వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయలసీమ వాదానికి ప్రజలు మద్దతివ్వలేదు: బైరెడ్డి

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ కోసం ఏర్పాటు చేసిన ఆర్‌పిఎస్‌ను బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రద్దుచేశారు. . ప్రాధాన్యతను ఇచ్చే పార్టీలో చేరుతానని బైరెడ్డి ప్రకటించారు. తన రాజకీయ భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటానని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. కార్యకర్తలు మాత్రం టిడిపిలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని బైరెడ్డి చెబుతున్నారు. టిడిపిలో చేరేందుకు బైరెడ్డి రంగం సిద్దం చేసుకొంటున్నారు

రాయలసీమ ఉద్యమానికి బైరెడ్డి దూరమయ్యారు. రాష్ట్ర విభజన సమయంతో తాను స్థాపించిన రాయలసీమ పరిరక్షణ సమితిని రద్దు చేశారు. ముచ్చుమర్రి గ్రామంలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తన అనుచరులు, సన్నిహితుల నుద్దేశించి ప్రసంగిస్తూ.. అవినీతికి తావు లేకుండా, నిస్వార్థంగా రాజకీయాలు చేశానని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోతుందని తాను ముందుగానే చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని, విభజిస్తే మూడు రాష్ట్రాలు చేయాలని కోరానని గుర్తు చేశారు.

నంద్యాల ఎఫెక్ట్: ఆర్‌పిఎస్‌కు బైరెడ్డి గుడ్‌బై, అనుచరులతో సమావేశం, టిడిపిలోకినంద్యాల ఎఫెక్ట్: ఆర్‌పిఎస్‌కు బైరెడ్డి గుడ్‌బై, అనుచరులతో సమావేశం, టిడిపిలోకి

people didn't supports to Rayalaseema separate state movement:byreddy

సీమకు జరిగే నష్టాన్ని ముందే గ్రహించి రాయలసీమ రాష్ట్ర సాధన కోసం ఆర్పీఎస్‌ని స్థాపించానన్నారు. 2013లో కేతవరం నుంచి పాదయాత్ర చేపట్టి సీమకు అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ వచ్చాన్నారు. సీమవాదానికి మాత్రం మద్దతు ఇవ్వలేదని అన్నారు. అందుకే రాయలసీమ పరిరక్షణ సమితిని రద్దు చేస్తున్నామని, ఉద్యమానికి ముగింపు పలుకుతున్నామని ప్రకటించారు. కర్నూల్ జిల్లాలో తనకు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి లాంటి నేత ఉన్నారని ఎన్‌టిఆర్ చెప్పిన విషయాన్ని బైరెడ్డి గుర్తుచేసుకొన్నారు.

1994 ఎన్నికల్లో రిగ్గింగులు, దౌర్యాన్యాలు చేయకుంటే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి వంటి నేతలు కూడా ఓడిపోయేవారేనని అన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవచేస్తూ అభివృద్ధి చేశానన్నారు. స్వార్థం లేకుండా, రైతులు, పేద ప్రజల కోసమే పనిచేశానని అన్నారు. కార్యకర్తలతో చర్చించి సీమకు న్యాయం, తనకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీలోకి వెళతానని తెలిపారు.

English summary
people didn't support to Rayalaseema separate state movement said Byreddy Rajashekar reddy.Byreddy Rajasekhar reddy meeting with followers on Tuesday at Muchumarri.Byreddy will join in TDP soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X