వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకే సాధ్యం: టిడిపిలోకి భారీగా వలసలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:'తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకే విభజన పరిణామాల్లో కేంద్రం సీమాంధ్రకు ఏం ఇచ్చిందో అర్ధం కావడం లేదని, ఇక సామాన్యులకేం అర్థమవుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు.

మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, ఆమె తనయుడు గల్లా జయదేవ్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అపాయింట్ డే తర్వాత జీతాలు ఇవ్వడానికి డబ్బు లేకపోతే ఒక నెల మాత్రం కేంద్రం ఇస్తుందట అని, ఆ తర్వాత ఏమిటంటే ఎవరి వద్దా సమాధానం లేదన్నారు.

ఎక్కడ రాజధాని పెడతారో, ఎలా పెడతారో తెలియదన్నారు. జైరాం రమేష్ పూటకో మాట చెప్పి పోతాడని మండిపడ్డారు. రెండు ప్రాంతాల ప్రజలు ఆనందపడేలా సమ న్యాయంతో విభజన చేయాలని తాను కోరితే అద్దె పుత్రుడు, దత్త పుత్రుడిని పెట్టుకొని సోనియా నాటకాలు ఆడారని, టిడిపిని దెబ్బ తీయాలనుకొని చివరకు తాను తీసిన గోతిలో కాంగ్రెస్ తానే పడిందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, ఆమె తనయుడు గల్లా జయదేవ్ పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అపాయింట్ డే తర్వాత జీతాలు ఇవ్వడానికి డబ్బు లేకపోతే ఒక నెల మాత్రం కేంద్రం ఇస్తుందట అని, ఆ తర్వాత ఏమిటంటే ఎవరి వద్దా సమాధానం లేదన్నారు.

గల్లాతో

గల్లాతో

గోతిలో పడిన ఆ పార్టీపై తలా ఒకరు తట్టెడు మన్ను వేసి భూస్ధాపితం చేయడంతోపాటు కాంక్రీట్ చేసి శాశ్వతంగా సమాధి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న గల్లా

మాట్లాడుతున్న గల్లా

ఇటలీ రిపబ్లిక్ దినోత్సవం రోజును ఇక్కడ అపాయింటెడ్ డేగా ఇచ్చారని విమర్శించారు. ఒకదాని వెంట ఒకటి వచ్చి పడుతున్న ఎన్నికలు చూస్తే మతి పోతోందని, కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్లే అరవై రోజుల్లో అర డజను ఎన్నికలు చూడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.

గల్లా జయదేవ్

గల్లా జయదేవ్

ఎన్జీరంగా, రాజగోపాల నాయుడు, ఎన్టీ రామారావు వంటి వారి వద్ద రాజకీయాలు నేర్చుకొన్న తాను ఇప్పుడు ఒక సైకోతో ఎన్నికల పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు.

జయదేవ్

జయదేవ్

ఎవరైనా పిల్లలను కంటికి ఎదురుగా ఉంచుకోవాలని అనుకొంటారని, కాని జగన్‌ను తండ్రే భరించలేక బెంగుళూరు పంపాల్సి వచ్చిందని, తండ్రే భరించలేనివాడిని ప్రజలు భరించగలరా? అవినీతికి పాల్పడ్డాడని నిర్ధారించి వెయ్యి కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిందని చంద్రబాబు అన్నారు.

గల్లా

గల్లా

మరొకరైతే ప్రజలకు మొహం చూపించడానికి సిగ్గు పడతారని, జగన్ మాత్రం దర్జాగా రోడ్డెక్కి రాజకీయ విలువల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నాడని విమర్శించారు.

తల్లీ కొడుకు

తల్లీ కొడుకు

తమది నవతరమని జగన్ పార్టీ చెబుతోందని, అది నవతరం కాదని, దోపిడీ తరమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము వస్తే రాజధాని కడతామని, వీళ్లు వస్తే చంచల్‌గూడా జైళ్లు కడతారన్నారు.

టిడిపిలోకి

టిడిపిలోకి

వాళ్లను గెలిపిస్తే కేసుల మాఫీ కోసం తిరుగుతారని, తమను గెలిపిస్తే రాష్ట్రం కోసం తిరుగుతామన్నారు. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు పేర్కొన్నారు.

టిడిపి

టిడిపి

సీమాంధ్రను తుక్కు నుంచి కొత్తగా నిర్మించాల్సి ఉందని, అక్కడ మొత్తం పాతిక సీట్లూ ప్రజలు గెలిపించి ఇస్తే కావాల్సిన ప్రధానిని తెచ్చుకొని రెండు ప్రాంతాలనూ అభివృద్ధి చేసుకొంటామని చెప్పారు.

అభివాదం

అభివాదం

గల్లా అరుణ టిడిపిలో చేరిన సందర్భంగా ఆమె తండ్రి రాజగోపాల నాయుడును టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గుర్తుకు తెచ్చుకొన్నారు. కాగా, సీమాంధ్ర అభివృద్ధి బాబుకే సాధ్యమని టిడిపిలో చేరుతున్న నేతలు చెబుతున్నారు.

కుతూహలమ్మ

కుతూహలమ్మ

కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. శనివారం రాత్రి ఆమె టిడిపి అధ్యక్షులు చంద్రబాబును కలిశారు. కాగా, టిడిపిలో గల్లా అరుణ, టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి తదితరులు చేరారు. మరికొందరు క్యూలో ఉన్నారు.

English summary
Former minister Galla Aruna Kumari and her son Galla Jayadev joined in Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X