వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉస్మానియా వర్సిటీ మళ్లీ ఉడికిపోయింది (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం గురువారం మరోసారి అట్టుడికింది. తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్పుపై ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా గురువారం ఉదయం ఓయూ విద్యార్థులు ఎన్‌సీసీ గేటు వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి గేటుకు తాళం వేసి విద్యార్థులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఎన్‌సిసి గేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థుల ర్యాలీని అడ్డుకోవడంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. తమ ర్యాలీని అనుమతించాలని పోలీసులను విద్యార్థులు కోరినా వారు ససేమిరా అన్నారు. దానికి ఆగ్రహించిన విద్యార్థులు రాళ్ళతో పోలీసులపై దాడి ప్రారంభించారు. దీనికి ప్రతిగా పోలీసులు సైతం విద్యార్థులపై బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో కొంతమంది విద్యార్థులకు స్వల్పగాయాలు అయ్యాయి.

బైక్ ర్యాలీ

బైక్ ర్యాలీ

సీమాంధ్రకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ తెలంగాణపై మంత్రుల పట్ల కుట్రలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తీరును నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో జెఎసి విద్యార్థి సంఘాల నాయకులతో ఛలో అసెంబ్లీకి బైక్ ర్యాలీని అర్ట్స్ కాలేజీ నుండి ప్రారంభించారు.

శ్రీధర్ బాబుకు బాసట

శ్రీధర్ బాబుకు బాసట

శ్రీ్ధర్‌బాబును శాసనసభా వ్యవహారాల మంత్రిగా తొలగించి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటానని ముఖ్యమంత్రి కలలు కంటున్నారని, ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రం ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ధర్నాకు దిగారు.

ఆర్ట్స్ కళాశాల వద్ద ధర్నా..

ఆర్ట్స్ కళాశాల వద్ద ధర్నా..

శ్రీధర్ బాబు శాఖ మార్పను నిరసిస్తూ ఒయు విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ముందు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి తీరను నిరసించారు.

ఓయులో ప్రదర్శన..

ఓయులో ప్రదర్శన..

విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో ప్రదర్శనకు దిగారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భాష్పవాయు ప్రయోగం

భాష్పవాయు ప్రయోగం

విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయోగించిన బాష్పవాయు గోళాలతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

దిష్టిబొమ్మ దగ్ధం

దిష్టిబొమ్మ దగ్ధం

విద్యార్థులపై బాష్పవాయు గోళాల ప్రయోగానికి నిరసనగా అర్ట్స్ కాలేజీ ఆవరణలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శాసనసభా సమావేశంలోనే తెలంగాణ బిల్లునుపెట్టి చర్చ జరపాలని, లేకపోతే పెద్దయెత్తున ఆందోళన నిర్వహిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.

English summary
Tension prevailed at Osmania University on thursday, as students staged dharna in protest against CM Kiran kumar Reddy act of portfolio change of Sridhar Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X