వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో బాబు హల్‌చల్, ప్రశ్నించకూడదా? (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కృష్ణా నదీ జలాలపై తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో హల్‌చల్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆ తర్వాత జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్‌ను కలిశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను రద్దు చేసి, కొత్త ట్రిబ్యునల్ వేయాలని ఆయన ఇరువురిని కోరారు.

బ్రిజేష్ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. అయితే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను ప్రశ్నించకూడదని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి చంద్రబాబుకు సూచించారు. ట్రిబ్యునళ్లకు కూడా న్యాయవ్యవస్థ స్థాయి ఉంటుందని, ట్రిబ్యునల్‌కు వ్యక్తిగత ఉద్దేశాలు ఆపాదించకూడదని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రులు జోక్యం చేసుకోవాలని కూడా చంద్రబాబు కోరారు. దీన్ని కూడా జైపాల్ రెడ్డి తప్పు పట్టారు. అలా జోక్యం చేసుకోవడమంటే ప్రభావితం చేయడమే అవుతుందని, న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడం సరి కాదని జైపాల్ రెడ్డి అన్నారు. న్యాయనిపుణులతో సంప్రదించి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై చంద్రబాబు తగిన రీతిలో స్పందించాలని ఆయన సూచించారు.

ఢిల్లీలో చంద్రబాబు

ఢిల్లీలో చంద్రబాబు

సోమవారంనాడు జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.

ఢిల్లీలో ఇలా చంద్రబాబు..

ఢిల్లీలో ఇలా చంద్రబాబు..

గొడుగు కింద ఢిల్లీలో నడుస్తూ చంద్రబాబు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రం విభజన జరగకముందే ఆ తీర్పు వల్ల రాష్ట్రానికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదని, విభజన జరిగితే ఎలా వస్తాయని ఆయన అన్నారు.

రాష్ట్రపతితో కరచాలనం..

రాష్ట్రపతితో కరచాలనం..

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సోమవారం కలిశారు. రాష్ట్రపతితో కరచాలనం చేస్తూ టిడిపి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు ఇలా..

వినతిపత్రం సమర్పిస్తూ..

వినతిపత్రం సమర్పిస్తూ..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పిస్తూ చంద్రబాబు ఇలా.. చాలా రోజుల తర్వాత టిడిపి ఎంపి దేవేందర్ గౌడ్ ఇలా కనిపించారు.

ప్రణబ్ ముఖర్జీతో గ్రూప్ ఫొటో..

ప్రణబ్ ముఖర్జీతో గ్రూప్ ఫొటో..

ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పిస్తున్న చంద్రబాబు, తన ప్రతినిధుల బృందంతో ఇలా కెమెరాకు ఫోజులిచ్చారు.

ప్రణబ్ ముఖర్జీకి వివరిస్తున్న చంద్రబాబు

ప్రణబ్ ముఖర్జీకి వివరిస్తున్న చంద్రబాబు

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగే నష్టాన్ని చంద్రబాబు ప్రణబ్ ముఖర్జీకి వివరిస్తూ ఇలా కనిపించారు.

హరీష్ రావత్‌తో చంద్రబాబు..

హరీష్ రావత్‌తో చంద్రబాబు..

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై కేంద్ర మంత్రి హరీష్ రావత్‌ను చంద్రబాబు కలిశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చంద్రబాబు మంత్రికి వివరించారు.

English summary
Telugudesam party president Nara Chandrababu Naidu met president Pranab Mukherjee and union minister Harish Rawath on brijesh Kumar trubunal judgement on Krishna river water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X