నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అల్లుడు అంటుంటారు: చిరు, స్టాలిన్‌లా ప్రచారం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి తన బస్సుయాత్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీలపై నిప్పులు చెరుగుతున్నారు. మంగళవారం సీమాంధ్ర కాంగ్రెసు నేతల బస్సుయాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొనసాగింది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. సామాజిక న్యాయం కాంగ్రెసుతోనే సాధ్యమన్నారు. చంద్రబాబుకు అధికారమిస్తే సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటున్నారని, తన తొమ్మిదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్ తప్ప ఎక్కడైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. జగన్ జైల్లో ఉంటేనే తాము సానుభూతి పవనాల ఓట్లతో గెలుస్తామని, జగన్ బయటకు వచ్చాక తేండి.. తేండి అంటున్నారని జగన్ పార్టీ నాయకులు వాపోతున్నారని చిరు ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ టిక్కెట్‌కు కోట్లు వసూలు చేస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణలపై చిరు పై విధంగా స్పందించారు.

కాంగ్రెసు పార్టీకి ఇతరులు ఎవరు చేయని ద్రోహాన్ని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేశారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు తరఫున పోటీ చేసే అభ్యర్థులే 2019 ఎన్నికల్లోను సారథులుగా ఉంటారని రఘువీరా రెడ్డి చెప్పారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

నెల్లూరు నగరాన్ని భాగ్యనగరంలా అన్ని విధాలా అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీయేనని చిరంజీవి పేర్కొన్నారు. నెల్లూరులోని కస్తూరిబా గార్డెన్‌లో మంగళవారం జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తన తల్లి అంజనాద్రి పుట్టిన గడ్డ సింహపురి కావడంతో, ఆమెను ఆడపడుచుగా చూస్తే ఆనం సోదరులు తనను మనస్ఫూర్తిగా అల్లుడిగా పిలుస్తారని చెప్పారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

లైట్లు, సిమెంటు రోడ్లతో భాగ్యనగరాన్ని (హైదరాబాద్) తలపించేలా నెల్లూరులో అభివృద్ధి పనులు సాగడం ఎంతో సంతోషకరమన్నారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

రూ.125 కోట్లతో తాగునీటి పథకం పూర్తి చేయడమేగాక నెల్లూరు ప్రజలకు శాశ్వత నీటి సమస్య తీర్చేందుకు ప్రపంచ బ్యాంకు నిధులతో రూ.450 కోట్లతో కొత్త పథకానికి అనుమతులు తెచ్చారన్నారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా శుష్క వాగ్దానాలు చేయదని, చేసిన అభివృద్ధే చెబుతుందని కేంద్ర పర్యాటక శాఖమంత్రి చిరంజీవి చెప్పారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

ఎపిసిసి అధ్యక్షులు రఘవీరా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 847 పదవులు ఉండగా, 400 మందే నామినేషన్లు వేశారంటూ కొందరు కార్యకర్తలను అయోమయంలోకి గురిచేసి నామినేషన్లు కూడా వేయనీయకుండా చేశారని విమర్శించారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలు ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

ఎసి సుబ్బారెడ్డి ఆశయ సాధన కోసమే మెడికల్ కళాశాల తీసుకువచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నగరాభివృద్ధి జరిగిందని, ఇది చూసి ఓర్వలేని కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, విభజనలో తమ తప్పు ఎంత ఉందో అన్ని పార్టీలది అంతే తప్పు ఉందన్నారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

కేంద్ర మంత్రి జెడి శీలం మాట్లాడుతూ బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు లేఖలు ఇవ్వడం వల్లే విభజన జరిగిందని గుర్తు చేశారు. విభజనతోపాటు అభివృద్ధి చేయాలని గట్టిగా కోరామని, అందుకే వివిధ విద్యాసంస్థలు సీమాంధలో నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు.

బస్సుయాత్ర

బస్సుయాత్ర

కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి, రఘువీరాలు కృష్ణార్జులని అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ స్టాలిన్‌లా ఒకరికి ముగ్గురు అన్న సిద్ధాంతంతో ప్రచారాలు సాగించాలని కోరారు.

English summary
Praising Pawan Kalyan for floating a new party, Union minister and PCC election campaign committee chairman K. Chiranjeevi on Monday said his brother was the right person to enter politics. Complimenting Mr Pawan Kalyan’s decision, Mr Chiranjeevi stressed the need for new blood entering politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X