హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అగ్ని ప్రమాదం: ప్రాణభయంతో పరుగో పరుగు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుభాష్ నగర్‌లోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. కెమికల్ డ్రమ్ములు పేలుతూ మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల బస్తీల ప్రజలు, పరిశ్రమల యాజమాన్యాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. రసాయనాలతో మంటలు చెలరేగి జీడిమెట్ల ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది.

మంటలను అదుపు చేయడానికి ఏడు ఫైరింజన్లతో నలభై మంది సిబ్బంది శ్రమించారు. వీరికి కొన్ని బల్క్ డ్రగ్ పరిశ్రమల సిబ్బంది సహాయం చేశారు. మెహదీపట్నానికి చెందిన అన్నదమ్ములు యూసుఫ్, ఆసిఫ్, అజీజ్ బల్క్ డ్రగ్ పరిశ్రమల నుంచి సాల్వెంట్స్ సేకరించి, ప్లాస్టిక్ సంచులపై ముద్రించటానికి ఉపయోగించే ఇంకును, ఎన్‌సి తిన్నర్‌ను తయారు చేస్తారు.

జీడిమెట్ల పారిశ్రామికవాడలోని మైలాన్ కంపెనీ సమీపంలో భారత్ ఫ్లెక్స్ గ్రాఫిక్స్ ప్రింటింగ్ ఇంక్స్‌పేరుతో పరిశ్రమను నిర్వహిస్తున్నారు. 2012 ఆగస్టు 15న ఈ పరిశ్రమలో రియాక్టర్లు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేయడానికి అప్పట్లో నాలుగు రోజులు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బల్క్‌డ్రగ్ పరిశ్రమల నుంచి తీసుకొచ్చిన వ్యర్ధ రసాయనాలను ఇతర మిశ్రమాలను డ్రమ్ములో పోసి మోటార్ ద్వారా మిక్సింగ్ చేస్తుండగా మంటలంటుకున్నాయి.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. సాల్వెంట్స్ డ్రమ్ములు పేలి దాదాపు వంద మీటర్ల దూరంలో పడ్డాయి. మంటలు ఎగసి పడడంతో ప్రజలు భీతిల్లారు. కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు వ్యాపించాయి.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

పక్కనే ఉన్న ఫ్రెండ్స్ ప్యాకింగ్ పరిశ్రమకు మంటలంటుకుని దాదాపు 15 లక్షల రూపాయల విలువ చేసే రోల్స్ కాలిపోయాయి. పక్కనే ఉన్న షూర్యాక్స్ కంపెనీ కాంపౌండ్ వాల్ కూలిపోయింది.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

రెండు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాలుష్య నియంత్రణ అధికారి ప్రసాదరావు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్‌రెడ్డి, రీజనల్ ఫైర్ అధికారి నారాయణరావు, ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

కంపెనీ యాజమాన్యంపై తక్షణమే చర్య తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. బాలానగర్ ఎసిపి, జీడిమెట్ల సిఐ, సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

ప్రజలు, స్థానికులు ఘాటైన వాసనలతోఉక్కిరి బిక్కిరయ్యారు. గోదాంలోని రసాయనాలు కాలి గాలిలో కలవడంతో ఘాటైన వాసనలతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

కెమికల్ డ్రమ్ములు పేలుతూ మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల బస్తీల ప్రజలు, పరిశ్రమల యాజమాన్యాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

మంటలను అదుపు చేయడానికి ఏడు ఫైరింజన్లతో నలభై మంది సిబ్బంది శ్రమించారు. వీరికి కొన్ని బల్క్ డ్రగ్ పరిశ్రమల సిబ్బంది సహాయం చేశారు.

English summary
Fire broke out in the godown of Bharat Flexi Graphics Printing, a plastic intermediates manufacturing company, at Jeedimetla IDA, on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X