మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిగ్విజయ్ హెచ్చరిక, విహెచ్ వాగ్వాదం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా విభజన ఫలం దక్కలేదని, పార్టీకి ఆదరణ రాలేదని, అటు ఆంధ్రప్రదేశ్‌లోను నష్టపోయామని కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆదివారం అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నిర్వహించిన మేథోమధన సదస్సులో డిగ్గీ మాట్లాడారు. కార్పోరేషన్ ఎన్నికల్లో నేతల కుటుంబీకులకు టిక్కెట్లు ఉండవని, మెదక్‌లో సొంతగా పోటీ చేస్తామన్నారు.

కాగా, తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన భవిష్యత్ కార్యాచరణ సదస్సు (మేధోమథనం) కొంతమంది కార్యకర్తల నినాదాలతో గందరగోళమైంది. మాజీ మంత్రులు దానం నాగేందర్, జానారెడ్డి తదితరులు వారించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, చివరకు దిగ్విజయ్ సింగ్ గొడవ చేస్తున్న వారిని హెచ్చరించారు. క్రమశిక్షణ పాటించకపోతే పార్టీ నుంచి ఈ క్షణమే సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఇందూ కళాశాల ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆది, సోమవారం పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు ఏర్పాటు చేశారు. ఆదివారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ సదస్సును ప్రారంభించారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రసంగం పూర్తైన తర్వాత ఏఐసిసి నాయకుడు కుంతియా మాట్లాడేందుకు ఉపక్రమించారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

ఈ సమయంలో కొంతమంది కార్యకర్తలు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను మాట్లాడనివ్వాలని డిమాండ్ చేశారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

ఎంతసేపూ మీరే మాట్లాడుతారా? ఎన్నికల్లో మీరే పోటీ చేస్తారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయడమే కాకుండా భార్యతో కూడా పోటీ చేయించారంటూ నినాదాలు చేశారు. దీంతో సదస్సులో గందరగోళం తలెత్తింది. నినాదాలు చేస్తున్న వారివైపు అందరి దృష్టీ మళ్లింది.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

సదస్సులో ఉన్న ప్రతినిధులంతా తమ స్థానాల్లో నిల్చొని ఆ దిశగా చూస్తుండటంతో, ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీంతో కుంతియా ప్రసంగాన్ని ఆపేశారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవడానికి సదస్సు నిర్వహించామని, అందరితో మాట్లాడిస్తామని, గ్రూపుల వారీగా చర్చలు ఉన్నాయని వివరించారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

మరోవైపు మాజీ మంత్రులు దానం నాగేందర్, షబ్బీర్ అలీ తదితరులు నినాదాలు చేస్తున్న వారికి నచ్చజెప్పారు. తర్వాత దిగ్విజయ్ సింగ్ ప్రసంగం పూర్తైన తర్వాత మరో కార్యకర్త హడావుడి చేశారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

అధికారంలో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు ఇటువంటి మేధోమథనం సదస్సులు ఎందుకు నిర్వహించలేదని, కార్యకర్తలతో సమావేశాలు ఎందుకు నిర్వహించలేదని గట్టిగా అరవడంతో సభ దృష్టి అటుమళ్లింది.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

దానం నాగేందర్ ఆ కార్యకర్తకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. చివరకు దిగ్విజయ్ సింగ్ మైకు తీసుకుని అల్లరి చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఎవరూ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించరాదని హెచ్చరించారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

ఇలా ఉండగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు హాజరైన దిగ్విజయ్ సింగ్ తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన వేదికపైకి వచ్చారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

ఈ సమయంలో ఏఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు కూడా వేదికపై దిగ్విజయ్ సింగ్‌కు తారసపడ్డారు. ఈ సమయంలో వారిరువురూ వాగ్వాదానికి దిగినట్టు కనిపించిందే తప్ప వినిపించలేదు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

కాగా శనివారం గాంధీభవన్‌లో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమీక్షా సమావేశం నుంచి విహెచ్ రుసరుసలాడుతూ, కుర్చీనీ గిరాటేసి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

అలా వెళ్ళిపోవడాన్ని దిగ్విజయ్ ప్రశ్నించారని, అందుకు ఆయన కూడా ఘాటుగానే సమాధానమిస్తూ పార్టీలో ఎలా నడుచుకోవాలో తెలుసునని బదులిచ్చినట్లుగా చెబుతున్నారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

ఇలాఉండగా సదస్సు మొదటి రోజున చాలామంది ముఖ్య నేతలు గైర్హాజరయ్యారు. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు మేధోమథన సదస్సుకు హాజరుకాలేదు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా విభజన ఫలం దక్కలేదని, పార్టీకి ఆదరణ రాలేదని, అటు ఆంధ్రప్రదేశ్‌లోను నష్టపోయామని కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆదివారం అన్నారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెసు నిర్వహించిన మేథోమధన సదస్సులో డిగ్గీ మాట్లాడారు. కార్పోరేషన్ ఎన్నికల్లో నేతల కుటుంబీకులకు టిక్కెట్లు ఉండవని, మెదక్‌లో సొంతగా పోటీ చేస్తామన్నారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

కాగా, తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన భవిష్యత్ కార్యాచరణ సదస్సు (మేధోమథనం) కొంతమంది కార్యకర్తల నినాదాలతో గందరగోళమైంది.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

మాజీ మంత్రులు దానం నాగేందర్, జానారెడ్డి తదితరులు వారించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, చివరకు దిగ్విజయ్ సింగ్ గొడవ చేస్తున్న వారిని హెచ్చరించారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

క్రమశిక్షణ పాటించకపోతే పార్టీ నుంచి ఈ క్షణమే సస్పెండ్ చేస్తామంటూ దిగ్విజయ్ సింగ్ ఘాటుగా హెచ్చరించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఇందూ కళాశాల ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆది, సోమవారం పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు ఏర్పాటు చేశారు. ఆదివారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ సదస్సును ప్రారంభించారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

కాగా, మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున సునీతా లక్ష్మా రెడ్డి పేరును ప్రధానంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 44 సీట్లే వచ్చాయని, ఇంత తక్కువ సీట్లు రావడం ఇదే మొదటిసారి కాదని, ఎమర్జెన్సీ అనంతరం 24 సీట్లు మాత్రమే వచ్చాయని డిగ్గీ గుర్తు చేశారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

అయినా.. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నామని, 2004లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో పోరాడినందునే అధికారంలోకి వచ్చామని, 2009లోనూ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారన్నారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

వైయస్ మరణం తర్వాత కొన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చాయని, వాటిని స్వీకరిస్తున్నామని, ఈసారి ప్రజలు మనకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని, మనం విధ్వంసకర పాత్ర పోషించకూడదన్నారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

బాధ్యతాయుతంగా నిర్మాణాత్మక పాత్ర పోషిద్దామని, గతంలో యూపీఏ విధానాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని చెప్పారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

మనం పని ఎక్కువ చేసి.. ప్రచారం తక్కువ చేసుకున్నామని, సోషల్‌ మీడియా, వాట్సప్‌, ఫేస్‌ బుక్‌ ప్రచారంతో బీజేపీ ఎక్కువ లాభం పొందిందన్నారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

హిందూ సంప్రదాయవాదాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందిందని, కానీ, మన పార్టీ హిందూ, ముస్లింలను ఒకే విధంగా చూస్తూ వస్తోందన్నారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

ఈ రోజు ప్రతి ఇంట్లో టీవీ ఉందని, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లండని, నిర్మాణాత్మక పాత్ర వైపు కదలండని, త్వరలో హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు జరగబోతున్నాయని, మనం మనం పోట్లాడుకోవడం కాదని, అందరం కలిసి ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

తెలంగాణ ఇచ్చినా ఎందుకు ఓటమి పాలయ్యామో సమీక్షించుకుందామని కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

English summary
AICC general secretary Digvijay Singh on Sunday asked the Telangana Congress to fight against the TRS government for not implementing its poll promises even after two months of coming to power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X