హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్, బాబులపై తొగాడియా, రామాలయం కడ్తాం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అయోధ్యలో రామమందిరం కట్టి తీరుతామని, గడ్డం, టోపీల మాయలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పడ్డారని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా గురువారం అన్నారు. కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబులు హిందువుల రక్షణకు దిగి రావాలన్నారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా అయోధ్యలో రామమందిరం కడతామన్నారు.

ప్రేమ పెళ్లికి వీహెచ్‌పీ వ్యతిరేకం కాదని, లవ్ జిహాద్ ప్రేమ వ్యవహారం కాదన్నారు. అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చే కుట అని ధ్వజమెత్తారు. ఈ నెల 25 నుండి 29 వరకు హైదరాబాదులో విశ్వ హిందూ సమ్మేళనం, 28న ఎన్టీఆర్ స్టేడియంలో భాగ్యనగర్ హిందూ శక్తి సంగమం-హనుమాన్ చాలిసా కోటి పారాయణ యజ్ఞం నిర్వహిస్తామన్నారు. కేసీఆర్త చంద్రబాబు హిందువుల్లా ప్రవర్తించి, వారి రక్షణ చేపట్టాలన్నారు.

మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లే కష్టమైతే, కేసీఆర్ 12 శాతం ఇస్తామని తోకలా పట్టుకొని ఊగులాడుతున్నారన్నారు. తెరాస ప్రభుత్వం, పోలీసులు హిందూ వ్యతిరేక పాలన మానుకోకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామన్నారు. షాదీ ముబారక్ పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్ నిజాం తరహా పాలన గురించి ఆలోచించడం సరికాదన్నారు. కాగా, ఆయన భాగ్యనగర్ వీహెచ్‌పీ వెబ్ సైట్ ప్రారంభించారు.

 ప్రవీణ్ తొగాడియా

ప్రవీణ్ తొగాడియా

కేసీఆర్ తీరు మారకుంటే ఈ రాష్ట్రాన్ని రక్షించేందుకు మరో వల్లభాయ్ పటేల్ వస్తారన్నారు. ప్రతి పేద హిందువుకు హైదరాబాదులో గుండె, మూత్రపిండాలు, క్యాన్సర్, వైద్య సేవలు, పర్యాటక, న్యాయ, మత, సంస్కృతి విషయాల్లో సాయమందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్లు 020-66803300, 18602333666కు ఫోన్ చేయాలన్నారు.

 ప్రవీణ్ తొగాడియా

ప్రవీణ్ తొగాడియా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం పైన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా గురువారం అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ప్రవీణ్ తొగాడియా

ప్రవీణ్ తొగాడియా

ప్రవీణ్ తొగాడియా ఉదయం హైదరాబాదుకు వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు.

 ప్రవీణ్ తొగాడియా

ప్రవీణ్ తొగాడియా

తెలంగాణ ప్రభుత్వం హిందూ సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు.

 ప్రవీణ్ తొగాడియా

ప్రవీణ్ తొగాడియా

మతపరమైన రిజర్వేషన్లు చట్ట వ్యతిరేకమని ప్రవీణ్ తొగాడియా అన్నారు. అలాంటప్పుడు ఆయన ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు.

 ప్రవీణ్ తొగాడియా

ప్రవీణ్ తొగాడియా

హైదరాబాదులో ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరిగే హిందూ సమ్మెళనం వివరాలు ప్రవీణ్ తొగాడియా వెల్లడించారు.

 ప్రవీణ్ తొగాడియా

ప్రవీణ్ తొగాడియా

అనంతరం ఆయన భాగ్యనగరం విశ్వహిందూ పరిషత్ వెబ్ సైట్ ప్రారంభించారు. ఆయన తెలుగు రాష్ట్రాల పర్యటన నిమిత్తం వచ్చారు.

English summary
Photos of Praveen Thogadia Launching VHP website at Shamshabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X