మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినిమా కాదు: 'కొత్త' రాగానే లేచిన కేసీఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల కృషి వల్లే మెదక్‌లో గెలిచామన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సాగించిన గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు. టీడీపీతో కలిసినందుకు బీజేపీకి గట్టి దెబ్బే తగిలిందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కేసీఆర్ సూచించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామ్నారు. పటిష్టమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు.

కేసీఆర్ మార్కు, టీఆర్ఎస్ మార్కు పాలన ఇంకా మొదలుకాలేదన్నారు. అర్హులకే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని, దసరా నుంచి దీపావళి మధ్య చాలా ఉత్తర్వులు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. కాగా, తన వంద రోజుల పాలన పైన అడగగా, మార్కులేసుకోవడానికి ఇదేం సినిమా కాదని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఉప ఎన్నికల సమయంలో అతిగా మాట్లాడిన నేతలకు మెదక్ లోకసభ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పారని, ఇంకా తన మార్క్ పాలన ప్రారంభం కాలేదని, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేయాలి తప్ప ప్రజల ముందు పరువు తీసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు.

కొత్తకు కేసీఆర్ అభినందన

కొత్తకు కేసీఆర్ అభినందన

మెదక్ లోకసభ ఉప ఎన్నికలలో గెలుపొందిన కొత్త ప్రభాకర్ రెడ్డి రాగానే.. మీడియా సమావేశంలో ఉన్న కేసీఆర్ నిలబడి ఆయనతో చేయి కలిపి అభినందనలు తెలిపారు.

కొత్తకు కేసీఆర్ అభినందన

కొత్తకు కేసీఆర్ అభినందన

మెదక్ లోకసభ ఉప ఎన్నికలలో గెలుపొందిన కొత్త ప్రభాకర్ రెడ్డి రాగానే.. మీడియా సమావేశంలో ఉన్న కేసీఆర్ నిలబడి ఆయనతో చేయి కలిపి అభినందనలు తెలిపారు.

పుష్పగుచ్చం

పుష్పగుచ్చం

మెదక్ ఉప ఎన్నికల్లో తన గెలుపు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సుపరిపాలన వల్లనే సాధ్యమైందని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మీడియాతో కేసీఆర్ మాట్లాడుతుండగా కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం.

కేసీఆర్

కేసీఆర్

మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.

కేసీఆర్

కేసీఆర్

ఎన్నికల ప్రచారం సమయంలో కొందరు పనికిమాలిన మాటలు మాట్లాడారన్నారు. అద్భుత విజయం అందించిన మెదక్ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ కృతజ్ఞతలు కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

ఇచ్చిన హామీలను తాము కచ్చితంగా అమలుపరుస్తామన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు, సద్విమర్శలు చేయాలన్నారు. ప్రజల ముందు పరువు తీసుకోవద్దన్నారు.

కేసీఆర్

కేసీఆర్

తెరాస ప్రభుత్వం ఏం చేసినా తప్పు చూపించాలనుకునే విపక్షాలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. తమకు వామపక్షాలు మద్దతు పలికాయని, అందుకు కృతజ్ఞతలు అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

మెదక్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిన విషయం తెలియగానే మీడియా సమావేశం కోసం తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్‌కు ఘన స్వాగతం. అభివాదం చేస్తున్న కేసీఆర్.

కేసీఆర్

కేసీఆర్

మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో తెరాస కార్యకర్తల సంబరాల దృశ్యం.

English summary
Telangana CM K Chandrasekhar Rao speakes to media after bypoll results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X