కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో మరో ఎన్నికల సమరం - కుప్పం పై వైసీపీ జెండా ఎగిరేనా : ముహూర్తం ఫిక్స్- ఎక్కడెక్కడ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దమైంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగని మున్సిపాల్టీలతో పాటుగా ఖాళీ అయిన జెడ్పీటీసీ- ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా 12 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 మునిసిపాలిటీలలో వచ్చే నెల 7 లేదా 8 తేదీల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

నెల్లూరు..32 మున్సిపాల్టీల్లో ఎన్నికలు

నెల్లూరు..32 మున్సిపాల్టీల్లో ఎన్నికలు

ఈ ఏడాది మార్చిలో మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించిన సమయంలో వివిధ కారణాలతో నాలుగు మునిసిపల్‌ కార్పొరేషన్లతో పాటు 32 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

అందులో భాగంగా.. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మునిసిపాలిటీ, బుచ్చిరెడ్డిపాలెం(నెల్లూరు), ఆకివీడు(పశ్చిమగోదావరి), జగ్గయ్యపేట, కొండపల్లి(కృష్ణా), దాచేపల్లి, గురజాల(గుంటూరు), దర్శి(ప్రకాశం), బేతంచెర్ల(కర్నూలు), కమలాపురం, రాజంపేట(వైఎస్సార్‌), పెనుకొండ(అనంతపురం) మునిసిపాలిటీలలో తాజాగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.

14 జెడ్పీటీసీలు.. సర్పంచ్ ఎన్నికలు సైతం

14 జెడ్పీటీసీలు.. సర్పంచ్ ఎన్నికలు సైతం


వీటితో పాటుగా..రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు 71 గ్రామాల్లో సర్పంచ్, 176 స్థానాల్లో ఎంపీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచి చనిపోయిన కారంపూడి(గుంటూరు), లింగాల(వైఎస్సార్‌), కొలిమిగుండ్ల(కర్నూలు) స్థానాలతో పాటు, పోలింగ్‌ జరగక ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోయిన కారణంగా ఎన్నిక నిలిచిన మరో 11 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.

వచ్చే వారం నోటిఫికేషన్ కు ఛాన్స్

వచ్చే వారం నోటిఫికేషన్ కు ఛాన్స్


వీటికి సంబంధించి సోమ.. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. నెలాఖరులోగానే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది మార్చిలో మునిసిపల్‌ ఎన్నికలు జరిగిన ఏడు నగర పాలక సంస్థల పరిధిలో వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోయిన 12 డివిజన్లకు, మరో 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 14 వార్డులకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ సందర్భంగానే ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని తాజాగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కూడా నిర్వహించారు.

ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి


అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంచాయతీరాజ్, మునిసిపల్‌ శాఖల కమిషనర్లు కూడా టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అన్నింటికీ కలిపి ఒకే రోజు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది. మునిసిపల్‌ ఎన్నికలు జరిగే తేదీకి ఒక్క రోజు ముందు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు, ఆ తర్వాత రోజు మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించి.. ఆ మరుసటి రోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే, ఈ ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీ ఈ సారి అందరినీ ఆకర్షిస్తోంది.

Recommended Video

హుజురాబాద్ ఉప ఎన్నికలో తానే గెలుస్తానన్న స్వతంత్ర్య అభ్యర్థి ఉప్పు రవీందర్
కుప్పం పైన వైసీపీ జెండా ఎగిరేనా

కుప్పం పైన వైసీపీ జెండా ఎగిరేనా


ఇక్కడ వరుసగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యత సాధించింది. ఇక, కుప్పం మున్సిపాల్టీ పైన వైసీపీ జెండా ఎగుర వేయాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బద్వేలు ఉప ఎన్నిక ఇన్ ఛార్జ్ గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 30వ తేదీ తరువాత కుప్పం పైన ఫోకస్ చేయనున్నారు. చంద్రబాబుకు ఇలాకాలో మున్సిపాల్టీ గెలచుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి గట్టి షాక్ ఇచ్చినట్లవుతుందని వైసీపీ భావిస్తోంది. దీంతో..ఈ సారి జరిగే ఎన్నికల్లో కుప్పం ఎన్నిక కీలకంగా మారనుంది.

English summary
AP SEC planning to conduct pending municipal and local bodies elections in next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X