వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు చెబుతా: కూలిన తోటల్లో విజయమ్మ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బుధవారం శ్రీకాకుళం జిల్లాలో ఫైలిన్ ప్రభావ ప్రాంతాలలో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కొబ్బరి రైతులు, తీర ప్రాంతాల్లోని మత్స్యకారుల సమస్యలను పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. రాష్ట్రంలో సరైన ప్రభుత్వం లేకపోవడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? తెలియని పరిస్థితులతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. తీవ్ర నష్టం జరిగినా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. నష్ట పరిహారం చెల్లించడంలో జాప్యం పట్ల ఆమె నిరసన వ్యక్తం చేశారు. కొబ్బరి, జీడి తదితర పంట తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, బాధితులను ఎలా ఓదార్చోలో అర్థం కావడం లేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు నష్ట పరిహారం పెంచి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇద్దివానిపాలెం గ్రామస్థులకు ప్రత్యేక ఇళ్ల నిర్మాణానికి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో స్థలాలు ఇవ్వడం జరిగిందని, జగన్‌ను ముఖ్యమంత్రి చేసిన తక్షణమే మత్స్యకారుల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. తాము అధికారంలోకి రాగానే సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్నారు. వారికి పక్కా ఇళ్ల నిర్మాణం జరిపి పేదల ప్రభుత్వంగా నిలిచేందుకు కృషి చేస్తామన్నారు. రైతులను ఆదుకుంటామన్నారు.

విజయమ్మ 1

విజయమ్మ 1

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఫైలిన్ తుఫాన్ ప్రభావం వలన నష్ట పోయిన పెద్ద కొజ్జిరియా, చిన్న కొజ్జిరియా కొబ్బరి రైతులను పరామర్శించి తోటలను పరిశీలించారు.

విజయమ్మ 2

విజయమ్మ 2

రాష్ట్రంలో సరైన ప్రభుత్వం లేకపోవడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆరోపించారు.

విజయమ్మ 3

విజయమ్మ 3

కొబ్బరి రైతులు, తీర ప్రాంతంలోని మత్స్యకారుల సమస్యలను పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని వైయస్ విజయమ్మ హామీ ఇచ్చారు.

విజయమ్మ 4

విజయమ్మ 4

తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన ఆమె బుధవారం శ్రీకాకుళం జిల్లాలోని ఇద్దివానిపాలెం, బారువ కొత్తూరు గ్రామాలను సందర్శించారు.

విజయమ్మ 5

విజయమ్మ 5

వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసిన తక్షణమే మత్స్యకారుల సమస్యలు పరిష్కారమవుతాయని వైయస్ విజయమ్మ తన పర్యటనలో అన్నారు.

విజయమ్మ 6

విజయమ్మ 6

తాము అధికారంలోకి రాగానే సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని విజయమ్మ హామీ ఇచ్చారు.

విజయమ్మ 7

విజయమ్మ 7

కొబ్బరి, జీడి, పనస, మామిడి పంటల తోటలు పూర్తిగా ధ్వంసమైనాయని రైతులు తమ బాధలను విజయమ్మ దృష్టికి తీసుకువెళ్లారు.

విజయమ్మ 8

విజయమ్మ 8

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ శ్రీకాకుళం జిల్లాలో ఫైలిన్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.

విజయమ్మ 9

విజయమ్మ 9

విజయమ్మ పర్యటనలో పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాసు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, మాజీ శాసన సభ్యులు ఎంవి కృష్ణారావు, సిరియా సాయిరాజ్ తదితరులు ఉన్నారు.

English summary
YSR Congress party honorary president YS Vijayamma toured in the Cyclone-hit Srikakulam district on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X