వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మహత్యలకి లవ్ యాంగిల్ కూడా!: బాబు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించే పథకానికి ఆత్మగౌరవంగా నామకరణం చేస్తున్నామని, ఈ పథకం కింద మూడునెలల్లో నవ్యాంధ్రలోని ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించి స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ నేతృత్వాన ఉద్యమ స్ఫూర్తితో 20వేల మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సత్తెనపల్లి శరభయ్య స్కూలు ఆవరణలో స్వచ్ఛ సత్తెనపల్లి పేరిట బుధవారం భారీఎత్తున నిర్వహించిన కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్వచ్ఛ్భారత్‌లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే 16వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాగా, మరో 4వేల మరుగుదొడ్లు వివిధ దశల్లో ఉన్నాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో నూటికి నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించాలని ప్రతినబూనడమేగాక ఆ లక్ష్యాన్ని సాకారం చేసిన స్పీకర్ కోడెలను స్వచ్ఛాంధ్ర చాంపియన్‌గా చంద్రబాబు అభివర్ణించారు.

స్వచ్ఛ సత్తెనపల్లి

స్వచ్ఛ సత్తెనపల్లి

గుంటూరు జిల్లా ఆదర్శంగా ఉద్యమస్ఫూర్తితో రాష్టవ్య్రాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తామని, రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల ఈ పథకానికి ప్రచారసారథిగా వ్యవహరిస్తారని తెలిపారు.

స్వచ్ఛ సత్తెనపల్లి

స్వచ్ఛ సత్తెనపల్లి

స్వచ్ఛాంధ్ర సాధనలో భాగంగా నూటికి నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించిన పంచాయతీలకే ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

 స్వచ్ఛ సత్తెనపల్లి

స్వచ్ఛ సత్తెనపల్లి

గత పాలకుల నిర్వాకం కారణంగా దేశం మొత్తంమీద 53శాతం మంది రైతులు అప్పుల్లో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 93శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

 స్వచ్ఛ సత్తెనపల్లి

స్వచ్ఛ సత్తెనపల్లి

ఈ పరిస్థితి నుంచి రైతులను గట్టెక్కించేందుకు 16వేల కోట్లరూపాయల లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ ఆ భారాన్నంతా తనపై వేసుకొని రుణమాఫీని అమలుచేశామని తెలిపారు.

 స్వచ్ఛ సత్తెనపల్లి

స్వచ్ఛ సత్తెనపల్లి

ప్రజాధనానికి ధర్మకర్తగా ఉంటూ అర్హులైన ప్రతిఒక్క రైతుకూ న్యాయం చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు కేస్‌స్టడీ అంటూ ప్రసంగాలు చేశారని, వివరాలు తనకు ఇవ్వమంటే మాత్రం పారిపోయారన్నారు.

 స్వచ్ఛ సత్తెనపల్లి

స్వచ్ఛ సత్తెనపల్లి

రాష్ట్రంలో 40 నుంచి 45లక్షలమంది వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లను అందజేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు.

 స్వచ్ఛ సత్తెనపల్లి

స్వచ్ఛ సత్తెనపల్లి

డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి 10వేలరూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, వారిలో నైపుణ్యాన్ని పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు.

 స్వచ్ఛ సత్తెనపల్లి

స్వచ్ఛ సత్తెనపల్లి

ఇసుక విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లను ఇప్పటికే డ్వాక్రా మహిళలకు అప్పగించామని చంద్రబాబు అన్నారు. విదేశాల్లో ఉన్నవారికి గ్రామాలను దత్తత ఇవ్వడం ద్వారా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌ను తయారుచేయాలని సంకల్పించామన్నారు.

 స్వచ్ఛ సత్తెనపల్లి

స్వచ్ఛ సత్తెనపల్లి

తనపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీకి అధికారమిచ్చిన రాష్ట్రప్రజల రుణం తీర్చుకుంటానని, నవ్యాంధ్రను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని అన్నారు.

 స్వచ్ఛ సత్తెనపల్లి

స్వచ్ఛ సత్తెనపల్లి

సమాజమే దేవాలయం - పేదలే నా దేవుళ్లని ముందుకుసాగిన ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరిక నిర్మూలనకు పాటుపడతానని, ప్రజలంతా సహకరిస్తే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

 స్వచ్ఛ సత్తెనపల్లి

స్వచ్ఛ సత్తెనపల్లి

ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. కుటుంబ సమస్యలు, పెద్ద ఎత్తున అప్పులు, ప్రేమ.. ఇలా ఎన్నో కారణాలు ఉంటాయని ఓ సందర్భంలో అన్నారు. ఆత్మహత్యలు ఆపాలన్నారు.

 స్వచ్ఛ సత్తెనపల్లి

స్వచ్ఛ సత్తెనపల్లి

ఈ కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని కంకణాలపల్లి, ఇరుకుపాలెం గ్రామాలను చంద్రబాబు సందర్శించి ఆ గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు.

English summary
In a remark that took many by surprise, Mr Naidu said that farmer suicides were not just due to drought, but also due to failure in love, mounting debts and family problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X