హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కంటే తామే ముందు తెలంగాణ అన్నామని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ బుధవారం అన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను, బలిదానాలను కాంగ్రెస్ ఎప్పటికీ మరువదని, వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

అమరుల కుటుంబాల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చుతామని హామీ ఇచ్చారు. సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించడమే పార్టీ లక్ష్యమని ఆయన తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

హైదరాబాదులోని అంబర్‌పేటలో బుధవారం రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్, కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశానికి పార్టీ జాతీయ నాయకుడు కుంతియా, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానా రెడ్డి, దానం నాగేందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎంపిలు ఎంఎ ఖాన్, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

సభలో జైరాం రమేష్ మాట్లాడుతూ తెలంగాణకు మాత, నిర్మాత సోనియా గాంధీయేనని, ఆమె దృఢ నిశ్చయంతోనే తెలంగాణ ప్రజల దశాబ్దాల కాల సాకారమైందని తెలిపారు.

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

వైయస్ ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేశారన్న విషయం ఆయన తనయుడు జగన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

రాజ్యసభ బిల్లు పాసయ్యే చివరి నిమిషం వరకు హైదరాబాద్‌ను యుటి చేయాలని ఒత్తిడి వచ్చినప్పటికీ సోనియా పట్టుదలతో సంపూర్ణ తెలంగాణ ప్రకటించారని తెలిపారు.

 అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

తెలంగాణ, సీమాంధ్రలు ఇండియా, పాక్‌లు కావని, చారిత్రాత్మక, ఆర్థిక, రాజ్యాంగపరంగా రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయని ఆయన చెప్పారు.

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

కొప్పుల రాజు మాట్లాడుతూ అమరుల సందేశాలకు, ఆత్మ బలిదానాలకు అనుగుణంగా తెలంగాణను సామాజిక తెలంగాణగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల మాట్లాడుతూ తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు ఇళ్లు, ఉపాధి పథకాలతోపాటు ఉద్యోగ భద్రతలను మేనిఫెస్టోలో చేర్చుతామన్నారు.

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

నగరంలో ఐదు ఎకరాల స్థలంలో తెలంగాణ అమరవీరుల మెమోరియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమరుల త్యాగఫలమే తెలంగాణ అని, అలాంటి వారి కుటుంబాలను ఆదుకోవడం కాంగ్రెస్ బాధ్యత అని అన్నారు.

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి, దానం నాగేందర్, ఎంపిలు మధుయాష్కీ, పొన్నం, ఎంఎ ఖాన్, అంజన్ మాట్లాడుతూ సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని, కనుక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

ఇలా ఉండగా ఆత్మీయ సమ్మేళనంలో ఓయు జెఎసి నేతలు కాసేపు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు, అమరవీరుల కుటుంబాలకు అన్ని పార్టీలు 10 శాతం టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జైరాం రమేష్‌కు ఒక మెమొరాండం ఇవ్వడానికి వారు ప్రయత్నించారు.

 అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో విద్యార్థులు ఆందోళనకు దిగి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా ఎంపి విహెచ్, దానం కలుగజేసుకుని మెమొరాండం ఇప్పించడంతో విద్యార్థులు వెనుదిరిగారు.

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

అంజన్, విహెచ్‌ల డ్యాన్స్: విద్యార్థుల ఆగ్రహం

హైదరాబాదులోని అంబర్‌పేటలో బుధవారం రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సభలో అంజన్, విహెచ్ తదితరులు చిందేశారు.

హైదరాబాదులోని అంబర్‌పేటలో బుధవారం రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

English summary
Telangna Martyist Family Members Meeting at Maharana Pratap Function Hall, Amberpet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X