వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇసుక: మహిళలపై బాబు భారం పెడతారా? (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళలకు ఇసుక ర్యాంపులు ఇవ్వాలనే యోచనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. తవ్వకాలు, అమ్మకాల బాధ్యత వారికే ఇవ్వాలనుకుంటున్నారట.

ఐటీడీఏల్లో గిరిజన మహిళలకు మైనింగ్ లీజులు ఇవ్వాలనుకుంటున్నారు. ఏడాదిపాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలనుకుంటున్నారు.

కొత్త రాజధాని నగరం నిర్మాణం.. పోలవరంతోసహా పలు ప్రాజెక్టు పనులు ప్రారంభం కానుండటం.. వంటి కారణాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఇసుకకు భారీ డిమాండ్‌ ఏర్పడనుంది.

 చంద్రబాబు

చంద్రబాబు

చంద్రబాబు నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో ఇసుక మైనింగ్‌ను మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఈ మేరకు కొత్త ఇసుక మైనింగ్‌ పాలసీని రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా పాలసీని సిద్ధం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అయితే, ఇసుక మైనింగ్‌ను మహిళా సంఘాలకు అప్పగించడం వారిపై తలకు మించిన భారం మోపడమేనన్న వాదనా విన్పిస్తోంది.

 చంద్రబాబు

చంద్రబాబు

ఇప్పటికే మద్యం దుకాణాలతో సహా రేషన్‌ డీలర్‌షిప్‌ల వంటి వాటిలో మహిళల పేరుతో బినామీ వ్యాపారాలు చొరబడ్డారు. గతంలో వైయస్ సీఎంగా ఉన్న సమయంలో మహిళలకు విద్యుత్తు కేంద్రాల నిర్వహణను అప్పగించాలని నిర్ణయించారు. అయితే, ఆచరణలో అది సాధ్యం కాలేదు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఇసుక బంగారంగా ఉన్న ప్రస్తుత సమయంలో ఇసుక నిర్వహణ ఎస్‌హెచ్‌జీలకు అప్పగించడం బినామీలకు ద్వారాలు తెరవడమేనన్న వాదన విన్పిస్తోంది.

 చంద్రబాబు

చంద్రబాబు

కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు సాగించడం చిన్న విషయంగా భావించేందుకు వీల్లేదు. ఒక శాస్త్రీయవిధానం లేకుంటే.. ఇక్కడ ఎవరెంత ఇసుకను తీసుకువెళ్తున్నారో లెక్కించడం అసాధ్యం.

 చంద్రబాబు

చంద్రబాబు

ఇప్పటికే ఇసుక వ్యాపారంలో పాతుకుపోయిన మాఫియా బినామీ అవతారం ఎత్తితే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందేవారు లేకపోలేదు.

English summary
Photos of Andhra Pradesh CM Chandrababu Naidu holds review meet on Sand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X