హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇఫ్లూ విద్యార్థినిపై హాస్టల్లోనే రేప్, అరెస్ట్: ధర్నా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు విద్యార్థులు తోటి విద్యార్థినిపై అత్యాచారం చేశారు. నాలుగు నెలల క్రితం ఇదే వర్సిటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థి తన సహ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించిన సంఘటన మరువక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తోంది.

24 గంటల తర్వాత ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థిని ఉన్నత విద్య కోసం నగరానికి వచ్చి ఇఫ్లూలో ఎంఏ (ఇంగ్లిష్‌) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. క్యాంపస్‌లో ఉన్న హాస్టల్‌లోనే ఉంటోంది.

అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నితిన్‌ సోలసముద్రం(22) ఇక్కడే ఎంసీజే మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అక్టోబరు 31న క్యాంపస్‌లోని బషీర్‌ హాస్టల్‌లో ఉండే తన స్నేహితురాలి గదికి బాధిత విద్యార్థిని వచ్చింది. ఆమె ఇతరులతో కలిసి చదువుకుంటుండటంతో తిరిగి తన గదికి తిరిగి వెళుతోంది. ఈ సమయంలో ఇఫ్లూలోనే ఎంసీజే చదువుతున్న నితిన్‌ మెట్ల వద్ద ఎదురై ఆమెను తన గదికి తీసుకెళ్లాడు.

ఇఫ్లూ

ఇఫ్లూ

కాగా, ఈ సంఘటనకు సంబంధించి ఇఫ్లూ వద్ద పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. సెక్సువల్ హరాస్‌మెంట్ పైన ఈ సైలెన్స్ ఏమిటని ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇఫ్లూ

ఇఫ్లూ

తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు క్యాంపస్‌లో రక్షణ కల్పించాలని పలువురు విద్యార్థినులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు.

ఇఫ్లూ

ఇఫ్లూ

వీసీ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థినులపై అత్యాచారారాలు జరుగుతున్నా, బయటి వ్యక్తులు వచ్చి విద్యార్థులపై దాడులకు దిగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు.

ఇఫ్లూ

ఇఫ్లూ

సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నితిన్‌, జయసింహను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు, బీజేవైఎం నాయకులు కల్యాణ్‌, ఎంఐఎం నాయకుడు శరత్‌, పీడీఎస్‌యూ నాయకులు సత్య, మొయిన్‌ డిమాండ్‌ చేశారు.

ఇఫ్లూ

ఇఫ్లూ

ఇఫ్లూలో జరిగిన సంఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. తనపై అత్యాచారం జరిగిందని ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నాం. బాధితురాలు, నిందితులూ స్నేహితులే. అత్యాచారం చేశారా? లేదా అత్యాచారానికి యత్నించారా? అన్న విషయాలు విచారణలో తేలుతాయి. విచారణలో భాగంగా నలుగుర్ని అదుపులోకి తీసుకున్నాం. తర్వాత ఇద్దర్ని రిమాండ్‌కు పంపాం.

ఇఫ్లూ

ఇఫ్లూ

కాగా, ఈ సంఘటనకు సంబంధించి ఇఫ్లూ వద్ద పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. సెక్సువల్ హరాస్‌మెంట్ పైన ఈ సైలెన్స్ ఏమిటని ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇఫ్లూ

ఇఫ్లూ

తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు క్యాంపస్‌లో రక్షణ కల్పించాలని పలువురు విద్యార్థినులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు.

 ఇఫ్లూ

ఇఫ్లూ

వీసీ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థినులపై అత్యాచారారాలు జరుగుతున్నా, బయటి వ్యక్తులు వచ్చి విద్యార్థులపై దాడులకు దిగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు.

అప్పటికే ఆ గదిలో ఇఫ్లూలో ఎంసీజే పూర్తి చేసి బాగ్‌లింగంపల్లిలోని ఎంఐజీ-2 బ్లాక్‌-8లో నివాసముంటున్న పశ్చిమ గోదావరి జిల్లా మల్కిపురానికి చెందిన రాజసింహ(24) ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఆమెతో సిగరెట్‌ తాగారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితిలో ఉండగానే, ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. మరునాడు ఉదయం మెలకువ వచ్చిన ఆమె, తన గదికి వెళ్లి తోటి విద్యార్థినులతో విషయాన్ని చెప్పింది.

అందరూ కలిసి ఓ అధ్యాపకురాలి సాయంతో వర్సిటీ వీసీకి సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించి, వారిలో నితిన్‌, రాజసింహపై ఐపీసీ 341, 376-జీ(నిర్భయ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ల పైన నిఘాతో బాగ్ లింగంపల్లిలో ఉండగా ఆదివారం సాయంత్రం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఘటనకు ముందు గదిలో ఉన్న మరో వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చారు.

English summary
A 23-year-old postgraduate student of the English and Foreign Languages University (Eflu) was gang-raped by two persons, including a fellow student, in a room at a men's hostel on the campus on Friday night. Police arrested the two culprits on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X