వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై పేర్ని గుర్రు, అజ్ఞాతం వీడి..: తమ్ముళ్ల హంగామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Perni Nani and Jayamangala heat in Vijayawada
హైదరాబాద్: కృష్ణా జిల్లా మచిలీపట్నం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో పేర్ని నాని వ్యవహారం కలవరం రేపుతోంది. పేర్ని నాని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కూడా చిక్కుకుండా సోమవారం సాయంత్రం వరకు అజ్ఞాతంలోకి వెళ్లారు. సాయంత్రం అజ్ఞాతం వీడి మచిలీపట్నం చేరుకున్నారు. అభిమానులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు.

మాజీ మంత్రి పార్థసారథి, వేదవ్యాస్ పార్టీలో చేరడంపై పేర్ని నాని కినుక వహించినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలంటూ బందరులో పేర్ని నాని నివాసం ఎదుట కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 10 మంది అనుచరులైతే ఏకంగా నాని పోటీ చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టారు.

కైకలూరులో తెలుగు తమ్ముళ్ల హంగామా

కృష్ణా జిల్లాలోని కైకలూరులో తెలుగుదేశం పార్టీ సమావేశం రసాభాసగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు టికెట్ ఇవ్వకపోవడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. టిడిపి కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. వెంకటరమణ వద్దని వారించినా వారు వినిపించుకోలేదు.

పార్టీకి, బాబుకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇద్దరు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నాలు చేశారు. టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఇలాగే చేస్తామని హెచ్చరించారు. కాగా, పొత్తులో భాగంగా కైకలూరు బిజెపికి వెళ్లింది.

English summary
YSRCP Perni Nani and Telugudesam Party MLA Jayamangala Venkataramana heat in Bejawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X