్యవసాయాధికారులు .. బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని రైతుల ఆరోపణ

ఇక అధికారుల వెర్షన్ వేరేలా ఉంది . గత సంవత్సరంలో రెండు లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు కానీ ఈసారి నాలుగు లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసేందుకు రైతులు ముందుకొచ్చారని..అందుకే విత్తనాల కొరత ఏర్పడిందని అధికారులు పేర్కొనడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. సబ్సిడీ విత్తనాలను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారంటూ రైతులు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రైతుల సమస్యను పట్టించుకోవడం లేదని, విత్తనాల సరఫరా చెయ్యటం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, జనవరిలోనే విత్తన సేకరణ చెయ్యాల్సిన గత ప్రభుత్వం అలా చెయ్యలేదని విత్తనాలకు కేటాయించాల్సిన మొత్తాన్ని అప్పటి సీఎం చంద్రబాబు దుర్వినియోగం చేశారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.

English summary
Recently, peanut farmers in Thamballapalle in Chittoor district laid down the road for seeds. The agricultural authorities are angry that they have not yet supplied peanut seeds. The road was blocked for 2 hours to do justice to them. Knowing this, the police reached the scene of the heist.The farmers have been asked to quit the agitation by talking to the agricultural authorities and supplying the seeds. The agitated farmers withdrew their concerns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X