వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్రో మార్పు, ఎన్ కన్వెన్షన్‌పై చర్య: కేసీఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెట్రో మార్గంలో మార్పులు ఉంటాయని, వారసత్వ కట్టడాలకు ముప్పు ఉండకూడదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఆయన ఆదివారం సాయంత్రం విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైనా స్పందించారు.

అలాగే రైతుల రుణమాఫీ విషయం చెప్పారు. జీహెచ్ఎంసీని రెండు లేదా మూడు కార్పోరేషన్లుగా విడగొట్టే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. మెట్రో రైలు నిర్మాణ మార్గంలో మార్పులు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. వారసత్వ కట్టడాలు ఉన్న ప్రాంతాల్లో రైలు మార్గాన్ని మార్చినట్లు తెలిపారు.

రిజర్వ్ బ్యాంకు రైతు రుణమాఫీని అమలు చేయని పక్షంలో నేరుగా రైతులకే బాండ్ల రూపంలో మాఫీ మొత్తాలని అందజేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరం చుట్టు బస్, రైలు టెర్మినళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్నారు.

కేసీఆర్

కేసీఆర్

మెట్రో రైలు నిర్మాణం వల్ల వారసత్వ కట్టడాలకు ముప్పు వాటిల్లకూడదన్న ఉద్దేశంతోనే మార్గాన్ని మార్చాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

అసెంబ్లీ నుండి వెళ్లే మార్గాన్ని దాని వెనుక వైపు నుండి, సుల్తాన్ బజార్ నుండి వెళ్లే మార్గాన్ని కోఠిలోని మహిళా కళాశాల నుండి మళ్లిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

మెట్రో రైలు పనులు వేగంగా నడుస్తాయని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కోసం హైదరాబాదును అన్ని రంగాలలో తీర్చిదిద్దుతున్నామని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక్కటే పెద్దదిగా ఉందని, రైళ్లను నలువైపుల నిలిపేందుకు వీలుగా మౌలాలీ, వట్టినాగులపల్లిల్లో స్టేషన్లు నిర్మించాలని ఆదేశించినట్లు చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

జూబ్లీ బస్ స్టేషన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మాదిరిగా నగరానికి అన్ని వైపులా బస్ టెర్మినళ్లను నిర్మించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

మూడు కోర్టులలో కేసుల వల్ల హైదరాబాలో కూల్చివేతలు ఆగిపోయాయని కేసీఆర్ తెలిపారు. త్వరలోనే మళ్లీ చేపడతామని ఆయన అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఎన్ కన్వెన్షన్ సహా మిగిలిన వాటన్నింటిలోను ఆక్రమణలను గుర్తించామని కేసీఆర్ తెలిపారు. వాటి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ప్రస్తుతం ఢిల్లీలో మూడు, ముంబైలో రెండు కార్పోరేషన్లు ఉన్నాయని, హైదరాబాద్ జనాభా కోటి దాటుతోందని, ఒక్కటే కార్పోరేషన్ ఉండటం సరికాదని కేసీఆర్ అన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

హైదరాబాద్ కార్పోరేషన్‌ను రెండు నుండి మూడు కార్పోరేషన్లుగా చేయాలన్నారు. ఇందుకోసం అధ్యయనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

వార్డుల విభజన తదితర అంశాలపై న్యాయపరమైన వివాదాల వల్ల జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని కేసీఆర్ తెలిపారు.

 కేసీఆర్

కేసీఆర్

పంట రుణాల మాఫీకి ఇప్పటికే తాము ఉత్తర్వులు ఇచ్చామని, ఆర్బీఐతో చర్చలు జరిపామని, ఒకేసారి రూ.18 వేల కోట్లను చెల్లించాలని ఆర్బీఐ షరతు విధిస్తోందని, ఇది సాధ్యం కాదని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఆర్బీఐ అంగీకరించకపోతే రైతులకే నేరుగా మాఫీ మొత్తాలను చెల్లించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాండ్లను అందజేస్తుందని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

ఐఏఎస్‌ల విభజన ప్రక్రియ పూర్తయి 35 మంది మంచి అధికారులు దొరికితే పాలనను పరుగులు తీయిస్తానని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

 కేసీఆర్

కేసీఆర్

విభజన జరిగి 75 రోజులు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ తగినంతమంది అధికారులు, ఉద్యోగులు లేకపోవడంతో తమ చేతులు కట్టేసినట్లయిందని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

గవర్నర్ సమక్షంలో చంద్రబాబుతో జరిపిన సమావేశం వల్ల ఉద్యోగుల సమస్యలు 90 శాతం పరిష్కారం అయినట్లే అన్నారు. ఇక పైన వారికి ఇబ్బందులు ఉండవని చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

నాలుగో తరగతి సిబ్బంది సహా మిగిలిన వారు సొంత రాష్ట్రాలలో పని చేసే అవకాశం లభిస్తుందని కేసీఆర్ చెప్పారు. సూపర్ న్యూమరీ పోస్టుల సృష్టి సమస్య కాదన్నారు.

కేసీఆర్

కేసీఆర్

సింగపూర్ పర్యటన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతానికి విస్తరణ గురించి ఆలోచించడం లేదని కేసీఆర్ తెలిపారు.

 కేసీఆర్

కేసీఆర్

నామినేటెడ్ పోస్టులను తాము భర్తీ చేస్తామన్నారు. పేకాడ క్లబ్బులు, ఇతర జూదశాలల పైన తాము ఉక్కుపాదం మోపుతామని కేసీఆర్ అన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

మెట్రో మార్గంలో మార్పులు ఉంటాయని, వారసత్వ కట్టడాలకు ముప్పు ఉండకూడదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఆయన ఆదివారం సాయంత్రం విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైనా స్పందించారు.

కేసీఆర్

కేసీఆర్

అలాగే రైతుల రుణమాఫీ విషయం చెప్పారు. జీహెచ్ఎంసీని రెండు లేదా మూడు కార్పోరేషన్లుగా విడగొట్టే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

మెట్రో రైలు నిర్మాణ మార్గంలో మార్పులు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. వారసత్వ కట్టడాలు ఉన్న ప్రాంతాల్లో రైలు మార్గాన్ని మార్చినట్లు తెలిపారు.

English summary

 Telangana chief minister K Chandrasekhara Rao said the ongoing Hyderabad Metrorail project would be expanded to a distance of 200 km from the current 72 km to take care of the future urban transportation needs of the growing city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X