వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరంపై హైకోర్టులో కేసు :చర్యలకు న్యాయస్థానం ఆదేశం: కేంద్ర శాఖకే బాధ్యత..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Polavaram : Delhi High Court Refers PIL On Polavaram Project || విచారణకు ఆదేశించిన ఢిల్లీ హైకోర్ట్

పోలవరంలో అవినీతి జరిగిందంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. జనసేన నేన..విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ ను ఫిర్యాదుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరుల శాఖకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచారని..ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అవతవకలు జరిగాయని పుల్లారావు తన పిటీషన్ లో ఫిర్యాదు చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరంలో అవినీతి జరిగిందంటూ నాటి ప్రతిపక్ష నేత జగన్ తో సహా పార్టీ నేతలు విమర్శలు చేసారు. ఇక, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత పోలవరం పనులు నిలిపివేసారు.

టీడీపీలోకి వెళ్లి పొరపాటు చేశా..సీఎం ఓ మిస్సైల్: జగన్ ఆలింగనంతో వైసీపీలోకి జూపూడి..!టీడీపీలోకి వెళ్లి పొరపాటు చేశా..సీఎం ఓ మిస్సైల్: జగన్ ఆలింగనంతో వైసీపీలోకి జూపూడి..!

అక్కడ కాంట్రాక్టు సంస్థగా ఉన్న నవయుగను తప్పించారు. రివర్స్ టెండరింగ్ కు ఆహ్వానించారు. అందులో దాదాపు 800 కోట్ల కు పైగా ప్రజాధనం ఆదా అయిందంటూ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఈ టెండర్ ను మేఘా సంస్థ దక్కించుకుంది. అయితే..న్యాయ పరమైన అభ్యంతరాల నుండి క్లియరెన్స్ ఇస్తే పనులు మొదలు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని మేఘా సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు ఈ వ్యవహారం మీద కేంద్ర ప్రభుత్వం సైతం ఫోకస్ చేసింది. ఈ సమయంలో ఇప్పుడు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయటం..దీని మీద విచారణకు ఆదేశించటం తో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకొనే అవకాశం ఉంది.

Petition filed in delhi high court on corruption charges in Polavaram estimations and rehabitaion package

విచారణ బాధ్యత జలవనరుల శాఖకే..
హైకోర్టు తాజా ఉత్వర్వుల ప్రకారం ఈ పిటీషన్ ను ఫిర్యాదుగా స్వీకరించి విచారన చేయించాని కేంద్ర జలవనరుల శాఖను కోర్టు ఆదేశించింది. ఇప్పటికే పోలవరం వ్యవహారంలో పీపీఏ నామమత్రంగా మారింది. జరుగుతన్న పరిణామాలను కేంద్ర మంత్రిత్వ శాఖకు అప్పగించటం మినహా ఎటువంటి పాత్ర లేకుండా పోయింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పోలవరం వ్యవహారంలో తాను తీసుకుంటున్న నిర్ణయా లను నేరుగా ప్రధానితో చర్చిస్తున్నారు. ఇక, పోలవరం నిర్వాసితుల పునవాస ప్యాకేజీకి సంబంధించి కేంద్రం ఆమోదానికి సిద్దమని చెప్పినా..అధికారికంగా ఆమోద ముద్ర వేయలేదు.

పునరావాస ప్యాకేజికి కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తం భరించటం కష్టమే. ఇప్పటికే పోలవరం నిదుల రీయంబర్స్ మెంట్ కింద కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు అయిదు వేల కోట్ల రూపాయాలు రావాల్సి ఉంది. వచ్చే నెల ఒకటో తేదీ నుండి పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ సమయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు అందునా నేరుగా కేంద్ర జల వనరుల శాఖకు ఇవ్వటంతో దీని పైన కేంద్ర ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తి కరంగా మారింది.

English summary
Petition filed in delhi high court on corruption charges in Polavaram estimations and rehabitaion package. petition filed by pentapati pulla rao. court directed central Jala shakthi ministry to invetigate this as complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X