వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన' సూపర్ హిట్ (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఢిల్లీలోని విజ్ఞానభవ‌న్‌లో జన్ ధన్ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభంలో పలువురు ముఖ్యమంత్రులు పాల్గోన్నారు. జన్ ధన్ యోజన పథకం లక్ష్యాలను వివరిస్తూ బ్యాంక్ అధికారులకు నరేంద్ర మోడీ స్వయంగా ఈ మెయిల్స్ పంపారు. 7.25 లక్షల ఈ మెయిల్స్‌ను ఆయన పంపారు. దేశ వ్యాప్తంగా 76 కేంద్రాల్లో జన్ ధన్ యోజన ప్రారంభమైంది.

దేశంలోని ప్రతీ కుటుంబానికి బ్యాంకు సేవలు అందాలనే లక్ష్యంతో రూపొందించిన 'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన' పథకానికి విశేష స్పందన లభిస్తోంది. తొలిరోజైన ఈరోజు కోటి మంది చేత బ్యాంకు ఖాతాలు తెరిపించడం కోసం ఏర్పాట్లు చేశారు. ఈ పథకం 2018 నాటికి 7.5 కోట్ల ఇళ్లకు రెండేసి ఖాతాలైనా అందుబాటులోకి తీసుకురావాలనేది లక్ష్యం.

హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో ఈ పథకాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ప్రధాన అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రా బ్యాంక్ నిర్వహిస్తుంది. ఆంధ్రా బ్యాంక్ సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్, ఇతర ఉన్నాతాధికార్లు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తిరుపతిలో ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకంలో బాగంగా తెరవనున్న ఖాతా పేరు 'జన ఖాతా'. ఒక్కో బ్రాంచ్‌లో కేవలం 175 మంది ఖాతాదారులకు మాత్రమే ఎకౌంట్ ఇస్తున్నారు. ఈ జన ఖాతా బ్యాంక్ ఎకౌంట్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఈ పథకంలో భాగంగా ఖాతా ప్రారంభించిన వారికి ఆరు నెలల అనంతరం ఖాతా నుండి రూ.5వేలు రుణం పొందవచ్చునని తెలిపారు. రూ.5వేలు రుణం తీర్చిన అనంతరం రూ.15వేలు రుణం లభిస్తుందని చెప్పారు. రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కూడా ఉంటుందని చెప్పారు.

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన' పథకంలో భాగంగా హైదరాబాద్‌లోని గుడ్డి మలక్‌పుర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో జన సందోహం.

 జన ఖాతా కోసం బారులు తీరిన జనం

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

మాకు జన ఖాతా ఇస్తారా లేదా అంటూ చూస్తున్న కస్టమర్స్. వారిని పట్టించుకోకుండా ఫోన్‌లో మాట్లాడుతోన్న ఉద్యోగి.

 జన ఖాతా కోసం బారులు తీరిన జనం

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

మేడమ్ ప్లీజ్ మా అప్లికేషన్ తీసుకోండంటున్న జనాలు.

 జన ఖాతా కోసం బారులు తీరిన జనం

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

ఆగండి.. ఆగండి అంటున్న బ్యాంక్ అధికారులు. ఫోన్‌లో పుల్ బిజీగా మాట్లాడుతున్న ఓ అధికారి.

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

మేం ముందొచ్చాం. మా అప్లికేషన్ తీసుకొండి. కౌంటర్ ఎదుట నుంచున్న మహిళలు.

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

స్టేట్ బ్యాంక్ బయట తన అప్లికేషన్‌ని మీడియాకు చూపిస్తున్న ఓ మహిళ. పక్కనే నరేంద్ర మోడీ 'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన' పథకం విశేషాలు.

 జన ఖాతా కోసం బారులు తీరిన జనం

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

అప్లికేషన్స్‌తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అధికారి.

 జన ఖాతా కోసం బారులు తీరిన జనం

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

ఒక్కో బ్రాంచ్‌లో కేవలం 175 మంది ఖాతాదారులకు మాత్రమే ఎకౌంట్ ఇస్తున్నారు. ఈ జన ఖాతా బ్యాంక్ ఎకౌంట్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బయట నిల్చోని తమ అప్లికేషన్స్ చూపిస్తున్న జనాభా.

 జన ఖాతా కోసం బారులు తీరిన జనం

జన ఖాతా కోసం బారులు తీరిన జనం

ఈ పథకం ద్వారా చాలా ప్రయోజనాలున్నాయి. ఈ పథకంలో భాగంగా ఖాతా ప్రారంభించిన వారికి ఆరు నెలల అనంతరం ఖాతా నుండి రూ.5వేలు రుణం పొందవచ్చునని తెలిపారు.

English summary
There was a big rush of people to open their Jana khata Government of India scheme accounts in the bank. Every branch was getting hundreds of application​s while the set target was only 175 per branch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X