వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఒత్తిడి చేయొద్దంటే బాబుకి నో చెప్పారా?(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రైతురుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పునరుద్ఘాటించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్ఎల్‌బీసీ)లో చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రుణాల రీషెడ్యూల్‌కు తీర్మానం చేసి ఆర్‌బీఐకి పంపాలని చంద్రబాబు ప్రతిపాదించారు. దీనికి బ్యాంకర్లు ఆమోదించి ఉంటారని కొందరు, బ్యాంకర్లు నిరాకరించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రుణాల రీషెడ్యూల్ ప్రక్రియ కొలిక్కి వచ్చేలోగా రైతులుపై ఎలాంటి ఒత్తిడి తేవద్దని ఆయన బ్యాంకర్లకు సూచించారు. రైతులకు వెంటనే రుణాలు ఇచ్చేందుకు ఎస్ఎల్‌బీసీ నిర్ణయం తీసుకోవాలన్నారు.

విభజన కారణంగా రాష్ట్రం కష్టాల్లో ఉందని, బ్యాంకులతో సహా ప్రతి ఒక్కరూ ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. సాధారణంగా ఎస్ఎల్‌బీసీ సమావేశంలో సీఎం ప్రతిపాదించే తీర్మానాలపై బ్యాంకర్లు సానుకూలంగా స్పందిస్తారు. రీషెడ్యూలుపై చంద్రబాబు ప్రతిపాదించిన తీర్మానం విషయాన్ని మినిట్స్‌లో రాసుకుని... ఆ తర్వాత రిజర్వు బ్యాంకుకు దీనిని నివేదించనున్నారు.

బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

ప్రస్తుతమున్న ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం కరువు మండలాల్లో పంట రుణాలను టర్మ్‌లోన్‌లుగా మార్చి, కొత్తగా పంట రుణాలను మంజూరు చేసే అవకాశముందని చంద్రబాబు పేర్కొన్నారు.

బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని 113 మండలాల్లో కరువు ఏర్పడిందని, 462 మండలాలు తుపానుతో అతలాకుతలమయ్యాయని వెరసి 85 శాతం మండలాలు విపత్తుల బారిన పడ్డాయన్నారు.

 బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సాధారణంగా ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిన వెంటనే విపత్తు మండలాల్లో రుణాలను బ్యాంకులు రీషెడ్యూలు చేస్తాయన్నారు.

 బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా అసలు, వడ్డీని మూడేళ్ల నుంచి 7 ఏళ్లలోగా చెల్లించేలా దీర్ఘకాలిక రుణంగా మార్చే వెసులుబాటు ఉందని రిజర్వుబ్యాంకు స్పష్టం చేసిందన్నారు.

 బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

గత రెండు సీజన్లులో రైతులు ఎక్కువగా నష్టపోయినందున రుణాల చెల్లింపుపై ఒక ఏడాది మారటోరియం విధించి, ఏడేళ్లలో తిరిగి చెల్లించే విధంగా రీషెడ్యూలు చేయాలన్నారు.

 బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

మిగతా 86 మండలాల్లోనూ రుణమాఫీ అమలుచేస్తామని, రైతులెవరిపై ఒత్తిడి తేవొద్దని బ్యాంకులకు సూచించారు. రెండు మూడు రోజుల్లో కోటయ్య కమిటీ ఇచ్చే నివేదికతో కరువు మండలాలను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంటామన్నారు.

 బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

రుణమాఫీకి ప్రతి రైతు అర్హత కలిగి ఉంటారని, ఇప్పటికే రుణాలు తిరిగి చెల్లించిన వారి విషయంలో కూడా న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. బంగారు రుణాలు తీసుకున్న వారి పట్ల, ఇతర వృత్తిదారుల పట్ల ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు.

 బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

ప్రభుత్వం రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడుతోందని, కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగంలో నిపుణుల సలహాలు తీసుకుంటుందన్నారు. తమ ప్రభుత్వం రుణ మాఫీ హామీకి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ లోపు బ్యాంకు అధికారులు రైతులపై ఒత్తిడి తేవొద్దన్నారు.

 బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

రుతుపవనాలు ప్రవేశించడంతో వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు రుణాలు ఇచ్చి సహకరించాలన్నారు.

 బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

రాష్ట్ర విభజనతో ఆంధ్రా ప్రాంతానికి లోటు బడ్జెట్ ఏర్పడిందని, రాష్ట్ర విభజనతో కలిగిన కష్టం నుంచి బయటపడాలంటే ప్రతి వ్యక్తి, సంస్థతోపాటు బ్యాంకులు ప్రభుత్వానికి సహకారం అందించాలన్నారు.

 బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

రాష్ట్రంలో డబ్బులు లేవని, అయితే ఆర్థిక వనరులు, విజన్ ఉన్నాయన్నారు. ఏ విధంగా చేస్తే రైతులందరికీ ప్రయోజనం కలుగుతుందో ఆ దిశలో చర్యలు తీసుకుంటామన్నారు.

 బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

మరోవైపు.. ప్రభుత్వ విధానాలపై బ్యాంకర్లు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్రభుత్వం మాఫీ ప్రకటనతో తమకూ లబ్ది వస్తుందన్న భావనతో గత కొన్ని నెలలుగా బకాయిల చెల్లింపులు తగ్గిపోయాయని బ్యాంకర్లు ఆరోపించాయట.

 బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

ఎస్‌ఎల్‌బిసి చైర్మన్ రాజేంద్రన్ కూడా రుణమాఫీలపై అసంతృప్తి వాదననే వినిపించారట. వారు తమ రుణాలను చెల్లించడంలో విముఖత చూపిస్తున్నారని రాజేంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారట.

బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న వారిలో కూడా ఈ విముఖతను గుర్తించినట్టు వివరించారట. బ్యాంకులు రుణాలను రీషెడ్యూల్ చేయడంలో ఇబ్బందులు పడతాయని, క్షేత్రస్థాయిలో బ్యాంకు ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

 బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

అందువల్ల రుణాల చెల్లింపు వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులను చైతన్యవంతం చేస్తే మంచిదని సూచించారు. ఇదే సమయంలో కావాలని రుణాలను ఎగ్గొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.

 బ్యాంకర్లతో చంద్రబాబు

బ్యాంకర్లతో చంద్రబాబు

సమావేశంలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆర్‌బీఐ రీజినల్ డైరక్టర్ కేఆర్‌దాస్, ఎస్ఎల్‌బిసి చైర్మన్ సి.వి.ఆర్ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

English summary
The request of AP Chief Minister Chandrababu Naidu to the State Level Bankers Committee on Monday to reschedule the crop loans up to seven years with a moratorium of one year and disburse fresh kharif loans was rejected by the bankers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X