వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసుపత్రిలో నిద్రించిన రాజయ్యను అడ్డుకున్నారు: అక్కడే భోజనం, పరీక్షలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య సోమవారం రాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో నిద్రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్కారు ఆసుపత్రుల్లో రోగులు తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారని, వారిలో ఆ భావాన్ని తొలగించేందుకే తాను ఆస్పత్రిలో నిద్రపోయానని చెప్పారు.

ఆసుపత్రుల్లో అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో నర్సుల కొరత తీవ్రంగా ఉందన్నారు. సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.

ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం రాజయ్య ఆస్పత్రి నుంచి తన వాహన కాన్వాయితో బయలుదేరగా, ఉస్మానియా వద్ద ఒప్పంద కార్మికులు ఆందోళనకు దిగారు. రెండు నెలలుగా తమకు జీతాలు అందడం లేదని వారు వాపోయారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలన్నారు. ఈ అంశాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తానన్నారు.

రాజయ్య

రాజయ్య

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య తన ఆసుపత్రి నిద్ర కార్యక్రమంలో.. ఉస్మానియా ఆసుపత్రిలో పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.

రాజయ్య

రాజయ్య

క్లోరోభాం చికిత్సలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకు వస్తామని రాజయ్య చెప్పారు.

రాజయ్య

రాజయ్య

సోమవారం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులను పరామర్శించారు.

రాజయ్య

రాజయ్య

ఆసుపత్రి నిద్రలో తెలుసుకున్న సమస్యలను నివేదిక రూపంలో ప్రతిపాదనలను తయారు చేసి పంపించాలని అధికారులకు సూచించారు.

రాజయ్య

రాజయ్య


దేశంలో ఏ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు విడుదల చేయని విదంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.550 కోట్లు బడ్జెట్లో కేటాయించిందన్నారు.

రాజయ్య

రాజయ్య

గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లకు రూ.100 కోట్ల చొప్పున ఈఎన్టీ రూ.10 కోట్లు, నిలోఫర్‌కు రూ.30 కోట్లు, చెస్ట్ ఆసుపత్రికి రూ.10 కోట్లు, సరోజినీ దేవి ఆసుపత్రికి రూ.10 కోట్లు, ఫీవర్ ఆసుపత్రికి రూ.5 కోట్లు, మెంటల్ ఆసుపత్రికి రూ.10 కోట్లు, ప్రసూతి ఆసుపత్రులకు రూ.25 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించిందన్నారు.

రాజయ్య

రాజయ్య

ప్రభుత్వం ఆసుపత్రులను కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా సోమవారం రాజయ్య ఉస్మానియా ఆసుపత్రిలో బస చేశారు.

 రాజయ్య

రాజయ్య

రాజయ్య ఓఫీ విభాగంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అదే సందర్భంలో కాలి బొటన వేలి గాయానికి సర్జరీ చేయాల్సి వస్తుందని డాక్టర్లు తెలిపారు. అనంతరం షుగర్, బీపీ, రక్త పరీక్షలు చేయించుకున్నారు.

English summary
Photos of RAJAIAH GETS OPERATED FOR HIS TOE AT OSMANIA HOSPITAL.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X