హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరంలోని మూసీ నది జోరుగా పారుతోంది (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మూసి నది పొంగిపొర్లుతోంది. రాష్ట్రంలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసి నది నిండిపోయింది. దీంతో నల్గొండ జిల్లాలోని మూసి నది ఐదు గేట్లు ఎత్తి వేశారు. నగరంలో భారీ వర్షాల కారణంగా నీరు హుస్సేన్ సాగర్, మూసి నదిలోకి చేరుకుంటుంది.

కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాదు మధ్యలో గల హుస్సేన్ సాగర్‌లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. సాగర్ గరిష్ఠ నీటి మట్టం 513.51 అడుగులు కాగా ప్రస్తుతం 513.25 అడుగులకు చేరుకుంది. నగరంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల నుండి చాలా నీరు సాగర్‌లోకి వచ్చి చేరుతోంది.

సాగర్ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్ఎంసి) అధికారులు సాగర్ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రమాదం లేకున్నప్పటికీ భారీగా నీరు చేరుతుండటంతో అప్రమత్తం చేస్తున్నారు.

మూసీ 1

మూసీ 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసి ముద్దయింది. నగరంలో మురికి నీరు ప్రవహించే మూసీ నది కూడా పారుతోంది.

మూసీ 2

మూసీ 2

హైదరాబాదులో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసి ముద్దయింది. నగరంలో మురికి నీరు ప్రవహించే మూసీ నది కూడా పారుతోంది.

మూసీ 3

మూసీ 3

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసి ముద్దయింది. నగరంలో మురికి నీరు ప్రవహించే మూసీ జోరుగా ప్రవహిస్తోంది.

మూసీ 4

మూసీ 4


హైదరాబాదులో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసి ముద్దయింది. నగరంలో మురికి నీరు ప్రవహించే మూసీ నది జోరుగా పారుతోంది. చూస్తున్న ప్రజలు.

English summary
The water level in Hussain Sagar, Hyderabad reached 513.25 feet though maximum water level is 513.51.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X