వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలపై మోడీ అభినందన: రాజీనామాపై జగన్‌కు బాబు దిమ్మతిరిగే సవాల్

వైసిపి అధినేత జగన్‌కు ఎన్నికలు అంటే సరదా అని, ఆయనకు అంత ఆసక్తి ఉంటే తన ఎంపీలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: వైసిపి అధినేత జగన్‌కు ఎన్నికలు అంటే సరదా అని, ఆయనకు అంత ఆసక్తి ఉంటే తన ఎంపీలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు.

చదవండి: నమ్ముకుంటే గట్టి షాక్: పెళ్లి రోజే జగన్‌కు ఇలా, పీకే సర్వేకు టిడిపి చెక్

పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని జగన్ పదేపదే డిమాండ్ చేస్తూ, సవాల్ విసురుతుండటంతో చంద్రబాబు పైవిధంగా స్పందించారు. ప్రత్యేక హోదా కోసం జగన్ తన ఎంపీలతో రాజీనామా చేయించాలని ప్రతి సవాల్ విసిరారు.

జగన్‌ను కాంగ్రెస్ జైల్లో పెట్టించింది

జగన్‌ను కాంగ్రెస్ జైల్లో పెట్టించింది

వైయస్ జగన్ పైన నాడు కాంగ్రెస్ పార్టీయే కేసు పెట్టి జైలుకు పంపించిందని, ఆ తర్వాత ఒప్పందంతో ఆయనను తీసుకు వచ్చిందని, దీంతో టిడిపిని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో తెరాసను విలీనం చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ అక్కడా టిడిపిని దెబ్బతీసే ప్రయత్నం చేసిందన్నారు.

Recommended Video

Nandyal By Polls :TDP leading with 9670 votes after 4 rounds | Oneindia Telugu
నంద్యాల ప్రజలది చారిత్రక తీర్పు

నంద్యాల ప్రజలది చారిత్రక తీర్పు

నంద్యాల ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. విశ్వసనీయత అవకాశవాద రాజకీయాలతో రాదని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. గెలుస్తామని చెప్పి, పోటీ పడి వైసిపి అబాసుపాలయిందన్నారు. టిడిపిపై, తనపై జగన్ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయన్నారు.

జగన్ హద్దుదాటారు

జగన్ హద్దుదాటారు

ఎన్నిక ప్రచారంలో జగన్ హద్దులు దాటారని చంద్రబాబు అన్నారు. జగన్ చేసిన విమర్శలు శృతి మించాయన్నారు. మా పని తీరే నంద్యాలలో గెలిపించిందన్నారు. తన పోరాటం ఇందిరాగాంధీతో ప్రారంభమైందన్నారు. ఓ ప్రతిపక్ష నేత పదమూడు పద్నాలుగు రోజులు ఉప ఎన్నికల కోసం తిష్ట వేసిన సందర్భం తాను చూడలేదన్నారు.

ఎన్నికలు నాకు కొత్త కాదు

ఎన్నికలు నాకు కొత్త కాదు

నంద్యాలలో గెలుపుపై తాను మొదటి నుంచి నమ్మకంగా ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ఉప ఎన్నికల ఫలితంతో ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థమైందని చెప్పారు. కష్టపడేతత్వమే మమ్మల్ని గెలిపించిందన్నారు. అనుభవజ్ఞుడనే 2014లో ప్రజలు తనకు అవకాశం ఇచ్చారన్నారు. ఎన్నికలు తనకు ఎప్పుడూ కొత్త కాదన్నారు.

అందుకే డేరాబాబాతో పోల్చారు

అందుకే డేరాబాబాతో పోల్చారు

అక్కడ డేరా బాబు ఉంటే, మనకు జగన్ బాబా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తన శక్తిసామర్థ్యాలను డేరా బాబా మిస్ యూజ్ చేశారన్నారు. బాబాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. బాబా అయి ఉండి మిలిటెన్సీ చేశారన్నారు. ఇక్కడ జగన్ తీరు అలాగే ఉందన్నారు. అందుకే డేరాబాబాతో పోల్చానని చెప్పారు. నంద్యాల తీర్పుతో రాష్ట్రమంతా రిలీఫ్ ఫీలయ్యానని చెప్పారు. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చామని, కిందిస్థాయి నుంచి రాష్ట్రాన్ని ఫస్ట్‌కు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

జగన్ తీరుతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది

జగన్ తీరుతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది

జగన్ తీరుతో నంద్యాల ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని చంద్రబాబు చెప్పారు. ఆయన నిలదీస్తే నేను సమాధానం చెప్పాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు చూస్తున్నామన్నారు. వైయస్సార్, శోభా నాగిరెడ్డి చనిపోతే మేం పోటీ పెట్టలేదని గుర్తు చేశారు. రాయలసీమ అనే పేరే నంద్యాల నుంచి వచ్చిందని చంద్రబాబు అన్నారు. కానీ నంద్యాలను జగన్ పులివెందుల చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నా నియోజకవర్గంలో నేను ముప్పై ఏళ్లుగా గెలుస్తున్నానని, అందుకు కుప్పంలో రౌడీయిజం లేకపోవడం, బెదిరింపులు లేకపోవడం అన్నారు.

జగన్‌కు ఎన్నికలు అంటే సరదా

జగన్‌కు ఎన్నికలు అంటే సరదా

జగన్‌కు ఎన్నికలు అంటే సరదా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎన్నికలు అంటే ఆయనకు అంత ఉత్సాహం ఉంటే ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలతో రాజీనామా చేయించాలని చంద్రబాబు దిమ్మతిరిగే సవాల్ చేశారు. జగన్‌ను వాళ్ల నాన్న వైయస్సే భరించలేకపోయారన్నారు. జగన్ ఇక్కడుంటే తన ఉద్యోగం పోతుందని ఆందోళన చెందారన్నారు. ఎన్నికలు ఫ్రీక్వెంటుగా రావడం మంచిది కాదన్నారు.

ప్రధాని మోడీ అభినందించారు

ప్రధాని మోడీ అభినందించారు

నంద్యాల గెలుపుపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో అభినందించారని చంద్రబాబు చెప్పారు. భూమా బ్రహ్మానంద రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు అని కితాబిచ్చారు.ఎన్నికల సంఘం విషయమై కూడా చంద్రబాబు స్పందించారు.

English summary
People have again shown confidence and trust in development and good governance, says Aandhra Pradesh CM Chandrababu Naidu after the result.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X