హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిని టీజ్ చేయొద్దన్నందుకు జూనియర్‌ను చంపేశాడు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీజింగ్ చేయవద్దని హితవు పలికిన పాపానికి ఓ జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థి బలిగొన్న విషాదం ప్రగతి హైదరాబాదులోని మహావిద్యాలయలో శనివారం చోటు చేసుకుంది.

మంచి చెప్పినందుకు ఆ సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థిని ముష్టిఘాతాలతో బలిగొన్నాడు. ఇది రాజధానిలో సంచలనం సృష్టించింది.

ప్రగతి విద్యాలయానికి చెందిన హర్షవర్ధన్ బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో జియాగూడకు చెందిన సతీష్ బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

టీజింగ్ చేయవద్దని హితవు పలికిన పాపానికి ఓ జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థి బలిగొన్న విషాదం ప్రగతి హైదరాబాదులోని మహావిద్యాలయలో శనివారం చోటు చేసుకుంది.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

మంచి చెప్పినందుకు ఆ సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థిని ముష్టిఘాతాలతో బలిగొన్నాడు. ఇది రాజధానిలో సంచలనం సృష్టించింది.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి విద్యాలయానికి చెందిన హర్షవర్ధన్ బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో జియాగూడకు చెందిన సతీష్ బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

శనివారం ఉదయం తరగతులకు వెళుతుండగా సతీష్ ఓ యువతిని టీజ్ చేశాడు. ఆ తర్వాత బయటకి వచ్చినప్పుడు ఆమెను మరోసారి టీజ్ చేశాడు.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

ఆ విద్యార్థిని క్లాస్‌మేట్ అయిన హర్షవర్ధన్ ర్యాగింగ్ చేసిన సతీష్‌ను అడ్డుకున్నాడు. ఆ అమ్మాయిని ఏడిపించవద్దన్నా అని సూచించాడు. దానికి సతీష్ ఘాటుగా స్పందించాడు.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ


తాను సీనియర్‌ను అని, ఏదైనా చేస్తానని దురుసుగా సమాధానమిచ్చాడు. ఓ జూనియర్ విద్యార్థి నలుగురిలో తనను నిలదీశాడన్న విషయాన్ని సతీష్ జీర్ణించుకోలేకపోయాడు.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ


మూడో అంతస్తులోని హర్షవర్ధన్ తరగతి గదికి లంచ్ సమయంలో వెళ్లి పిడిగుద్దులు కురిపించాడు. అతని చాతి, మెడ, తల పైన దాడి చేశాడు. హర్ష తల బెంచ్‌కు తగలడంతో స్పృహతప్పి పడిపోయాడు.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

వెంటనే హర్షవర్ధన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. తలలో రక్తం గడ్డకట్టి పరిస్థితి విషమంగా ఉండటంతో కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతను మృతి చెందాడు. హర్షవర్ధన్ తిలక్ రోడ్డులోని రాంకోఠి వాసి.

English summary
Photos of Junior killed in senior attack in Hyderabad on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X