వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరీష్ చెప్తుంటే కవిత తలొంచి: జగన్‌పార్టీ జత(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కోరారు. హరీష్ రావు బృందం సోమవారం ఢిల్లీలో ఉమాభారతిని కలిశారు. అరగంటకు పైగా సాగిన చర్చలో తెలంగాణలోని సాగునీటి సమస్యలు, పూర్తి కాని పలు ప్రాజెక్టుల వివరాలను ఉమకు తెలిపారు. అనంతరం హరీష్ రావు విలేకరులతో మాట్లాడారు.

కృష్ణానదిపై తెలంగాణకు న్యాయమైన వాటా దక్కలేదని మంత్రికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గత ఆరు దశాబ్దాలుగా ఏపీలోని ప్రభుత్వాలు ఎన్నడు తమ ప్రాంత అవసరాలను పట్టించుకోలేదని, బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునళ్ల ముందు తెలంగాణ అవసరాలు, ప్రాజెక్టుల గురించి నాటి ప్రభుత్వాలు తెలపక పోవడంతో అన్యాయం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడం లేదా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ పరిమితి పెంచడం ద్వారా 4 రాష్ట్రాల మధ్య కృష్ణా నది నీటిని పునఃపంపిణీ చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు.

తమ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కష్టాలు తనకు బాగా తెలుసునని, తప్పకుండా ప్రత్యేక దృష్టితో చూస్తామని, మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరిస్తామని ఉమాభారతి చెప్పారన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరినట్లు చెప్పారు. అనంతరం హరీష్ రావు మరో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో భేటీ అయ్యారు.

ప్రకాశ్ జవదేకర్, హరీష్ రావు

ప్రకాశ్ జవదేకర్, హరీష్ రావు

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణకు చెందిన అన్ని ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని హరీష్ రావు భేటీ అనంతరం చెప్పారు.

ప్రకాశ్ జవదేకర్, హరీష్ రావు

ప్రకాశ్ జవదేకర్, హరీష్ రావు

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణకు చెందిన అన్ని ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని హరీష్ రావు భేటీ అనంతరం చెప్పారు.

ఉమాభారతితో...

ఉమాభారతితో...

కేంద్ర మంత్రి ఉమా భారతితో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలు భేటీ అయ్యారు.

కోదండరామ్

కోదండరామ్

పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ పార్లమెంటు ప్రవేశ పెట్టిన బిల్లును నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో కోదండరామ్.

టీజేఏసీ

టీజేఏసీ

పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ పార్లమెంటు ప్రవేశ పెట్టిన బిల్లును నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు.

టీజేఏసీ

టీజేఏసీ

పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ పార్లమెంటు ప్రవేశ పెట్టిన బిల్లును నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు.

టీజేఏసీ

టీజేఏసీ

పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ పార్లమెంటు ప్రవేశ పెట్టిన బిల్లును నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ..

టీజేఏసీ

టీజేఏసీ

పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ పార్లమెంటు ప్రవేశ పెట్టిన బిల్లును నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో దృశ్యం. సేవ్ ఆదివాసీ అంటూ ప్రదర్శన.

English summary
Photos of Telangana Minister Harish Rao meets Central Ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X