వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మార్ట్ సిటీగా ఒంగోలు: బాబు వరాల జల్లు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ఒంగోలు నగరాన్ని స్మార్ట్‌ సిటీగా ఆభివృద్ధి పరిచేందుకు ఆన్నివిధాలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఒంగోలుతో పాటు కొత్తపట్నం బీచ్‌ను పూర్తిస్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

మంగళవారం స్థానిక మినీ స్టేడియంలో జరిగిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు. ఒంగోలు నగరాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతామన్నారు. నగరంలో అందరికి నివాస యోగ్యత కల్పించేందుకు గృహ సము దాయాల నిర్మాణం దానికి రోడ్లు, డ్రైనేజి, విద్యుత్‌ తదితర సౌకర్యాలను కల్పిస్తామన్నారు.

ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మాణం, నగరంలోని పలు ప్రాంతాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామన్నారు. వీటితో పాటు ఒంగోలులో మినీ స్టేడియం, ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

అన్నిటికంటే నగర ప్రజలు అహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వా దించేందుకు పార్కుల ఆభివృద్ధిపై దృష్టి సారిస్తామని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాద్‌లో ఉన్న శిల్పారామం మాదిరిగా ఒంగోలు నగరంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ను, రైల్వే స్టేషన్‌ను పూర్తిస్థాయిలో ఆధునీక రించేందుకు చర్యలు చేపడతామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రిమ్స్‌ వైద్యశాలకు అన్ని హంగులు కల్పిస్తామన్నారు. ప్రధానంగా ఒంగోలులో తాగునీటి పరి ష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రకాశం జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడతామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తీరం వెంట మొక్కలను పెంచడం వలన ఉష్ణోగ్రతలు తగ్గటంతో పాటు తుఫాన్‌ సమయాల్లో రక్షణ కవచంలా పని చేస్తాయని చంద్రబాబు అన్నారు. కాగా, చంద్రబాబు బడి పిలుస్తోంది కార్యక్రమంలోను పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

కొత్త పట్నం బీచ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఒంగోలు నుంచి కొత్తపట్నం తీరం వరకు నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తీరం వద్ద పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలను కలుగచేస్తామన్నారు. జిల్లాలో లభ్యమయ్యే పండ్లు, పాలు, పెరుగు రుచి ప్రపంచంలోని ఏ దేశంలో దొరకవన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

జిల్లాకు నీటిని సమృద్ధిగా అందిస్తే జిల్లాను సస్యశ్యామలం చేసే రైతులు ఇక్కడ ఉన్నారన్నారు. జిల్లాలో వెలుగొండను పూర్తి చేస్తామన్నారు. కాగా, చంద్రబాబు పొలం పిలుస్తోంది కార్యక్రమంలోను పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సాగు నీరు అందుతుందని చంద్రబాబు అన్నారు. జిల్లాలో ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామన్నారు.

English summary
Photos of Chandrababu participates Janmabhoomi and Maa OOru meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X