వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షిప్పింగ్ హార్బర్‌లో నిర్మల, కోపమొచ్చింది (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఫిషింగ్ హార్బర్‌లో పరిస్థితుల పైన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు పెదవి విరిచారు.

శనివారం ఫిషింగ్ హార్బర్‌ను నిర్మలా సీతారామన్ సందర్శించారు. మరబోట్లు, జెట్టీలు, ఎగుమతి కేంద్రాలు, మత్స్య ఉత్పత్తులు, అక్షన్ కేంద్రాలను పరిశీలించారు.

పారిశుద్ధ పరిస్థితుల పైన కేంద్రమంత్రి ఎంపెడా చైర్మన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులు పలు రకాల చేపలను ఆమెకు చూపించారు.

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

వ్యవసాయశాఖకు అనుబంధంగా వున్న మత్స్య శాఖను నౌకాయాన, వాణిజ్య, పరిశ్రమల శాఖలతో అనుసంధానం చేసి మత్స్యరంగాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

విశాఖలోని ఫిషింగ్‌ హార్బర్‌ను శనివారం సందర్శించారు. అనంతరం ఆమె మత్స్యకార సంఘాలు, మత్స్య పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తామని హామీ ఇచ్చారు.

 నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

రాష్ట్రంలో ప్రస్తుతం రూ.13 వేల కోట్లతో కొనసాగుతున్న మత్స్య వాణిజ్యాన్ని 20 వేల కోట్లకు పెంచ నున్నట్టు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

 నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

అలాగే పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్‌, మత్స్య పరిశ్రమలు ఏర్పాటు చేసి మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తామన్నారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ను అన్నివిధాల అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి పోర్టు ట్రస్టుకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

హార్బర్‌లో చేపల నిల్వ కేంద్రాల ను అభివృద్ధి చేస్తామని, అవసరమైతే భీమిలి తీరంలో మరో ఫిషింగ్‌ హార్బర్‌ను ఏర్పాటు చేసి మత్స్యరంగానికి అందిస్తామన్నారు. హార్బర్‌లో వున్న చేపలు, రొయ్యలను, ఎండుచేపలను పరిశీలించారు.

 నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

హార్బర్‌ను సందర్శించిన మంత్రికి స్థానిక సమస్యలను మత్స్యకార సంఘాల ప్రతినిధులు వివరించారు. మత్స్యకారులకు అవగాహన సదస్సులు నిర్వహించడం లేదని తెలిపారు.

 నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

దీంతో నిర్మలా సీతారామన్‌ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకొకసారి తప్సనిసరిగా సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.

 నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

రింగ్‌ వలలను నిషేధించాలని కోరుతూ పలువురు మత్స్యకారులు మంత్రికి వినతిప్రతం అందజేశారు. వారి సమస్యలను విన్న మంత్రి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

ఫిషింగ్‌ హార్బర్‌లో పారిశుధ్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. హార్బర్‌లో ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారాలు, వ్యర్థాలు, పడివుండడం చూశారు.

 నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

పారిశుధ్యం సక్రమంగా లేకపోవడంపై ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత దారుణంగా పారిశుధ్యం వుంటే ఎలా అని ప్రశ్నించారు.

 నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

పారిశుధ్య మెరుగుకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని నిర్మలా సీతారామన్‌ ఆదేశించారు. ఆమె వెంట విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, పోర్టు ట్రస్టు చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, ఫిషరీస్‌ అధికారులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు వున్నారు.

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

ఫిషింగ్ హార్బర్‌లో పరిస్థితుల పైన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు పెదవి విరిచారు.

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

శనివారం ఫిషింగ్ హార్బర్‌ను నిర్మలా సీతారామన్ సందర్శించారు. మరబోట్లు, జెట్టీలు, ఎగుమతి కేంద్రాలు, మత్స్య ఉత్పత్తులు, అక్షన్ కేంద్రాలను పరిశీలించారు.

 నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

పారిశుద్ధ పరిస్థితుల పైన కేంద్రమంత్రి ఎంపెడా చైర్మన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులు పలు రకాల చేపలను ఆమెకు చూపించారు.

English summary
Photos of Union Minister Nirmala Seetharaman tour in Vishaka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X