వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో శివాజీ కూడా: చానళ్లబ్యాన్‌పై హెచ్చరిక(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను తెలంగాణలో నిలిపివేయడం చట్టవిరుద్దమని, దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు అఖిల పక్షం సోమవారం వినతిపత్రం ఇచ్చింది. అంతకుముందు అఖిలపక్ష సదస్సు జరిగింది. రెండు చానళ్ల ప్రసారాల నిలిపివేత రాజ్యాంగ విరుద్ధమని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుందని అభిప్రాయపడింది. 'ఎన్నాళ్లీ సంకెళ్లు.. నిషేధానికి 100 రోజులు, మీడియా స్వేచ్ఛ పరిరక్షణ'పై ఏబీఎన్, టీవీ9 చానళ్లు సంయుక్తంగా సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సులో పలువురు నేతలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఇది చీకటి రోజని, కేసీఆర్ ఒంటెత్తు పోకడలు సరికావన్నారు. బీజేపీ శాసన సభా పక్ష నేత లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఏకపక్ష ధోరణితో ముందుకు వెళ్తున్నారని, రెండు చానళ్లపై తక్షణమే నిషేధం ఎత్తివేయకుంటే ఇది మహోద్యమంగా మారుతుందన్నారు. ఇతర పార్టీల్లోని వారిని తన పార్టీలో చేర్చుకుంటూ చట్టవిరుద్ధ కార్యక్రమాలకు కేసీఆర్ పాల్పడుతున్నారని నాగం విమర్శించారు.

ఆ రెండు చానళ్ల పైన శాసన సభలో తీర్మానం చేసి 105 రోజులు గడిచినా స్పీకర్, ముఖ్యమంత్రి కేసీఆర్ వాటి పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెస్వోల కేబుల్ వైర్లు కోసే పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకోవద్దని హెచ్చరించారు. విరసం నేత వరవర రావు, హరగోపాల్, చింతల రామచంద్రా రెడ్డి, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నాగేశ్వర్, మాజీ మంత్రి డీకే అరుణ, సినీ నటుడు శివాజీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

అఖిల పక్షం

అఖిల పక్షం

సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు ఢిల్లీలో జరిగాయని తెలంగాణలో మీడియా ఆంక్షలపై చర్చించి ఒక తీర్మానం చేశామని ఆ పార్టీ నేత నారాయణ వెల్లడించారు. దేశంలో తప్పు చేయనివారు ఇద్దరే అని ఒకటి కడుపులో ఉన్న బిడ్డ, రెండు. శవం ఈ రెండే తప్పులు చేయవన్నారు. తప్పులు చేయడం మానవ సహజమని, దానిని పరిష్కరించుకోవడంలోనే గొప్పతనం ఉంటుందన్నారు. దీనికి ఈ రోజుతో స్వస్తి పలకాలని ఆయన అన్నారు. మీడియాను 10 కిలోమీటర్ల లోతున పాతరేస్తామని కేసీఆర్‌ అన్నారని, 10 కిలోమీటర్లు తవ్విన తర్వాత అందులో ఎవరిని పాతిపట్టాలో ప్రజలకు తెలుసునని నారాయణ వెల్లడించారు. కాళోజీ చనిపోవడంతో కేసీఆర్‌ బతికిపోయారని, ఆయన బతికి ఉంటే కాళోజీ కలం గుణపాంలా మారేదని ఆయన అన్నారు. ప్రధాని మోడీని చూసి కేసీఆర్‌ నేర్చుకోవాలన్నారు. కేసీఆర్‌ పిరికిపందలా వ్యవహరిస్తున్నారని, ధైర్యముంటే చానల్స్‌ను నేనే నిలిపివేయించానని చెప్పాలని నారాయణ సవాల్‌ చేశారు. చానళ్ల నిలిపివేతకు, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పడం సరికాదని ఆయన అన్నారు.

అఖిలపక్షం

అఖిలపక్షం

తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఇది చీకటి రోజని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెత్తు పోకడలు సరికావన్నారు.

అఖిలపక్షం

అఖిలపక్షం

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానళ్ల ప్రసారాలపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. కేసీఅర్ పట్టుదలకు పోవద్దని ఆయన సూచించారు. ఈ నిషేధం రెండు చానళ్ల సమస్య కాదని మీడియా అంతా ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపు ఇచ్చారు.

అఖిలపక్షం

అఖిలపక్షం

ఆ రెండు చానళ్ల పైన శాసన సభలో తీర్మానం చేసి 105 రోజులు గడిచినా స్పీకర్, ముఖ్యమంత్రి కేసీఆర్ వాటి పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెస్వోల కేబుల్ వైర్లు కోసే పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

గవర్నర్

గవర్నర్

టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను తెలంగాణలో నిలిపివేయడం చట్టవిరుద్దమని, దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు అఖిల పక్షం సోమవారం వినతిపత్రం ఇచ్చింది.

గవర్నర్

గవర్నర్

టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను తెలంగాణలో నిలిపివేయడం చట్టవిరుద్దమని, దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు అఖిల పక్షం సోమవారం వినతిపత్రం ఇచ్చింది.

గవర్నర్

గవర్నర్

టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను తెలంగాణలో నిలిపివేయడం చట్టవిరుద్దమని, దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు అఖిల పక్షం సోమవారం వినతిపత్రం ఇచ్చింది.

English summary
TDP, BJP, CONGRESS Telangana leaders meet Narasimhan at Rajbhavan on ABN, TV9 channels ban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X