హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విహెచ్ నోము: బ్రహ్మీ కౌగిలి, టీ నేతలతో సిఆర్(పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సోమవారం హైదరాబాద్‌లోని బాగ్అంబర్‌పేటలో గల తన నివాసంలో దీపావళి పండుగ, కార్తీక మాసంలో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతం, నోముల కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కె.జానారెడ్డి, శ్రీధర్‌బాబు, రఘువీరారెడ్డి, డి.కె.అరుణ, సునీతాలక్ష్మారెడ్డి, దానం నాగేందర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీగౌడ్, రేణుకా చౌదరి, నంది ఎల్లయ్య, వివేక్, ఎమ్మెల్సీలు సత్యనారాయణరాజు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ప్రభుత్వ విప్ అనిల్, లోకాయుక్త చైర్మన్ జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పాల్గొన్నారు.

వి హనుమంతరావు నివాసానికి తెలంగాణ నాయకులు వరుస కట్టారు. కేంద్ర మంత్రి చిరంజీవికి సన్నిహితుడైన రాష్ట్ర మంత్రి సి. రామచంద్రయ్య కూడా విహెచ్ ఇంటికి వచ్చారు. సీమాంధ్రకు చెందిన సి. రామచంద్రయ్య విహెచ్ ఇంటికి రావడం విశేషంగానే చెప్పుకోవాలి.

విహెచ్ ఇంట్లో నోము 1

విహెచ్ ఇంట్లో నోము 1

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు హైదరాబాదులోని తన నివాసంలో సోమవారం దీపావళి పర్వదినం సందర్భంగా నోము నిర్వహించారు. ఈ నోముకు వివిధ రాజకీయ నాయకులను ఆయన ఆహ్వానించారు.

విహెచ్ ఇంట్లో నోము 2

విహెచ్ ఇంట్లో నోము 2

వి హనుమంతరావు తన నివాసంలో నిర్వహించిన నోముకు ప్రముఖ టాలీవుడ్ నటుడు బ్రహ్మానందం కూడా వచ్చారు. విహెచ్ బ్రహ్మానందం ఆలింగనం చేసుకున్నారు.

విహెచ్ ఇంట్లో నోము 3

విహెచ్ ఇంట్లో నోము 3

తన నివాసంలో నోముకు వచ్చిన సినీ నటుడు బ్రహ్మానందంతో వి. హనుమంతరావు సరదాగా ఇలా కనిపించారు.

విహెచ్ ఇంట్లో నోము 4

విహెచ్ ఇంట్లో నోము 4

విహెచ్‌తో పాటు పలువురు బ్రహ్మానందంతో గ్రూప్ ఫొటో దిగుతూ ఇలా కనిపించారు. బ్రహ్మానందం ఇమేజ్‌కు తగినట్లే ఆదరణ.

విహెచ్ ఇంట్లో నోము 5

విహెచ్ ఇంట్లో నోము 5

తన నివాసంలో జరిగిన నోముకు వచ్చిన అతిథులు, రాజకీయ నేతలతో విహెచ్ గ్రూప్ ఫొటో దిగుతూ ఇలా కనిపించారు.

విహెచ్ ఇంట్లో నోము 6

విహెచ్ ఇంట్లో నోము 6

విహెచ్ తన నివాసంలో జరిగిన నోముకు వచ్చిన రాజకీయ నేతలతో సరదాగా గడుపుతూ కనిపించారు. విహెచ్ స్టైలే వేరు..

విహెచ్ ఇంట్లో నోము 7

విహెచ్ ఇంట్లో నోము 7

తన నివాసంలో జరిగిన నోముకు విచ్చేసిన రాజకీయ నేత జెల్లి సిద్ధయ్య తదితరులతో విహెచ్ ఇలా ఫొటోకు ఫోజు ఇచ్చారు.

విహెచ్ ఇంట్లో నోము 8

విహెచ్ ఇంట్లో నోము 8

నోము సందర్భంగా వి హనుమంతరావు తన నివాసంలో ఇలా ఆటవిడుపుగా కనిపించారు. పిల్లలతో సరదాగా...

విహచ్ ఇంట్లో నోము 9

విహచ్ ఇంట్లో నోము 9

దీపావళి సందర్భంగా సోమవారం నిర్వహించిన నోము కార్యక్రమం సందర్భంగా విహెచ్ తన నివాసంలో కుటుంబ సభ్యులతో ఇలా..

నంది ఎల్లయ్యతో...

నంది ఎల్లయ్యతో...

తన నివాసానికి వచ్చిన నంది ఎల్లయ్యతో వి. హనుమంతరావు ఇలా అభిమానం కురిపిస్తూ.. వారిద్దరి మధ్య అనుబంధమే వేరు అన్నట్లు లేరూ..

సుదర్శన్ రెడ్డితో ఇలా..

సుదర్శన్ రెడ్డితో ఇలా..

తన నివాసానికి వచ్చిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డితో వి. హనుమంతరావు ఇలా..

జానారెడ్డితో ఇలా..

జానారెడ్డితో ఇలా..

తన నివాసంలో జరిగిన నోము కార్యక్రమానికి వచ్చిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డికి స్వాగతం పలుకుతూ హనుమంతరావు ఇలా..

సి. రామచంద్రయ్యతో ఇలా..

సి. రామచంద్రయ్యతో ఇలా..

కేంద్ర మంత్రి చిరంజీవికి సన్నిహితుడైన రాష్ట్ర మంత్రి సి. రామచంద్రయ్యతో విహెచ్‌తో పాటు జానారెడ్డి, యాష్కీ, తదితర తెలంగాణ నేతలు ఇలా..

రాష్ట్ర మంత్రులతో..

రాష్ట్ర మంత్రులతో..

తన నివాసంలో జరిగిన నోము కార్యక్రమానికి వచ్చేసిన రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దానం నాగేందర్ తదితరులతో విహెచ్ ఇలా...

డికె అరుణ తదితరులతో..

డికె అరుణ తదితరులతో..

తన నివాసంలో జరిగిన నోము కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర మంత్రులు డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులతో విహెచ్ ఇలా..

రేణుకా చౌదరి, జెపాల్ రెడ్డిలతో ఇలా..

రేణుకా చౌదరి, జెపాల్ రెడ్డిలతో ఇలా..

తన నివాసంలో జరిగిన నోము కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, ఎంపి వివేక్, రేణుకా చౌదరిలతో విహెచ్ ఇలా...

జైపాల్‌తో రేణుకా చౌదరి మాటామంతీ..

జైపాల్‌తో రేణుకా చౌదరి మాటామంతీ..

ఒళ్లో పాపను కూర్చోబెట్టుకుని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో విహెచ్ నివాసంలో మాటామంతీలో రేణుకా చౌదరి ఇలా..

జైపాల్ రెడ్డితో ఇలా..

జైపాల్ రెడ్డితో ఇలా..

కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో విహెచ్‌తో పాటు ఇతర తెలంగాణ నేతలు ఫొటోకు ఫోజు ఇస్తూ ఇలా కనిపించారు.

English summary
Telangana leaders attended for nomu held at Congress Rajyasabha MP V hanumath Rao's residence in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X