వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుతో చిరంజీవి ముచ్చట, వెంకటేష్ అల్లరి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత దేశంలో ఒక ఉన్నత నగరంగా విశాఖను అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రకటించారు. భవిష్యత్తులో ఎలాంటి తుఫాను వచ్చినా ఏమీ చేయలేని విధంగా విశాఖను నిర్మిస్తామన్నారు.

హుధుద్ హుధుద్ తుఫాను బాధితులకు చేయూతనివ్వడానికి ముందుకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమ కనబరిచిన స్ఫూర్తి తప్పనిసరిగా సత్ఫలితాలనిస్తుందని చంద్రబాబు అన్నారు. మేము సైతం అంటూ చిత్ర పరిశ్రమ కదిలిన తీరును ఆయన ప్రశంసించారు.

తుఫాను బాధితుల సహాయార్థం ఆదివారం హైదరాబాద్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మేము సైతం భారీ కార్యక్రమాన్ని చిత్రసీమ నిర్వహించింది. కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ వేడుకల ముగింపు కార్యక్రమంలో చంద్రబాబుకు రూ. 11,51,56,116 చెక్కును చిత్ర పరిశ్రమ అందించింది.

చంద్రబాబుతో చిరు ముచ్చట్లు

చంద్రబాబుతో చిరు ముచ్చట్లు

మేము సైతం కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ముచ్చట్లు.

వెంకటేష్ అల్లరి

వెంకటేష్ అల్లరి

సినీ స్టార్స్ మేము సైతం కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ అలరించారు, అల్లరి చేశారు. కబడ్డీ ఆట సమయంలో ఆయన వ్యాఖ్యాతగా మారారు. రాత్రి అంత్యాక్షరి సమయంలో వెంకటేష్ అల్లరి చేశారు.

రవితేజ హంగామా

రవితేజ హంగామా

సినీ స్టార్స్ మేము సైతం కార్యక్రమంలో రవితేజ అలరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. అర్ధగంట నుంచీ మీ కార్యక్రమాలు చూస్తుంటే తనకు ఎంతో ఆహ్లాదంగా ఉందన్నారు.

చిరు, వెంకటేష్

చిరు, వెంకటేష్

సినీ స్టార్స్ మేము సైతం కార్యక్రమంలో చిరంజీవి, వెంకటేష్ తదితరులు అలరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు జోలె పట్టుకొని విరాళాలు సేకరించిన స్ఫూర్తిని మీరు కొనసాగిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

రాఘవేంద్ర రావుతో చంద్రబాబు

రాఘవేంద్ర రావుతో చంద్రబాబు

తెలుగువాళ్లు ప్రతి ఒక్కరూ స్పందించి తుఫాను కూడా అసూయపడేలా చేశారని, విశాఖకు తుఫానును బాగా నష్టం కలిగించిందని, మీ అందరిలాగే నేనూ విశాఖపట్నాన్ని ప్రేమిస్తున్నానని మేము సైతం కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు అన్నారు.

బాబుకు చెక్కు

బాబుకు చెక్కు

ఏపీ సీఎం చంద్రబాబుకు చెక్కును ఇస్తున్న సినీ స్టార్స్. కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలోని ఉత్తమ నగరాల్లో విశాఖ ఒకటని, తుఫాను తర్వాత మానవ ప్రయత్నంగా ఏం చెయ్యాలో అన్నీ చేశామన్నారు.

బాబుకు చెక్కు

బాబుకు చెక్కు

ఏపీ సీఎం చంద్రబాబుకు చెక్కును ఇస్తున్న సినీ స్టార్స్. కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. తాను విశాఖలో ఎనిమిది రోజులు బస్సులోనే గడిపాననీ, ఒక రోజు కనీసం బాత్‌రూమ్‌ కూడా దొరకలేదని చెప్పారు.

బాబుకు చెక్కు

బాబుకు చెక్కు

ఏపీ సీఎం చంద్రబాబుకు చెక్కును ఇస్తున్న సినీ స్టార్స్. కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏ విపత్తు వచ్చినా ఏం చెయ్యలేని విధంగా విశాఖపట్నాన్ని పునర్నిర్మిస్తామన్నారు. తుఫాను బాధితుల సహాయర్థం ఇప్పటివరకూ రూ.150 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయన్నారు.

బాబుకు చెక్కు

బాబుకు చెక్కు

ఏపీ సీఎం చంద్రబాబుకు చెక్కును ఇస్తున్న సినీ స్టార్స్. కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను ప్రతిబింబించే సినీ పరిశ్రమ నుంచి ఇలాంటి స్పందన రావడం అభినందనీయమని, ఇప్పుడు మీరు ప్రదర్శించిన స్ఫూర్తి తప్పనిసరిగా సత్ఫలితాలిస్తుందన్నారు.

చంద్రబాబుతో కరచాలనం

చంద్రబాబుతో కరచాలనం

మేము సైతంలో చంద్రబాబుతో బాలకృష్ణ. చంద్రబాబు మాట్లాడుతూ.. ఇవాళ తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉన్నాయని, విభజన జరిగిపోయింది కాబట్టి తెలుగుజాతి ఆనందంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుజాతి అభివృద్ధి కోసం, ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబుతో బాలకృష్ణ

చంద్రబాబుతో బాలకృష్ణ

మేము సైతంలో చంద్రబాబుతో బాలకృష్ణ. చంద్రబాబు మాట్లాడుతూ.. చిత్రసీమ ఎంత డబ్బు వసూలుచేసిందో, అంత డబ్బును ప్రభుత్వం తరఫునుంచి ఇస్తామని, ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని దాని స్మార్ట్‌ విలేజ్‌గా తయారుచేస్తే, అది అందరికీ ఆదర్శనీయం అవుతుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

మేము సైతం కార్యక్రమానికి హాజరైన జయప్రద, జయసుధ, సుమలత తదితరులు. కాగా, ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతు.. అక్టోబర్‌ 12 విశాఖను తుఫాను దెబ్బతీసిన రోజని, వచ్చే ఏడాది అదే రోజుకు ఆ స్మార్ట్‌ కాలనీని ప్రారంభించేవిధంగా పనులు చేస్తే బాగుంటుందని సూచించారు.

చంద్రబాబు

చంద్రబాబు

మేము సైతం కార్యక్రమంలో మాట్లాడుతున్న చంద్రబాబు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, మురళీమోహన్‌, రవితేజ, రాజశేఖర్‌, అల్లు అర్జున్‌, బూమోహన్‌, అలీ, జయసుధ, జయప్ర ద, సుమలత సహా పలువురు తారలు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

భారత దేశంలో ఒక ఉన్నత నగరంగా విశాఖను అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రకటించారు. భవిష్యత్తులో ఎలాంటి తుఫాను వచ్చినా ఏమీ చేయలేని విధంగా విశాఖను నిర్మిస్తామన్నారు.

హుధుద్

హుధుద్

హుధుద్ తుఫాను బాధితులకు చేయూతనివ్వడానికి ముందుకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమ కనబరిచిన స్ఫూర్తి తప్పనిసరిగా సత్ఫలితాలనిస్తుందని చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో నారా రోహిత్, బాబు మోహన్, రానా, రవితేజ, మంచు లక్షఅమీ, హేమ తదితరులు.

English summary
Photos of CHANDRABABU ATTENDS CINEMA STAR'S PROGRAMME MEMU SAITAM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X