వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ నాయుడూ..మీకు పెళ్లిళ్ల మీద మక్కువ: జగన్ కు ప్రజాసేవ పిచ్చి..పది సార్లు తాట తీస్తారు

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ కావాలంటే తానూ మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చంటూ జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. ఒక్కోక్కరికి ఒక్కో అంశం మీద మక్కువ ఉంటుందని..పవన్ నాయుడుకు పెళ్లిళ్ల మీద ప్రేమ ఉంటే..జగన్ కు ప్రజాసేవ మీద పిచ్చి అంటూ వ్యాఖ్యానించారు. పవన్ ఒక్క సారి తాటతీస్తామంటే..రాజకీయాల్లో పది సార్లు తాట తీస్తారని హెచ్చరించారు.

మీరు పెళ్లిళ్లు చేస్తానన్నా జగన్ చేసుకోరని స్పష్టం చేసారు. ప్రభుత్వ ఎన్నో కార్యక్రమాలు చేసిన పవన్ కు కనిపించటం లేదని మండి పడ్డారు. కాపు రిజర్వేషన్ల పైన చంద్రబాబును పవన్ నాయుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీసారు. వెంకయ్య నాయడుని పవన్ నాయుడు తిట్టినట్లుగా మరెవరూ తిట్టలేదని నాని గుర్తు చేసారు. కాపు రిజర్వేషన్ల పైన పవన్ సమయానుసారం మాట్లాడారని విమర్శించారు. సినిమాల్లో ఆయన గబ్బర్ సింగ్ అయినా..రాజకీయాల్లో రబ్బర్ సింగ్ అని కౌంటర్ ఇచ్చారు.

మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి: భయపడను..గొడవపడదాం అంటే రెఢీ : సీఎం జగన్ పై పవన్ ఫైర్..!మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి: భయపడను..గొడవపడదాం అంటే రెఢీ : సీఎం జగన్ పై పవన్ ఫైర్..!

 పవన్ నాయుడూ..జగన్ పైన కేసులు ఏంటంటే..

పవన్ నాయుడూ..జగన్ పైన కేసులు ఏంటంటే..

మంత్రి పేర్ని నాని జనసేన అధినేత మీద మండిపడ్డారు. జగన్ కేసుల గురించి పవన్ మాట్లాడటం పైన నాని ప్రశ్నించారు. జగన్ పైన కేసులు ఎందుకు పెట్టారో పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ నాడు మాట్లాడారని గుర్తు చేసారు. వైయస్ మరణించే వరకూ మంచోడు..ఆయన మరణించగానే జగన్ ఆర్దిక నేరగాడు అయ్యారా అని సుష్మా ప్రసంగించారని వివరించారు. జగన్ మీద కేసుల సంగతి గురించి మీ పక్కనే ఉన్న లక్ష్మీ నారాయణను అడగాలని సూచించారు. ప్రజలకు జగన్ కేసుల మీద స్పష్టత ఉండటంతోనే 151 సీట్లు కేటాయించారు. మీరు ధౌజండ్ వాలా జగన్ పైన అంటిస్తే..మీ పైన ఫైవ్ ధౌజండ్ వాలా అంటిస్తారని హెచ్చరించారు. మీ సినిమా అయిపోయిందని ఎద్దేవా చేసారు. మీ అరుపులు..కేకలు సినిమాల వరకే అని గుర్తుంచుకోవాలని సూచించారు. జగన్ ను జగన్ రెడ్డి అంటూ పవన్ మాట్లాడుతున్నారని.. అందుకే పవన్ నాయుడుగా ఎందుకు పిలుస్తున్నామో అర్దం అవుతుందని చెప్పుకొచ్చారు.

మీకు పెళ్లిళ్లు..జగన్ కు ప్రజాసేవ

మీకు పెళ్లిళ్లు..జగన్ కు ప్రజాసేవ

పవన్ నాయుడుకు పెళ్లిళ్ల పైన మక్కువ ఎక్కువ అని..జగన్ కు ప్రజాసేవ అంటే పిచ్చి అని నాని వ్యాఖ్యానించారు. ఎవరికి దేని మీద మక్కువ ఉంటే దానినే అమలు చేస్తారని చెప్పుకొచ్చారు. మీరు పెళ్లిళ్లు చేస్తారన్నా..జగన్ చేసుకోరని వ్యాఖ్యానించారు. జగన్ ను ఫ్రై డే మ్యాన్ అంటే..తాము పవన్ ను మ్యాన్ ఫ్రీ ఉమెన్ అని అనటంలో తప్పు లేదన్నారు. మీ తల్లి తంద్రులు ఈ రోజు మాత్రమే సంస్కారం నడిపారా.. విశాఖలో మాట్లాడిన సందర్భంలో నేర్పలేదా అని ప్రశ్నించారు. జగన్ కు ఆయన తల్లి తండ్రులు సంస్కారం నేర్పటంతోనే..ఏనాడు మీ లాగా ఇష్టానుసారం మాట్లాడ లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా పవన్ కు కనిపించటం లేదని..చంద్రబాబు చెప్పేవే కనబడుతున్నాయని విమర్శించారు. ఎక్కడ ధర్నాలు జిరిగితే..అక్కడ ఉన్న వారిని దగ్గరకు పిలిపించుకొని..వారి గురించి మాట్లాడు తున్నారని ఆరోపించారు.వెంకయ్య నాయుడు పైన పవన్ కళ్యాన్ మాట్లాడినంత అసహ్యంగా మరెవరూ మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.

మీ ఒక్కరే ధైర్యవంతుడు కాదు.. ఇక్కడ వెయ్యి టన్నుల ధైర్యం..

మీ ఒక్కరే ధైర్యవంతుడు కాదు.. ఇక్కడ వెయ్యి టన్నుల ధైర్యం..

మీ ఒక్కరే ధైర్యవంతుడు అనుకోవటం పొరపాటు..మీ కన్నా వెయ్యి టన్నుల ధైర్యం ఉన్నవాళ్లు వైసీపీలో ఉన్నారని గుర్తించాలని హెచ్చరించారు. కర్నూలు గురించి తక్కువ చేసి మాట్లాడారని విమర్శించారు. వేంకటేశ్వర సుప్రభాతం గురించి మాట్లాడారని..అసలు ఆయనకు సుప్రభాతం ఏ భాషలో ఉంటుందో తెలుసా అని ప్రశ్నించారు. పవన్ కు నరనరాన కుల గజ్జి పెరిగిపోయిందని ఆరోపించారు. జగన్ కే కాదు.. పవన్ నాయుడుకు వాయిదాలు కొత్త కాదని ఎద్దేవా చేసారు. ఇంగ్లీషు మీడియం విధానం పాదయాత్రలో వచ్చిన వినతుల మేరకే తీసుకున్నారని వివరించారు. టీచర్లు ఎవరూ తక్కువ కాదని.. అందరూ శిక్షణ పొందిన వారేనని స్పష్టం చేసారు. ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లోనూ తెలుగు తప్పని సరి చేసామని వివరించారు.

English summary
minister Perni nani sensational comments on Janasena Chief pawan kalyan. He says Pawan interest on marriages..Cm in public service. Pawan is gabbar singh in cinema..but he is rubber singh in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X