• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ రాజకీయాల్లో పుట్టుకొచ్చిన ఆవు..దున్నపోతు! ఎవరసలు?..ఆయనకు పాల వ్యాపారమే దిక్కు

|

అమరావతి: రెండురోజులుగా ఏపీ రాజకీయాల్లో ఆవు, దున్నపోతు అనే పదాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రచార సమయాల్లో కూడా ఇలాంటి పోలికలతో కూడిన పదాలు వినిపించలేదు గానీ..ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడి, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర నెలల తరువాత ఈ కొత్త పోలికలు రాజకీయ తెర మీద వినిపిస్తున్నాయి. ఈ తరహా పోలికలకు తెరతీసిన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తనకు తాను ఆవుగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దున్నపోతుగా పోల్చుకుంటూ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యానాల పట్ల అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటు నెటిజన్లు చంద్రబాబుపై ధ్వజమెత్తుతున్నారు. తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు.

వివాదానికి బీజం పడింది ఇక్కడే..

వివాదానికి బీజం పడింది ఇక్కడే..

‘పాలిచ్చే ఆవును వదిలిపెట్టేసుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లు.. వైఎస్ఆర్సీపీని ప్రజలు గెలిపించారు..`అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండురోజుల కిందట గుంటూరు జిల్లా ఉండవల్లిలో తనను కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు కాస్తా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తమ పార్టీకి 23 సీట్లే ఇవ్వడానికి తానేం తప్పు చేశానో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని.. అదే ప్రజలను అడుగుతున్నానని, చెబితే దిద్దుకుంటానని చెప్పారు. తనను తాను చంద్రబాబు పాలిచ్చే ఆవుగా అభివర్ణించుకోవడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తన్నే దున్నపోతుగా పేర్కొనడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు. చంద్రబాబు ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రజలకు ఆలోచన లోపించిందనే విధంగా కించపరుస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

రోజా తొలి ఆటోగ్రాఫ్.. రోడ్డుపైకి కియా కారు..! ఆవిష్కరించిన మంత్రులు

,చంద్రబాబు పాలిచ్చే ఆవు.. ఆ తరువాతే దున్నపోతుగా తేలింది..

,చంద్రబాబు పాలిచ్చే ఆవు.. ఆ తరువాతే దున్నపోతుగా తేలింది..

చంద్రబాబు పాలు ఇచ్చే ఆవుగా భావించి.. 2014లో ప్రజలు ఆయనకు పట్టం కట్టారని, ఆ తరువాతే చంద్రబాబు తన్నే దున్నపోతు అని ప్రజలు గ్రహించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సి.రామచం‍ద్రయ్య విమర్శించారు. ఎన్నికల్లో తాను ఓటమిపాలు కావడానికి ప్రజలే కారణమని, వారు వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుని తప్పు చేశారని చెబుతోన్న ఏకైక నాయకుడు చంద్రబాబే అన్నారు. పదేపదే ప్రజల విజ్ఞతను ప్రశ్నించడం వల్ల చంద్రబాబు ప్రజా తీర్పును కించపరుస్తున్నారని మండి పడ్డారు. టీడీపీకి భవిష్యత్తు లేదనే నిర్థారణకు వచ్చి అనేక మంది నేతలు ఆ పార్టీని విడిచి వేరే పార్టీల్లోకి వెళ్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్‌ ఢిల్లీలో పర్యటిస్తుంటే.. చంద్రబాబు మతి లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌ ఢిల్లీ వెళ్లి, తనపై మోడీకి ఫిర్యాదు చేశారని బాబు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు.

దున్నపోతులా పనిచేయడమే ఆంధ్రుడికి తెలిసిన విద్య..

దున్నపోతులా పనిచేయడమే ఆంధ్రుడికి తెలిసిన విద్య..

పాలిచ్చే కామధేనువు లాంటి రాష్ట్రాన్ని గత అయిదేళ్ల పాలనలో కాటికి కాళ్ళు చాపేలా చంద్రబాబు చేశారని వైఎస్ఆర్ సీపీ నేత, విజయవాడ లోక్ సభ ఇన్ ఛార్జి పొట్లూరి వరప్రసాద్ విమర్శించారు. రేయనక, పగలనక, ఎండనక, వాననకా, వాగనక, వరదనక, దుక్కి దున్ని, దున్నపోతులా పనిచేయడమే ప్రతి ఆంధ్రుడికి తెలిసిన విద్య అని ఆయన వ్యాఖ్యానించారు. వరుణుడు కరుణిస్తాడని, , రాజశేఖరుడు ఆశీర్వదిస్తాడని ఆయన ట్వీట్ చేశారు.

హెరిటేజ్ లో పాలు అమ్ముకోవాల్సిందే..

చీటికీ, మాటీకి చంద్రబాబు భయపడటాన్ని చూస్తోంటే ఆయన మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయని, అవినీతికి పాల్పడటం వల్ల జైలుకు వెళ్తాననే భయం ఆయనను వెంటాడుతోందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తోంటే చంద్రబాబు తాను అవినీతి చేసినట్లు ఒప్పుకొన్నట్టే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు వైఖరిపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఎన్నికలు ముగిసి ఇన్నిరోజులైనప్పటికీ.. చంద్రబాబుకు ఇంకా తత్వం బోధపడలేదని చురకలు అంటిస్తున్నారు నెటిజనం. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొంటున్న చంద్రబాబు.. తన ఓటమికి గల కారణాలను 60 రోజులైనా పట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు ఆవు కాబట్టే.. ఆ ఆవు పాలను హెరిటేజ్ లో అమ్ముకోవాలనే ఉద్దేశంతో ప్రజలు విశ్రాంతి ఇచ్చారని, ఇక పాల వ్యాపారం చేసుకోవాల్సిందేనని మండిపడుతున్నారు.

English summary
Expressing wonder as to how Telugu Desam suffered a humiliating defeat in the recently held polls, as the people had given landslide majority to the YSR Congress, former chief minister N. Chandrababu Naidu described the act of people in a sarcastic manner by saying that the people left the cow which gives milk and opted for bison that remains violent and destructive, by comparing TD to a cow and YSR Congress as a bison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X