వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేణుమాధవ్ చెవిలో చంద్రబాబు, కెసిఆర్‌పై ఫైర్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పదేళ్ల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

కేంద్రంలో నరేంద్ర మోడీకి, రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

పదేళ్ల తన పాలనలో నిర్మించిన అభివృద్ధి నిర్మాణాలను కాంగ్రెస్ అవినీతి తుడిచి పెట్టేసిందని, ఫ్యాబ్ సిటీని కాస్తా ఫేక్ సిటీగా మార్చివేసిందని మండిపడ్డారు. సోనియా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో అవినీతి అనకొండను పంపారని ఆరోపించారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పది నెలల కాలంలో నగరానికి కృష్ణానీటి సరఫరా పథకాన్ని పూర్తి చేయగా, కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అదనపు పైపులైన్ల నిర్మాణపు పనులను పూర్తిచేయలేకపోయిందని విమర్శించారు.

చంద్రబాబు

చంద్రబాబు

వాజ్‌పేయి ప్రభుత్వాన్ని అభ్యర్థించి రాష్ట్రంలోని మహిళల కోసం దీపం పథకం కింద 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు టీడీపీ సర్కారు సమకూరిస్తే కాంగ్రెస్ పాలకులు ఆ దీపం ఆర్పేశారని మండిపడ్డారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పాలనలో హైదరాబాద్ అభివృద్ధిని చూసి ప్రపంచ ప్రముఖులెందరో ప్రశంసించగా, కాంగ్రెస్ అవినీతికి భయపడి, ఎల్లలు దాటిన కమిషన్ దంతాలకు జంకి పెట్టుబడులే రాకుండా పోయాయని వాపోయారు. హైదరాబాద్‌కు పూర్వవైభవం తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

అమెరికా, చైనాల కంటే మిన్నగా దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నదన్న ఆయన.. టిడిప-బిజెపి కూటమితో ఏర్పడే ప్రభుత్వం ఆదిశగా చర్యలు చేపడుతుందన్నారు. నీతి, నిజాయితీ సమర్థత, సుపరిపాలన అందించే ఎన్డీయే కూటమికి మద్దతు పలకాలని కోరారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం-బిజెపి ఎన్నికల పొత్తు చారిత్రక అవసరంగా అభివర్ణించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధే ఎజెండాగా పని చేస్తుందని హామీ ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తామని, దోచుకుని దాచుకున్న డబ్బుల్ని కక్కిస్తామని హెచ్చరించారు. జగన్‌ది జైలు పార్టీ అని, అది సోనియాకు అమ్ముడుపోతుందని విమర్శించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే జనం ఇళ్లను కూడా కబ్జా చేస్తారని హెచ్చరించారు. నీతి, నిలకడలేని పార్టీలుగా.. తెరాస, జగన్ పార్టీలను దుయ్యబట్టారు. తెరాస వసూళ్ల పార్టీ అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కెసిఆర్ తన శిష్యుడేనని, కాకపోతే గురువుకు పంగనామాలు పెట్టారన్నారు. ఆయన తన కుమారుడికి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారని, కానీ, ఎన్టీఆర్ పెట్టిన పార్టీని మాత్రం ఆంధ్రావాలా పార్టీ అంటున్నారని విమర్శించారు.

చంద్రబాబు

చంద్రబాబు

కొడుకు, కూతురు, మేనల్లుడికి అధికారాన్ని అప్పగించాలన్న ఆతృతతో కెసిఆర్ ఉన్నారని దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీకి దేశం గురించి ఏమీ తెలియదంటూ.. ఆయనని మొద్దబ్బాయితో చంద్రబాబు పోల్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణలో ప్రతి గుడిసెను రూ. 1.5 లక్షల వ్యయంతో పక్కా గృహం చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే వారం రోజులు సెలవు పెట్టి టిడిపి-బిజెపి కూటమి విజయానికి ప్రచారం చేయాలని ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు. ఈ సభలో నటుడు వేణుమాధవ్ పాల్గొన్నారు.

English summary
Photos of Telugudesam Party chief Nara Chandrababu Naidu meeting in Meerpet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X