విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీస్ వాట్సాప్ పనిచేస్తుందా లేదా?....గుడ్‌మార్నింగ్‌ లతో జనాల చెకింగ్:అలా చేయొద్దంటున్న అధికారులు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రజల సౌకర్యార్థం విజయవాడ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నెంబరుకు జనాల నుంచి ఊహించని బెడద ఎదురవుతుండటంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు.

ఒకటికి పదిసార్లు ఫోన్ చేసినా స్పందించని పోలీసులు...స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోని వాళ్లు వాట్సాప్ లో ఫిర్యాదు చేస్తే స్పందిస్తారా?...నిజమేనా?... అసలు పోలీసులు ఇచ్చిన ఆ వాట్సాప్ నంబర్ పనిచేస్తుందా? లేదా?...అనుకున్నారో ఏమో?...అది చెక్ చేసేందుకు జనాలు 'గుడ్‌మార్నింగ్‌', 'గుడ్‌నైట్‌', 'కంగ్రాట్స్‌' మెసేజ్‌లు పెడుతున్నారట. అసలు ఫిర్యాదుల కన్నా ఈ కొసరు మెసేజ్ లు పోటెత్తుతుండటంతో పోలీసులు అల్లాడిపోతున్నారట.

పోలీసులకు...శుభాకాంక్షల వెల్లువ

పోలీసులకు...శుభాకాంక్షల వెల్లువ

క్యాపిటల్ జోన్ సిటీ విజయవాడ వాసుల సౌలభ్యం కోసం పోలీసులు ప్రత్యేకంగా వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వాట్సాప్ నంబర్ కు ఫిర్యాదులు,వినతులు కన్నా వందలాదిగా శుభాకాంక్షలు వెల్లువగా వచ్చిపడుతుండటంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. జనాలు తమని ఇలా శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నందుకు సంతోషపడాలో...ఫిర్యాదుల కన్నా ఇలా అనవసరమైన మెసేజ్ లు ఇస్తున్నందుకు బాధపడాలో అర్ధం కాక తలపట్టుకుంటున్నారట. కారణం ఆ కొసరు మెసేజ్ ల మధ్యలో అసలు మెసేజ్ లు పట్టుకోవడం చాలా కష్టమవుతోందట.

ఏ మెసేజ్ లు...ఎన్నంటే?

ఏ మెసేజ్ లు...ఎన్నంటే?

ఈ పోలీస్ వాట్సాప్‌ నెంబరుకు నాలుగు రోజులుగా మొత్తం 532 మెసేజ్‌ల రూపంలో ఫిర్యాదులు వచ్చాయి...ఇందులో 363 మెసేజ్‌లు కేవలం పోలీసులను అభినందిస్తూ ‘కంగ్రాట్స్‌.. గుడ్‌మార్నింగ్‌.. గుడ్‌నైట్‌' అంటూ వచ్చాయి....తొలిరోజు గురువారం అత్యధికంగా 140, శుక్రవారం 128, శనివారం 69, ఆదివారం 26 వచ్చాయి. ఇవే కాకుండా మరో 140 మెసేజ్‌లు విజయవాడ నగరం వెలుపల నుంచి వారి పరిధిలోకి రాని ప్రాంతాల నుంచి కూడా వచ్చాయి.

జనాల మెసేజ్ లు...అందుకోసమట

జనాల మెసేజ్ లు...అందుకోసమట

అయితే ఇంత పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు పంపడం వెనుక కారణం ఆలోచిస్తే పోలీసులకు అప్పుడు జనాల తెలివి అర్థమైందట. అసలు ఈ పోలీసు వాట్సాప్ నంబర్ పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకే వారు ఆ మెసేజ్ లు పంపిస్తున్నారని పోలీసులు అర్థం చేసుకున్నారు. అయితే ఈ నంబర్ పనిచేస్తుందని, ఇకపై కూడా పనిచేస్తూనే ఉంటుందని...అందువల్ల అలా చెక్ చేయాల్సిన అవసరం లేదని...ఇకమీదట ఇలాంటివి పంపవద్దని అధికారులు కోరుతున్నారు. అంతేకాకుండా నగరం పరిధిలో లేని వారే అత్యధికంగా ఇలాంటి మెసేజ్‌లు పంపిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇలా అనవసర సంక్షిప్త సందేశాల (మెసేజ్‌) వల్ల దీనిని ఏర్పాటు చేసిన ఉద్దేశం నెరవేరకుండా పోతుందని, ఎవరికైనా సమస్యలుంటేనే ఈ నెంబరుకు మేసేజ్‌లు పెట్టాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.

పోలీసు వారి...విజ్ఞప్తి

పోలీసు వారి...విజ్ఞప్తి

పోలీసుల వద్దకు నేరుగా వెళ్లేందుకు బిడియపడేవారు, జంకేవారి కోసం ప్రత్యేకంగా నగర పోలీసులు ఈ వాట్సాప్‌ నెంబరును ఏర్పాటు చేసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే ఏదైనా కీలక సమాచారం అందించాలన్నా ఈ నెంబరుకు పంపించవచ్చని తెలిపారు. అయితే దీనికి కాల్స్‌ చేయడానికి వీలు ఉండదని... కేవలం టెక్ట్స్, వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లను పంపించే వెసులుబాటు మాత్రమే ఉంటుందని పోలీసులు వివరించారు. దీని కోసం 73289 09090 నెంబరును కేటాయించారు. అంతేకాకుండా పోలీసుల నుంచి తమకు ఇబ్బంది ఉందని భావించినా ఈ నెంబరు వాట్సాప్‌కు పంపించవచ్చు. కానీ గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ వ్యవస్థకు చాలా మంది ఇది పనిచేస్తోందా? లేదా? అని పరీక్షించడం కోసం మెసేజ్‌లు పంపుతున్నారని, ఇలాంటివి పంపొద్దని పోలీసుశాఖ ఉన్నతాధికారులు కోరుతున్నారు.

ట్రాఫిక్‌ సమస్యలు...ఇట్టే పరిష్కారం..

ట్రాఫిక్‌ సమస్యలు...ఇట్టే పరిష్కారం..

మిగతా సమస్యలు,ఫిర్యాదులకు పరిష్కారం విషయం అటుంచితే ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతోందట. ట్రాపిక్ ఇబ్బందుల గురించి ఈ వాట్సాప్‌ నెంబరుకు మొత్తం 29 ఫిర్యాదులు వచ్చాయని...అందులో అత్యధికంగా నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు, ట్రాఫిక్ జామ్ లను తెలుపుతూ సందేశాలు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇలా విజయవాడ నగరంలోని ట్రాఫిక్‌ సమస్యలకు సంబంధించి 14 మేసేజ్‌లు రాగా...వాటన్నింటినీ పోలీసులు యుద్ధప్రాతిపదికన పరిష్కరించారట. అలాగే శాంతిభద్రతలకు సంబంధించి 12 రాగా...వాటిలో ఎనిమిదిటిపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.

English summary
Vijayawada:The unpredictable response from city residents to Police Whatsapp, who launched by Vijayawada police, is embarrassing policemen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X