హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆలయాలు కిటకిట: భాగ్యనగరంలో కార్తీక శోభ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో కార్తీక శోభ నిండు చంద్రుడిని తలదన్నింది. ఆదివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుండే ఆలయాలు కిటకిటలాడాయి.

సాయంత్రం భాగ్యనగరవాసులు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించారు. దీపకాంతుల్లో హైదరాబాదు మెరిసిపోయింది. దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రమిదల అలంకరణలు సరికొత్త హంగులు అద్దాయి.

హైదరాబాదులో, రాష్ట్రంలో కార్తీక శోభ ఆధ్యాత్మికతను తీసుకు వచ్చింది. వేకువజాము నుండే భక్తులు ఆలయాల ముందు బారులు తీరారు.

కార్తీక 1

కార్తీక 1

కార్తీక పౌర్ణమి దీపాల వెలుగులతో రాష్ట్రం శోభాయమానమైంది. రాష్ట వ్య్రాప్తంగా భక్తిశ్రద్ధలతో పౌర్ణమి పండుగను భక్తులు జరుపుకున్నారు.

కార్తీక 2

కార్తీక 2

విజయవాడలోని కృష్ణా నదీ తీరంలోను, ఖమ్మం జిల్లా భద్రాచలంలోని పవిత్ర గోదావరి తీరంలోను కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కనుల పండువగా నదీ హారతి ఇచ్చారు.

కార్తీక 3

కార్తీక 3

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని భాజాభజంత్రీలతో కృష్ణా నదీ తీరానికి తీసుకొచ్చి ఆ తల్లి సమక్షంలో వైభవంగా పంచహారతులు ఇచ్చారు.

కార్తీక 4

కార్తీక 4

భద్రాచలంలోని సీతారామచంద్రుల ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాలు, మేళతాళాలతో గోదావరి తీరానికి తీసుకొచ్చి నదీ మాతకు కుంభాది పంచహారతులు ఇచ్చారు.

కార్తీక 5

కార్తీక 5

గోదావరి మాతకు పసుపు, కుంకుమ, గాజులు, తదితర మంగళకరమైన వస్త్రాలను వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య సమర్పించారు. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణా, గోదావరి తీరాల్లో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు చేసి, దీపారాదన చేశారు.

కార్తీక 6

కార్తీక 6

కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతోఆదివారం మల్లన్న సన్నిధి కిటకిటలాడింది.

కార్తీక 7

కార్తీక 7

పవిత్ర స్నానాల కోసం శ్రీశైలం పాతాళ గంగ వద్ద భక్తులతో రద్దీగా మారింది. కృష్ణా నదిలో స్నానమాచరించిన భక్తులు నదీమతల్లికి హారతులిచ్చారు.

కార్తీక 8

కార్తీక 8

శ్రీశైలంలో భక్తులు వెలిగించిన కార్తీక దీపాలతో ఆలయానికి ప్రత్యేక శోభ సంతరించుకుంది. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి అధికారులు అంచనా ప్రకారం సుమారు 1.50లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు.

కార్తీక 9

కార్తీక 9

శ్రీశైలం మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం సుమారు అయిదు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకున్న వారు కూడా మూడు గంటల పాటు దర్శనం కోసం వేచి ఉన్నారు.

కార్తీక 10

కార్తీక 10

కార్తీక పౌర్ణమి దీపాల వెలుగులతో రాష్ట్రం శోభాయమానమైంది. రాష్ట వ్య్రాప్తంగా భక్తిశ్రద్ధలతో పౌర్ణమి పండుగను భక్తులు జరుపుకున్నారు.

కార్తీక 11

కార్తీక 11

కార్తీక పౌర్ణమి దీపాల వెలుగులతో రాష్ట్రం శోభాయమానమైంది. రాష్ట వ్య్రాప్తంగా భక్తిశ్రద్ధలతో పౌర్ణమి పండుగను భక్తులు జరుపుకున్నారు.

కార్తీక 12

కార్తీక 12

విజయవాడలోని కృష్ణా నదీ తీరంలోను, ఖమ్మం జిల్లా భద్రాచలంలోని పవిత్ర గోదావరి తీరంలోను కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కనుల పండువగా నదీ హారతి ఇచ్చారు.

కార్తీక 13

కార్తీక 13

కార్తీక పౌర్ణమి దీపాల వెలుగులతో రాష్ట్రం శోభాయమానమైంది. రాష్ట వ్య్రాప్తంగా భక్తిశ్రద్ధలతో పౌర్ణమి పండుగను భక్తులు జరుపుకున్నారు.

English summary
The temples in Hydereabad filled with devotees on the occasion of Karthika Pournami
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X