వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్షలొచ్చేలా చేస్తా: టిడిపి ఆఫీస్‌లో నాగ్ భార్య (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేస్తామని ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వేడుకలు నిర్వహించారు. ఇందులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం కంటే తెలుగు ఆడబిడ్డలే తెలివైనవాళ్లన్నారు.

ఆయన ఏదో ఒక బడ్జెట్ ప్రవేశ పెడతారని, అదంతా అంకెల గారడీ అన్నారు. ఒకప్పుడు నెలంతా సరిపోయే సరుకులు మూడువేల రూపాయలకు వచ్చేవని, ఇప్పుడు వాటి ధర పన్నెండు వేల పైన ఉంటుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఒకప్పుడు 3వేల రూపాయలకు ఇంట్లోకి సరుకులు వచ్చేవని, ఇప్పుడు 12వేలు దాటుతున్నాయని, అయినా అదే బడ్జెట్‌తో కుటుంబాన్ని నడిపించుకొస్తున్న మహిళలు చిదంబరం కంటే తెలివైన వాళ్లని చంద్రబాబు అన్నారు.

మహిళా దినోత్సవం

మహిళా దినోత్సవం

తాము అధికారంలోకి వస్తే మహిళా బిల్లును ఆమోదించే వరకు పోరాడుతామని చెప్పారు. ఆడపిల్ల పుట్టగానే కొంత డబ్బును డిపాజిట్ చేస్తామన్నారు.

టిడిపి

టిడిపి

చిన్నారి పేరిట డబ్బును డిపాజిట్ చేస్తామనని, ఆమె పెద్ద అయ్యేసరికి లక్షల రూపాయలు వచ్చేలా చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

అమలకు

అమలకు

మహిళా దినోత్సవం సందర్భంగా పలువురిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ శోభా హైమావతి, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు.

అమల

అమల

బెల్టు షాపుల వల్ల మగవారు మద్యానికి అలవాటుపడి త్వరగా చనిపోతుండటంతో మహిళలు వితంతువులు అవుతున్నారని చంద్రబాబు వాపోయారు.

సన్మానం

సన్మానం

బెల్టు షాపులతో వచ్చే ఆదాయంపై ప్రభుత్వాన్ని నడపటం కన్నా మరో దారుణం లేదని చంద్రబాబు అ్నారు. తాము అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తామన్నారు.

మహిళలకు సన్మానం

మహిళలకు సన్మానం

తాము అధికారంలో ఉండగా మహిళలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించామని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.

చిన్నారితో..

చిన్నారితో..

చంద్రబాబు పలువురు మహిళలను సన్మానించారు. గాయకురాలు బాలసరస్వతీ దేవి, నటి రాధిక, హీరో నాగార్జున భార్య, బ్లూక్రాస్ సొసైటి సంస్థ అధ్యక్షురాలు అమల, స్వతంత్ర సమరయోధురాలు వాసిరెడ్డి పార్వతమ్మ తదితరులను సన్మానించారు.

కవిత

కవిత

మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస మహిళా నేతలు హంగామా చేశారు.

తెలంగాణ తల్లికి

తెలంగాణ తల్లికి

మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస మహిళా నేతలు హంగామా చేశారు. తెలంగాణ తల్లికి మొక్కుతూ కవిత

English summary
Photos of Women's day in NTR Trust Bhavan on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X