వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్, కెసిఆర్‌లపై కిరణ్ సంచలనం, చిరుకి సిగ్గులేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెసు పార్టీని మోసం చేయలేదని విభజనతో కాంగ్రెసు పార్టీయే రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కుమ్మక్కయినట్లు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీయే చెప్పారన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న చీకటి ఒప్పందాన్ని కాంగ్రెసు పార్టీ బట్టబయలు చేయాలన్నారు. విభజనతో దేశానికే ప్రమాదమన్నారు. విభజనతో ఒక్క తెలంగాణకు న్యాయం జరిగినా ఊరుకునే వాడినని, ఆ ప్రాంతానికి కూడా ఎలాంటి లాభం లేదన్నారు. తెలంగాణకే ఎక్కువ నష్టమన్నారు.

తాను కాంగ్రెసు పార్టీని మోసం చేశానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవని సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ఇంకా సిగ్గులేకుండా ఆ పార్టీలో ఉన్నారన్నారు. విభజనతో ప్రజలకు కాంగ్రెసు మోసం చేసిందన్నారు. ఆంధ్రాకు వచ్చే నీటిని ఆపే సత్తా ఎవరికీ లేదన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

తెలుగుజాతి విభజనకు కారణమైన పార్టీలను ఓడించాలని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం పిలుపు ఇచ్చారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఓటెయ్యాలన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

ఈ మధ్యనే రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంతంలో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తన వద్దకు వచ్చి కౌగిలించుకున్నాడని, అనంతరం వీపు మీద కత్తిపెట్టాడని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

తెలుగుతల్లిని కాంగ్రెస్ పార్టీయే విడదీసిందన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వం పురిటిలోనే బిడ్డను చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారంటూ.. ఈ పాపంలో బిజెపి హస్తం లేదా? అని కిరణ్ ప్రశ్నించారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. విభజన కోసం తెలుగుదేశం పార్టీ రెండుసార్లు లేఖలు రాసిందని గుర్తు చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి మరల యూటర్న్ తీసుకుందన్నారు. ఇప్పటికే విభజనపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, ఆ బిల్లు వెనక్కి వస్తుందన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెసు పార్టీని మోసం చేయలేదని విభజనతో కాంగ్రెసు పార్టీయే రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కుమ్మక్కయినట్లు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీయే చెప్పారన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న చీకటి ఒప్పందాన్ని కాంగ్రెసు పార్టీ బట్టబయలు చేయాలన్నారు. విభజనతో దేశానికే ప్రమాదమన్నారు. విభజనతో ఒక్క తెలంగాణకు న్యాయం జరిగినా ఊరుకునే వాడినని, ఆ ప్రాంతానికి కూడా ఎలాంటి లాభం లేదన్నారు. తెలంగాణకే ఎక్కువ నష్టమన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

తాను కాంగ్రెసు పార్టీని మోసం చేశానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవని సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ఇంకా సిగ్గులేకుండా ఆ పార్టీలో ఉన్నారన్నారు. విభజనతో ప్రజలకు కాంగ్రెసు మోసం చేసిందన్నారు. ఆంధ్రాకు వచ్చే నీటిని ఆపే సత్తా ఎవరికీ లేదన్నారు.

English summary
Photos of Jai Samaikyandhra chief Kiran Kumar Reddy campaign in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X