వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్రో దూరం పెరుగుతోంది, రాష్ట్రమే భరిస్తుంది: వికలాంగుల కోసం.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెట్రో రైలు ఆలైన్‌మెంట్ మార్చడం వల్ల 3.2 కిలో మీటర్ల మార్గం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ నెల 3న వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నెక్లెస్ రోడ్‌లో నిర్వహించనున్న వికలాంగుల చైతన్య నడక కార్యక్రమాన్ని సోమవారం ఆయన మీడియాకు వివరించారు.

అసెంబ్లీ, సుల్తాన్ బజార్ మార్గంలో మారనున్న ఆలైన్‌మెంట్ మార్పువల్ల మార్గం పెరిగే అవకాశం లేదన్నారు. అయితే పాతబస్తీలో ఆలైన్‌మెంట్ మార్పువల్ల సుమారు 3.2 కి.మీ మార్గం పెరిగే అవకాశం ఉందని, దీనికయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించబోతోందన్నారు.

ఆలైన్‌మెంట్ మార్పుపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారన్నారు. ఆలైన్‌మెంట్ మార్పుపై మెట్రో రైలు నిర్మాణ సంస్థకు ప్రభుత్వం నివేదిక అందజేసిన తర్వాత దానికయ్యే వ్యయాన్ని అధ్యయనం చేయడానికి స్వతంత్ర సంస్థకు అప్పగిస్తామని, వారిచ్చే నివేదిక ఆధారంగా పెరిగే అంచనాపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు.

ఎన్వీఎస్ రెడ్డి

ఎన్వీఎస్ రెడ్డి

మెట్రో రైలు స్టేషన్లలో, అలాగే బోగీలలో వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ఎన్వీఎస్ రెడ్డి

ఎన్వీఎస్ రెడ్డి

వికలాంగుల సౌకర్యార్థం అడ్డంకులు లేకుండా రోడ్డు నుంచి స్టేషన్‌కు, అక్కడి నుంచి లిఫ్ట్ వరకు చక్రాల కుర్చీలు వెళ్లటానికి వీలుగా ర్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు.

ఎన్వీఎస్ రెడ్డి

ఎన్వీఎస్ రెడ్డి


చక్రాల కుర్చీలు నడిపై వారి కదలికలకు అనువుగా హ్యాండ్ రైలు ఏర్పాటు చేయడంతోపాటు, లిఫ్టులు, టికెట్ తీసుకునే మిషన్లు, గేటుల వద్ద వికలాంగులకు అందుబాటులో మీటాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ఎన్వీఎస్ రెడ్డి

ఎన్వీఎస్ రెడ్డి

లిఫ్టులలో మీటల వద్ద బ్రెయిలీ లిపీలో అన్ని భాషలను రాయనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే చూపులేని వారు రోడ్డు నుంచి రైలు బోగీలోకి వెళ్లడానికి కర్ర సహాయంతో శబ్ధం చేయటానికి టెక్టయిల్ స్ట్రిప్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఎన్వీఎస్ రెడ్డి

ఎన్వీఎస్ రెడ్డి

వికలాంగులు, చూపులేని వారి కోసం అన్ని స్టేషన్లలో ప్రత్యేకమైన మరుగుదొడ్లు, హ్యండ్ రైల్‌తో సహ నిర్మిస్తున్నట్టు ఎన్‌విఎస్ రెడ్డి వివరించారు.

English summary
Photos of Metro Rail MD NVS Reddy along with Dissabled Activists PC Metro Bhavan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X