వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమావాస్య వెలుగులు: దీపావళి సంబరాలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆదివారం దీపావళి పర్వదినాన్ని ఆనందోత్సాహల మధ్య జరుపుకున్నారు. అందరు ఇళ్ల ముందు దీపాలు వెలిగించడంతో చీకట్లో వెలుగులు విరజిమ్మాయి. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు మిన్నంటాయి. నగరంలోని ఉత్సాహంగా జరుపుకున్నారు.

చిన్నా పెద్దా అందరూ టపాసులు కాల్చి సందడి చేశారు. దేవాలయాలు అన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుండి దేవాలయాలు కిటకిటలాడగా, రాత్రి బాణసంచా మెరుపులు ఆకాశంలో కనిపించాయి. కాగా సీమాంధ్రలో దీపావళి వేడుకలను విభజన తీరును నిరసిస్తూ అందుకు అనుగుణంగా నిరసన తెలిపారు.

మరోవైపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాసం సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారు జామునుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడికి పూజలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో శివాలయాలు కిక్కిరిసిపోయాయి.

దీపావళి 1

దీపావళి 1

చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా అన్ని వర్గాల ప్రజలు ఎంతో అనందంగా టపాసుల మోతతో జరుపుకునే దీపావళి పండుగ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఘనంగా జరిగింది.

దీపావళి 2

దీపావళి 2

స్వల్ప సంఘటనల మినహా పండుగ ప్రశాతంగా జరిగింది. దీపావళి పండుగలో చెప్పుకోదగిన స్థానంలో టపాసుల ధరలను గతంలో కన్నా పోల్చిస్తే ఈ సారి టపాసుల ధరలు దాదాపు ఇరవై శాతం పెరిగాయి.

దీపావళి 3

దీపావళి 3

ముఖ్యంగా ఈసారి దసరాతో పాటు దీపావళి కూడా రెండు రోజుల పాటు రావటంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అయోమయానికి గురయ్యారు.

దీపావళి 4

దీపావళి 4

శనివారం రాత్రి కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో టపాసుల పండుగ జరుపుకున్నారు. గల్లీగల్లీల్లో టపాసుల మోత మారుమోగిపోయింది.

దీపావళి 5

దీపావళి 5

కొన్ని ప్రాంతాల్లో టపాసులు కాల్చే సమయంలో స్వల్ప ప్రమాదాలు కూడా జరిగాయి. లక్ష్మీ పూజలు నిర్వహిస్తున్న పలు ప్రాంతాల్లో పోలీసులు షాపులు మూసివేయించటం వివాదాస్పదంగా మారింది.

దీపావళి 6

దీపావళి 6

రాజధాని హైదరాబాదులో లక్ష్మీ పూజలు నిర్వహిస్తున్న పలు ప్రాంతాల్లో పోలీసులు షాపులు మూసివేయించటం వివాదాస్పదంగా మారింది.

దీపావళి 7

దీపావళి 7

రాజధాని హైదరాబాదులో లక్ష్మీ పూజలు నిర్వహిస్తున్న పలు ప్రాంతాల్లో పోలీసులు షాపులు మూసివేయించటం వివాదాస్పదంగా మారింది.

దీపావళి 8

దీపావళి 8

సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లో అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన జనరల్ బజార్, రాంగోపాల్ పేట, బేగంపేట, గ్రీన్‌లాండ్స్ తదితర ప్రాంతాల్లో దీపావళి సంబరాలు జరిగాయి.

దీపావళి 9

దీపావళి 9

ఆదివారం ఉదయాన్నే సికిందరాబాద్ జనరల్ బజార్‌లోని పలు షాపింగ్ సెంటర్స్‌తోపాటు వస్త్ర దుకాణాలు, బంగారు దుకాణాలు వంటి వాణిజ్య సంస్థలన్నీ దీపావళి పండుగ శోభను సంతరించుకున్నాయి.

దీపావళి 10

దీపావళి 10

ఉదయం ఆయా షాపింగ్ సెంటర్స్ ముందు వివిధ పూల అలంకరణలతో ముస్తాబుచేశారు. సాయంత్రం ప్రతి షాపులో లక్ష్మీపూజ నిర్వహించారు.

దీపావళి 11

దీపావళి 11

దీపావళి పర్వదినం సందర్భంగా చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మీ ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఇక్కడకు భక్తులు భారీగా తరలి వచ్చారు.

దీపావళి 12

దీపావళి 12

దీపావళి పర్వదినం సందర్భంగా చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మీ ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఇక్కడకు భక్తులు భారీగా తరలి వచ్చారు.

దీపావళి 13

దీపావళి 13

సికిందరాబాద్ మోండా మార్కెట్, జనరల్ బజార్, పాలికా బజార్, రాంగోపాల్‌పేట, బేగంపేట తదితర ప్రాంతాల్లో దీపావళి పండుగను జరుపుకున్నారు.

దీపావళి 14

దీపావళి 14

ఆదివారం సాయంత్రం పై ప్రాంతాల్లో లక్ష్మీపూజ అనంతరం ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరుపకుండా నిలిపివేయడంతో కొనుగోలుదారులు కూడా పూజలో పాల్గొన్నారు.

దీపావళి 15

దీపావళి 15

ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు అధికారులు, ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లు ముందస్తు ఐబి హెచ్చరికల నేపథ్యంలో వివిఐపి ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

దీపావళి 16

దీపావళి 16

రాంగోపాల్‌పేట డివిజన్‌లోని ప్యారడైజ్ సర్కిల్‌లోని బెంగాలి గోల్డ్‌స్మిత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా శనివారం కాళీ మాత అమ్మవారిని ప్రతిష్టించారు.

దీపావళి 17

దీపావళి 17

సోమవారం కాళీమాత విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జం కావించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం 2వేలమందికి అన్నదాన కార్యక్రమం చేశారు.

దీపావళి 18

దీపావళి 18

దీపావళి పండగ సందర్భంగా వ్యాపారులు లక్ష్మీపూజలు నిర్వహించారు ఆనంతం మిఠాయిలు పంచుకున్నారు. ఆనంతరం చిన్నారులతో సహా దీపావళి టపాకాయలు కాల్చారు.

దీపావళి 19

దీపావళి 19

కంటోన్మెంట్ పరిధిలో పెద్ద ఎత్తున టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేశారు. మర్డ్ఫుర్డులోని గ్రౌండ్సులో, జూబ్లీబస్ స్టేషన్ వద్ద, తిరుమలగిరి, కార్కానా, బోయిన్‌పల్లి, బొల్లారం, అల్వాల్, వెంకటాపురం, మచ్చబొల్లారం, యాప్రాల్ ప్రాంతంలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేశారు.

దీపావళి 20

దీపావళి 20

రాజధానిలో అన్ని ప్రాంతాల్లో రహదారుల్లోని దుకాణాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎక్కడ చూసినా దీపావళి కాంతులతో వెలుగులు విరజిమ్మాయి.

దీపావళి 21

దీపావళి 21

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఎక్కడ చూసినా దీపావళి కాంతులతో వెలుగులు విరజిమ్మాయి. ఓ కుటుంబం దీపావళి టపాసులు కాలుస్తున్న దృశ్యం.

దీపావళి 22

దీపావళి 22

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో పలు ప్రాంతాలలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా, పండ్లు, మిఠాయిలు, పూలు గృహలంకరణ తదితర దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి.

దీపావళి - 23

దీపావళి - 23


దీపావళి నేపథ్యంలో ప్రతిష్ఠించే దొంతులు, బొమ్మలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. చిన్నారులు, యువత బాణసంచా కొనుగోలు చేసేందుకు బారులు తీరారు.

దీపావళి - 24

దీపావళి - 24


గతంలో కంటే ఈ యెడాది రెండింతలకు పైగా టపాసుల ధరలు ఉండడంతో కొనుగోళ్లు చాలావరకు తగ్గినట్టు వ్యాపారులు తెలిపారు. వ్యాపార, వాణిజ్య, శ్రామిక సంస్థలు ప్రత్యేకంగా లక్ష్మిదేవి పూజ నిర్వహించారు.

దీపావళి - 25

దీపావళి - 25


సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు, సిబ్బందికి బోనస్‌తో పాటు స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు. పెద్దలు మొదలుకొని చిన్నారుల వరకు పెద్ద ఎత్తున బాణసంచాను పేలుస్తూ దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

దీపావళి 26

దీపావళి 26


చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి. ఈ పండుగను పురస్కరించుకుని నగరంలోని ప్రజలు శని, ఆదివారం లక్ష్మీ పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

దీపావళి 27

దీపావళి 27


మామిడి ఆకులు, రంగురంగుల పూలతో ఇంటి గుమ్మాలను అలంకరించారు. విద్యుత్ కాంతుల మధ్య కొత్త బట్టలు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా పేలుస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.

దీపావళి 28

దీపావళి 28


దీపావళి సందర్ధంగా పరిసర ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మంచి రోజులు వచ్చిన నేపథ్యంలో చాలా మంది తమ ఇళ్లలో గౌరీనోము, సత్యనారాయణ వ్రతాలు సామూహికంగా నిర్వహించారు.

English summary
The festival of Diwali symbolized the victory of light over dark, good over evil and knowledge over darkness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X