వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్రలో నిలిచిన కేసీఆర్: స్వామి ఆశీస్సులు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి ఆశీర్వచనాలు అందించారు. తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందడుగు వేయాలని దీవించారు.

కేసీఆర్ అహర్నిశలూ శ్రమించి రాష్ట్రాన్ని సాధించి చరిత్రలో నిలిచిపోయారన్నారు. భగవంతుడి దయ, కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం ఎనలేని అభివృద్ధి సాధిస్తుందన్నారు.

తెలంగాణలోని యాదగిరిగుట్ట, బాసర, భద్రాచలం, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో రాఘవేంద్ర స్వామి మఠాలు స్థాపించాలనుకుంటున్నట్టు తెలిపారు. గద్వాలలో చెన్నకేశవ స్వామి దేవాలయంలో రాముల వారి విగ్రహం ప్రతిష్టించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి మఠం కార్యక్రమాలన్నింటికీ సంపూర్ణ సహకారం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

రాఘవేంద్ర మఠం స్వామి

రాఘవేంద్ర మఠం స్వామి

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదులు శనివారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను ఆశీర్వదించారు.

 రాఘవేంద్ర మఠం స్వామి

రాఘవేంద్ర మఠం స్వామి

తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందడుగు వేయాలని దీవించారు.

రాఘవేంద్ర మఠం స్వామి

రాఘవేంద్ర మఠం స్వామి

శాస్త్రాల ప్రకారం ప్రభువుకు సంపద అంటే జనం ఆదరించడం, జనం మద్దతు పలకడం, జనం అభిమానించడమే అన్నారు. అలాంటి ఘనత కేసీఆర్ సాధించారన్నారు. వీరగడ్డ అయిన తెలంగాణలో కేసీఆర్ విశేష కృషితో, అహర్నిషలు శ్రమించి తెలంగాణ రాష్ట్రం సాధించి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారన్నారు.

 రాఘవేంద్ర మఠం స్వామి

రాఘవేంద్ర మఠం స్వామి

హిందూ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అభిమానం పెంచుకున్న కేసీఆర్‌లో దైవభక్తి మెండుగా ఉందని అభిప్రాయపడ్డారు. భగవంతుడి దయ, కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం ఎనలేని విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

English summary
Photos of Raghavendra Matham Swamy meets Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X