వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖంగుతిన్నారు, తెలుగు మహిళను లాక్కెళ్లారు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి విభజన సెగ తగిలింది. శనివారం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, నాయకులు, కార్యకర్తలు 10 జన్‌పథ్‌‌ను మెరుపు వేగంతో ముట్టడించారు. దాదాపు రెండు గంటల పాటు అక్కడ హైటెన్షన్ నెలకొంది.

అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. వ్యతిరేక నినాదాలతో సోనియా నివాస గృహమున్న 10 జన్‌పథ్ మారుమోగింది. ‘వుయ్ వాంట్ జస్టిస్' అంటూ టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. ఏమాత్రం అవకాశం దొరికినా సోనియా నివాసంలోకి చొచ్చుకువెళ్లాలన్న పట్టుదలతో వ్యవహరించిన టిడిపి కార్యకర్తలు, నాయకుల ప్రయత్నాలు ఫలించలేదు.

తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో టిడిపి కార్యకర్తలు సోనియా ఇంటి వద్ద ఉన్న బారికేడ్స్ ఎక్కి మరీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినదించారు. సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సోనియా నివాస గృహాంలో ప్రవేశించటానికి ఉన్న రెండు గేట్లలో మొదటి గేటు వద్దే టిడిపి కార్యకర్తలను భద్రతా సిబ్బంది నిలిపివేశారు. పోలీసులు తొలుత పార్లమెంట్ సభ్యులను అరెస్టు చేసి తుగ్లక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళా పోలీసులను రప్పించి మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

టిడిపి 1

టిడిపి 1

టిడిపి నాయకులు సోనియా ఇంటి గేటు వద్దే పడుకుని నిరసన తెలిపారు. నినాదాలు చేస్తూ సోనియా నివాసాన్ని హోరెత్తించారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చి, వారిని అదుపులోకి తీసుకొని, వాహనాల్లో తిలక్‌మార్గ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

టిడిపి 2

టిడిపి 2

తెలుగుదేశం ఆందోళన 10 జన్‌పథ్‌ను హోరెత్తించింది. సోనియా డౌన్ డౌన్.. సోనియా గో బ్యాక్.. నినాదాలతో కాంగ్రెస్ అధినేత్రి నివాసం దద్దరిల్లిపోయిది.

టిడిపి 3

టిడిపి 3

సుమారు రెండు గంటల సేపుకార్యకర్తల వ్యతిరేక నినాదాలతో సోనియా నివాస గృహమున్న 10 జన్‌పథ్ మారుమోగింది. ‘వుయ్ వాంట్ జస్టిస్' అంటూ టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు.

టిడిపి 5

టిడిపి 5

సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సోనియా నివాస గృహాంలో ప్రవేశించటానికి ఉన్న రెండు గేట్లలో మొదటి గేటు వద్దే టిడిపి కార్యకర్తలను భద్రతా సిబ్బంది నిలిపివేశారు.

టిడిపి 6

టిడిపి 6

హై సెక్యూరిటీ జోన్‌గా గుర్తింపు పొందిన 10 జనపథ్‌కు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా చేరుకుని నిరసనకు దిగటంతో భద్రతా సిబ్బంది ఖంగుతిన్నారు.

టిడిపి 7

టిడిపి 7

పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌తో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు, మహిళా కార్యకర్తలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.

టిడిపి 8

టిడిపి 8

పోలీసులు తొలుత పార్లమెంట్ సభ్యులను అరెస్టుచేసి తుగ్లక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళా పోలీసులను రప్పించి మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

టిడిపి 9

టిడిపి 9

కార్యకర్తలు ఒక్కసారిగా సోనియా ఇంటివద్ద ఆందోళనకు దిగటంతో క్షణాలలో అదనపు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. రహదారులను మూసివేసి రాకపోకలను నిషేధించారు.

English summary

 TDP MPs, MLAs and leaders were targetted AICC president Sonia Gandhi's 10 Janpath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X