హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో కుదుపు: కేసీఆర్ ఫైర్, లేఖ నిజమని..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండు రోజులుగా మెట్రో రైలు అంశం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మెట్రో రైలు పనులు మీరే చేసుకోండంటూ ఎల్ అండ్ టీ కంపెనీ లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఎల్ అండ్ టీ ఎండీ గాడ్గిల్, మెట్రో అధికారులు ఖండించారు.

అయితే, అదే సమయంలో ఎల్ అండీ టీ కంపెనీ ఎండీ గాడ్గిల్ బుధవారం విలేకరుల ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కాగా, గాడ్గిల్ ఈ లేఖను ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ మెట్రో రైలు ఎండీకి రాశారని తెలుస్తోంది. ప్రభుత్వం స్వీకరిస్తే ప్రాజెక్టును వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో పేర్కొన్నారని తెలుస్తోంది. లేఖ పైన దుమారం రేగడంతో తెలంగాణ ప్రభుత్వం చురుగ్గా స్పందించిందంటున్నారు.

బుధవారం ఉదయం వివిధ స్థాయిల్లోని ఉన్నతాధికారులు సచివాలయంలో పలుమార్లు సమావేశమై ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించారు. మొదట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో, మున్సిపల్ అధికారులతో చర్చించారు. తర్వాత ఎల్ అండ్ టీ మెట్రో సీఈవో గాడ్గిల్‌తో, హైదరాబాద్ మెట్రో రైలు అధికారులతో సుదీర్ఖంగా సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు విషథయంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టును సాఫీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, నిర్ధారిత గడువలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఓ ప్రకటన కూడా వెలువడింది.

మెట్రో రైలు

మెట్రో రైలు

భారీ ప్రాజెక్టులు అన్న తర్వాత చిన్నచిన్న సమస్యలు సాధారణమేనని, తాము రాసిన లేఖ సాధారణమేనని, నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా మెట్రో రైలు పనులు ఆగిపోతుందని వార్తలు రాయడం సరికాదని ఎల్ అండ్ టీ ఎండీ గాడ్గిల్ బుధవారం అన్నారు.

మెట్రో రైలు

మెట్రో రైలు

మెట్రో రైలు విషయమై వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాడ్గిల్ తెలంగాణ సీఎం కేసీఆర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

ఎన్వీఎస్ రెడ్డి తెలంగాణ సీఎస్‌తో రెండుసార్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గాడ్గిల్ విలేకరులతో మాట్లాడారు. భారీ ప్రాజెక్టులు అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు సాధారణమే అన్నారు. తాను ఎవ్వరికీ సమాచారం ఇవ్వలేదన్నారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

మెట్రో ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అన్నారు. మెట్రో పనులు కొనసాగుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఎల్ అండ్ టీ పైన దుష్ప్రచారం చేయడానికి కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు రాస్తున్నాయన్నారు.

English summary
Photos of Gadgil speaks to media at Secretariate on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X