వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ వల్లే!: మంచిపేరు రాలేదని కేసీఆర్ ఆవేదన (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పింఛన్ల మొత్తాన్ని ఐదింతలు పెంచినా మంచిపేరు రాలేదని, దీనికి అధికార యంత్రాంగానిదే బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు.

రూ.200లు ఉన్న పింఛన్‌ను వెయ్యికి పెంచామని, వికలాంగుల పెన్షన్‌ను రూ.500 నుంచి 1500 చేశామని, అయినా ప్రజలు సంతోషంగా లేరని, ప్రభుత్వానికి మంచి పేరే రావడం లేదని, విధానంలో ఏదో లోపం ఉందని, దీనిని సంస్కరించాలని కలెక్టర్లకు సూచించారు.

ఆసరా దక్కడంలేదని ప్రజలు ఎందుకు చనిపోతున్నారని ప్రశ్నించారు. పెన్షన్లలో గందరగోళానికి సాంకేతిక అంశాలే కారణమని జిల్లాల కలెక్టర్లు సీఎంకు తెలిపారు. దీనికి కంప్యూటర్‌ డేటానే కారణమని, క్షేత్రస్థాయిలో తాము 100 మందిని అర్హులుగా ఎంపిక చేస్తే కంప్యూటర్‌లో 50 పేర్లే వస్తున్నాయని, క్షేత్రస్థాయిలో 65 ఏళ్ల వయసు ఉన్నట్లు నమోదు చేస్తే 40 ఏళ్లే అని చూపిస్తోందని, సరైన సమాచారం లేనందువల్లే పెన్షన్లు ఇవ్వలేకపోతున్నామని కలెక్టర్లు బదులిచ్చారు.

కేసీఆర్ సమీక్ష

కేసీఆర్ సమీక్ష

కలెక్టర్ల సమాధానంపై కేసీఆర్ సీఎం స్పందిస్తూ.. పెన్షన్లకు కంప్యూటర్‌తో లింకు తెంపాలని స్పష్టం చేశారు. డిసెంబర్‌ 10-15వ తేదీల్లో రెండు నెలల పింఛన్ల పంపిణీ జరగాలని ఆదేశించారు. పేద ప్రజలకు సహాయం అందించే విషయంలోడబ్బులకు వెనుకాడరాదని స్పష్టం చేశారు.

కేసీఆర్ సమీక్ష

కేసీఆర్ సమీక్ష

సోమవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులతో సీఎం సమావేశమయ్యారు.

కేసీఆర్ సమీక్ష

కేసీఆర్ సమీక్ష

పెన్షన్‌ల పంపిణీ, ఆహా ర భద్రతా కార్డుల జారీ, వాటర్‌గ్రిడ్‌, చెరువుల పునరుద్ధరణ, తెలంగాణకు హరిత హారం, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై ఐదు గంట ల పాటు సమీక్షించారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట నిర్మించే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఒక చోట వీలుకాకుంటే కనీసం రెండు చోట్ల నిర్మించాలని సూచించారు.

 కేసీఆర్ సమీక్ష

కేసీఆర్ సమీక్ష

కంప్యూటర్‌ డేటాతో సంబంధం లేకుండా జనవరి ఒకటో తేదీ నుంచి ఆహార భద్రత కార్డుల కూపన్లు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కేసీఆర్ సమీక్ష

కేసీఆర్ సమీక్ష

ఇందుకోసం ఈ నెలాఖరుకల్లా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలని, దీనికోసం ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్‌ అధికారిని నియమించాలని నిర్దేశించారు.

 కేసీఆర్ సమీక్ష

కేసీఆర్ సమీక్ష

బియ్యం కోటాను పెంచి, జనవరి 1 నుంచి కోటా ప్రకారం కూపన్లు అందించాలన్నారు. మునిసిపాలిటీలను బాగు చేసే బాధ్యత కలెక్టర్లదేనని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రతి మునిసిపాలిటీలో కూరగాయలు, మాంసం మార్కెట్లు ఏర్పాటు చేయాలన్నారు.

English summary
Photos of CM KCR interacting with Collectors and Higher Officials at Secretariat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X