వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోప్యంగా కిషన్‌రెడ్డి, ఫ్లెక్సీతో శంకర్రావు డ్రామా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ బిల్లుకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడవద్దని ఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్నారు. ఏ గండం లేకుండా విభజన బిల్లు పూర్తిగా గట్టెక్కాలని కోరుతూ వేంకటేశ్వర స్వామి దీక్ష చేపట్టారు. గత మూడురోజులుగా ఉపవాసం ఉంటున్నారు.

రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోదం లభించేవరకు ఆయన దీక్ష కొనసాగు తుందని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 18న లోక్‌సభలో విభజన బిల్లు పెడతారన్న సమాచారం మేరకు కిషన్‌తో సహా పార్టీ తెలంగాణ నేతలు 16న సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

అప్పటికి బిల్లుపై తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో..ఆమోదానికి గల అన్ని విఘ్నాలూ తొలగిపోవాలంటూ 17వ తేదీన కిషన్ రెడ్డి దీక్ష ప్రారంభించారు. అయితే, ఆ విషయాన్ని పార్టీ వర్గాలు గోప్యంగా ఉంచి బుధవారం వెల్లడించాయి.

కిషన్ 1

కిషన్ 1

'బిల్లు పూర్తిస్థాయిలో ఆమోదం పొందాలని తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామికి కిషన్‌రెడ్డి మొక్కుకున్నారు. ప్రస్తుతం ఉపవాస దీక్ష చేస్తున్నారు' అని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

కిషన్ 2

కిషన్ 2

రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభిస్తే బుధవారమే దీక్షను విరమించుకోవాలని ఆయన అనుకున్నట్లు తెలిపింది. కానీ అలా జరగకపోవడంతో ఆయన దీక్షను కొనసాగిస్తున్నారని వెల్లడించింది.

కిషన్ 3

కిషన్ 3

ఇన్నాళ్లు ఆహారం తీసుకోకపోవడం తో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయాయి. ఆయనకు బుధవారం సాయంత్రం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు మరింత పెరిగి ఆరోగ్యం బాగా క్షీణించిందని, వెంటనే గ్లూకోజ్ తీసుకోవాల్సిందిగా వైద్యులు కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కిషన్ 4

కిషన్ 4

కానీ అందుకు కిషన్ రెడ్డి నిరాకరించి, దీక్షను కొనసాగిస్తున్నారని వివరించాయి. బుధవారం తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరామ్ నాయకత్వంలో ఐకాస నాయకులు దేవీ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, విఠల్ తదితరులు కిషన్‌రెడ్డిని పరామర్శించి, దీక్షను విరమించాల్సిందిగా కోరారు.

శంకర రావు 1

శంకర రావు 1

మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసన సభ్యులు శంకర రావు బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో కాసేపు హడావుడి చేశారు. తెలంగాణ బిల్లు లోకసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన సోనియాకు కృతజ్ఞత తెలియజేశారు.

శంకర రావు 2

శంకర రావు 2

సోనియా గాంధీ ఫ్లెక్సీని తీసుకు వచ్చిన శంకర రావు గుమ్మడికాయతో దిష్టి తీశారు. కొబ్బరికాయ కొట్టారు. దీనికి అసెంబ్లీ అధికారులు అభ్యంతరం చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

శంకర రావు 3

శంకర రావు 3

మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసన సభ్యులు శంకర రావు బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో కాసేపు హడావుడి చేశారు. తెలంగాణ బిల్లు లోకసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన సోనియాకు కృతజ్ఞత తెలియజేశారు.

శంకర రావు 4

శంకర రావు 4

సోనియా గాంధీ ఫ్లెక్సీని తీసుకు వచ్చిన శంకర రావు గుమ్మడికాయతో దిష్టి తీశారు. కొబ్బరికాయ కొట్టారు. దీనికి అసెంబ్లీ అధికారులు అభ్యంతరం చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

శంకర రావు 5

శంకర రావు 5

అనంతరం శంకర రావు విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణను ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షురాలుకు కృతజ్ఞతలు తెలిపారు.

English summary

 Bharatiya Janata Party state president Kishan Reddy continuing his deeksha in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X