• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఫోన్: జైల్లో 'గాలి' కేసు నిందితుడి దర్జా ఇలా..(పిక్చర్స్)

By Srinivas
|

హైదరాబాద్: జైలులోకి వచ్చేసరికి వేలిముద్ర, శిక్ష అనుభవించి బయటికి వచ్చేనాటికి చక్కగా సంతకం ఇదే తమ విధానమని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌ బుధవారం తెలిపారు. థంబ్‌ ఇన్‌.. సైన్‌ ఔట్‌ నినాదంతో ముందుకెళుతున్నామని చెప్పారు. జైళ్లలో విద్యాదాన యోజన పథకం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు.

వీకేసింగ్‌ బుధవారం తన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జైళ్లల్లో దశల వారీగా ప్రక్షాళన జరుపుతూ ఆదర్శ జైళ్లుగా తీర్చిదిద్దుతామని, కొత్తగా నిర్మిస్తున్న జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో నిజాం, హైదరాబాద్‌ సంస్కృతి ఉట్టిపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీజీ వెల్లడించారు.

జైళ్లలో అవసరమైన సంస్కరణలు చేపట్టేందుకు ఆరు ప్రత్యేక బృందాలు ఇటీవల ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్‌, బీహార్‌, రాజస్థాన్‌ రాషా్ట్రల్లోని ప్రముఖ జైళ్లలో అధ్యయం చేసి వచ్చాయన్నారు. ములాఖత్‌, వస్తువుల ఉత్పత్తి, లైబ్రరీ విధానాల్లో తీహార్‌ జైలు అగ్రస్థానంలో ఉండగా ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌ విధానంలో రాజస్థాన్‌ ముందంజలో ఉందని డీజీ తెలిపారు.

వీకే సింగ్

వీకే సింగ్

రాష్ట్ర జైళ్లలోని ఖైదీల్లో సుమారు 80 శాతం మంది నిరక్షరాస్యులేనని, వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యాదాన యోజన పథకం ఎంతో ఉపయోగకరంగా మారనుందని వీకే సింగ్ తెలిపారు. ఒక వ్యక్తిని విద్యావంతుడిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి సుమారు పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని, జైళ్లలో ఉన్న నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా మార్చడం వల్ల ప్రభుత్వానికి రూ.100 కోట్లు మిగులుతుందన్నారు.

వీకే సింగ్

వీకే సింగ్

అంటే ఈ లెక్కన జైళ్ల శాఖ ప్రభుత్వానికి రూ.100 కోట్లు మిగిల్చినట్లేనని వీకే సింగ్‌ చెప్పారు. గతంలో జైళ్లు కొనసాగి ప్రస్తుతం ఖాళీగా ఉన్న పురాతన భవనాల్ని మ్యూజియాలుగా మారుస్తామన్నారు. మొదటి దశలో సంగారెడ్డి పాత జైల్లో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.

వీకే సింగ్

వీకే సింగ్

ఖైదీలను బయటి సమాజంతో అనుసంధానించేందుకు మరో ప్రయోగాన్ని చేపడుతున్నామన్నారు. జైళ్లల్లో తయారు చేసే వస్తువులను విక్రయించేందుకు చంచల్‌గూడ జైలు సమీపంలో త్వరలో అత్యాధునిక హంగులతో ‘మై నేషన్‌' పేరుతో షాపింగ్‌ మాల్‌ నిర్మిస్తున్నామన్నారు.

వీకే సింగ్

వీకే సింగ్

పాతబస్తీలో జైళ్ల శాఖ ఏర్పాటు చేయబోయే షాపింగ్‌ మాల్‌ కూడా ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. జైళ్లలో తయారవుతున్న వస్తువులకు విస్తృత మార్కెటింగ్‌ కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని పోలీసు క్యాంటీన్లలో ఖైదీల ఉత్పత్తులు విక్రయించేందుకు అనుమతి కోరుతూ రెండు రాష్ట్రాల డీజీపీలకు లేఖ రాసినట్లు తెలిపారు.

యాదగిరి

యాదగిరి

మరోవైపు, చర్లపల్లి జైలులో, గాలి జనార్ధన్ రెడ్డి అండ్ బ్యాచ్‌కు బెయిల్ ఇప్పించేందుకు ఏకంగా సీబీఐ కోర్టు న్యాయమూర్తికి లంచం ఇవ్వజూపిన కేసులో నిందితుడు యాదగిరి.. సెల్ ఫోను మాట్లాడుతున్నట్లుగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

యాదగిరి

యాదగిరి

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలోకి సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు, గంజాయి వటి నిషేధిత వస్తువులు ఎలా వస్తున్నాయి, ఖైదీలకు సహకరిస్తున్నదెవరు.. ఈ సంగతి తేల్చేందుకు తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వికేసింగ్ నడుం కట్టారు. దీనిపై ఐదుగురు అధికారులతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు.

యాదగిరి

యాదగిరి

ఈ టాస్క్‌ఫోర్స్ బృందం జైళ్లలో అకస్మిక తనిఖీలు చేపడుతుంది. ఈ నెల 23న చర్లపల్లి, చంచల్‌గూడ జైలులో తనిఖీలు నిర్వహించింది.

యాదగిరి

యాదగిరి

అక్కడ యాదగిరితో పాటు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భానుకికరణ్, ఇతర ఖైదీల నుడి సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్‌లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. కొందరి వద్ద గంజాయి కూడా లభించింది. దీని పైన విచారణ జరుపుతున్నారు.

యాదగిరి

యాదగిరి

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలోకి సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు, గంజాయి వటి నిషేధిత వస్తువులు ఎలా వస్తున్నాయి, ఖైదీలకు సహకరిస్తున్నదెవరు.. ఈ సంగతి తేల్చేందుకు తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వికేసింగ్ నడుం కట్టారు. దీనిపై ఐదుగురు అధికారులతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు.

యాదగిరి

యాదగిరి

ఈ టాస్క్‌ఫోర్స్ బృందం జైళ్లలో అకస్మిక తనిఖీలు చేపడుతుంది. ఈ నెల 23న చర్లపల్లి, చంచల్‌గూడ జైలులో తనిఖీలు నిర్వహించింది.

English summary
Photos of DG VK Singh press meat at Chanchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X