వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిక్కుల్లో చంద్రుడు: మాజీ సీఎంపై హైకోర్టులో పిటీష‌న్‌: ప‌సుపు-కుంకుమ‌తో ప్ర‌భావితం చేసారు..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యంతో ఆవేద‌న‌లో ఉన్న చంద్ర‌బాబును కోర్టు కేసులు వీడటం లేదు. తాజాగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీద హైకోర్టులో మ‌రో కేసు న‌మోదైంది. ఎన్నిక‌ల ముందు నాటి ప్ర‌భుత్వం ప‌సుపు-కుంకుమ వంటి ప‌ధ కాల పేరుతో ఓట‌ర్ల‌ను ప్రభావితం చేసార‌ని..నిధులు దుర్వినియోగం చేసారంటూ మాజీ సీఎం మీద కేసు న‌మోదు అయింది. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు ఈనెల 18కు కేసు వాయిదా వేసింది.

చంద్ర‌బాబు పైన పిటీష‌న్..

చంద్ర‌బాబు పైన పిటీష‌న్..

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పైన హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లైంది. ఎన్నిక‌ల్లో గెల‌వ‌టం కోసం నిర్వ‌హించిన ప్ర‌చారానికి ప్ర‌భుత్వ నిధులు వినియోగించారంటూ ఆయ‌న పైన పిటీష‌న్ దాఖ‌లు అయింది. బోరుగ‌డ్డ అనిల్ అనే రిప‌బ్లిక‌న్ పార్టీ నేత ఈ పిటీష‌న్ ఫైల్ చేసారు. చంద్రబాబు సొంత ఖర్చుల కింద నిధులను వసూలు చేయాలని కోరారు. అనిల్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటీషన్‌పై ఈనెల 18న విచారణ జరుగనుంది. స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు మ‌హిళ‌ల‌కు ప‌సుపు - కుంకుమ‌, అన్న‌తాద సుఖీభ‌వ వంటి ప‌ధ‌కాల‌తో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేసారు. అయిదే దీని పైనా మ‌రో కేసు దాఖ‌లైంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన త‌రువాత సైతం చంద్ర‌బాబు నాటి నిర్ణ‌యాలు కేసుల రూపంలో వెంటాడుతున్నాయి.

ఏపీ మంత్రి వ‌ర్సెస్ కేంద్ర మంత్రి : ప‌్ర‌ధాని..సీఎం అలా. ఏపీ మంత్రి వ‌ర్సెస్ కేంద్ర మంత్రి : ప‌్ర‌ధాని..సీఎం అలా.

ధ‌ర్మపోరాట దీక్ష పైనా..

ధ‌ర్మపోరాట దీక్ష పైనా..

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు ఢిల్లీలో ధ‌ర్మ‌పోరాట దీక్ష నిర్వ‌హించారు. దీని ద్వారా ప్ర‌జ‌ల సొమ్ము దుర్వినియోగం చ‌సారంటూ తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన వ్య‌క్తి పిల్ దాఖ‌లు చేసారు. దీని పైన పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటీష‌న్ పైన హైకోర్టు
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా విచారణకు హాజరైన అడ్వకేట్‌ జనరల్‌ సుబ్రమణ్యం శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని, 2వారాల గడువు కావాలని కోరారు. దీని పైనా రాష్ట్ర హైకోర్టులో విచార‌ణ జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది.

చిక్కుల్లో చంద్రుడు..

చిక్కుల్లో చంద్రుడు..

ఇప్పుడు అధికారం నుండి చంద్ర‌బాబు దూరం కావ‌టంతో..ఆయ‌న పైన గ‌తంలో చేసిన అభియోగాల‌ను పిటీష‌న్ రూపంలో న్యాయస్థానాల‌కు చేరుతున్నాయి. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే ఆయ‌న పైన అనేక అవినీతి ఆరోప‌ణ‌ల‌తో కేసులు దాఖ‌ల‌య్యాయి. అనేక కేసులు అందులో స్టే రూపంలో పెండింగ్‌లో ఉండ‌గా , ఈ మ‌ధ్య కాలంలో ల‌క్ష్మీ పార్వ‌తి వేసిన కేసు తిరిగి విచార‌ణ ప్రారంభ‌మైంది. ఇక, తెలంగాణ‌లో న‌మోదైన ఓటు కు నోటు కేసు సైతం పూర్తి కాలేదు. ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా దిగిపోయే ముందు తీసుకున్న నిర్ణ‌యాలు..అధిక మొత్తంలో చేసిన ఖ‌ర్చు పైన హైకోర్టులో కేసులు న‌మోదు అవుతున్నాయి. మ‌రి..వీటిని చంద్ర‌బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

English summary
Petition filed in AP High Court on AP ex CM Chandra Babu that misused public money for party election campaign. Petitioner asked court to recover that total expenditure from his personal account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X