వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదేంటి రాపాక మాటమార్చారు.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు

|
Google Oneindia TeluguNews

Recommended Video

జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న రాపాక| Janasena MLA Rapaka Varaprasad On Jagan GOVT

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ఏపీ శాసనసభ వేదికగా ప్రశంసల వర్షం కురిపించి దేవుడితో పోల్చిన రాపాక వరప్రసాద్ మాట మార్చారు. సభలో పలు అంశాలపై జరుగుతున్న చర్చ సందర్భంగాఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండాదండా అన్నీ జగనేనని, దేవుడని ఓ రేంజ్ లో పైకి ఎత్తేసిన ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఇక తాజాగా ఏపీలో ప్రభుత్వ పాలనపై మాట మార్చిన రాపాక జగన్ సర్కార్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వ్యాఖ్యానించారు.

<strong>జగన్ సీఎం అయితే వెంటనే కలవాలా ? పృధ్వీ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన రాజేంద్రప్రసాద్</strong>జగన్ సీఎం అయితే వెంటనే కలవాలా ? పృధ్వీ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన రాజేంద్రప్రసాద్

 అసెంబ్లీలో దేవుడని జగన్ ను ఆకాశానికి ఎత్తేసిన రాపాక .. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని విమర్శలు

అసెంబ్లీలో దేవుడని జగన్ ను ఆకాశానికి ఎత్తేసిన రాపాక .. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని విమర్శలు

జనసేన పార్టీ నుండి ఏకైక ఎమ్మెల్యే గా ఉన్న రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ తరపున మాట్లాడతారు .. ప్రజా సమస్యల కోసం పోరాడతారు అనుకుంటే ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు .జనసేన ఎమ్మెల్యే రాపాక దేవుడంటూ జగన్ ను ఆయనతో పోల్చేశారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని రాపాక వ్యాఖ్యానించి జనసేన నేతలకు షాక్ ఇచ్చారు .
అయితే తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాపాక వరప్రసాద్ విమర్శించారు.

 ప్రభుత్వం పాలనపై దృష్టి కేంద్రీకరించాలని రాపాక హితవు

ప్రభుత్వం పాలనపై దృష్టి కేంద్రీకరించాలని రాపాక హితవు

వైసీపీ అధికారంలోకి వచ్చి నూతన ప్రభుత్వం ఏర్పడిన 60 రోజులకే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని ఆయన తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడి ఉందని రాపాక పేర్కొన్నారు . ప్రభుత్వం పాలనపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కానీ ప్రభుత్వం ఆ పని చెయ్యకపోవటం వల్లే ఇప్పుడు వ్యతిరేకత వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు జగన్ భజన చేసిన రాపాక తాజాగా స్వరం మార్చి జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు .

పవన్ బాటలో సాగేందుకే రూటు మార్చిన రాపాక.. అందుకే జగన్ సర్కార్ పై విమర్శలు

పవన్ బాటలో సాగేందుకే రూటు మార్చిన రాపాక.. అందుకే జగన్ సర్కార్ పై విమర్శలు

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చెయ్యనున్నారని ఆయన తెలిపారు . ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు పవన్ ఓదార్పునిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని రాపాక ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇంతకాలం జగన్ విషయంలో , ప్రభుత్వ పాలన విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యని రాపాక పవన్ ఇచ్చిన సూచనలతోనే తన పంధా మార్చుకున్నారనే భావన వ్యక్తం అవుతుంది. ఇటీవల రాపాకతో సమావేశం అయిన పవన్ రాపాక కు పలు సూచనలు చేసినట్టు సమాచారం . ఇక మరోపక్క పార్టీ పటిష్టానికి కృషి చేస్తున్న జనసేనాని ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ బాటలో సాగేందుకు రాపాక కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.

English summary
Janasena MLA Rapaka Varaprasad said that the people's opposition to the government's rule came only 60 days after the YCP came to power. He said the AP was in serious financial trouble right now. The government should focus on governance. he claimed that the party's achievements were inappropriate
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X